Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty1cb4ff06-45cd-4b15-bd4a-78a776637bd8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty1cb4ff06-45cd-4b15-bd4a-78a776637bd8-415x250-IndiaHerald.jpgతొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం చాలా తక్కువమంది హీరోయిన్స్ కు వస్తుంది. మొదటి సినిమాతోనే ఆడియెన్స్ లో ఓ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత వరుస అవకాశాలు తెచ్చుకుని స్టార్ స్టేటస్ సంపాదిస్తారు. ఇప్పుడు అలాంటి ఫాం లోనే ఉంది ఉప్పెన భామ కృతి శెట్టి. ఏ ముహుర్తాన ఉప్పెన సినిమాకు సైన్ చేసిందో కాని అమ్మడి దశ తిరిగింది. ఆ సినిమాతో తెలుగులో ఆమె సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.Krithi-Shetty{#}bhama;shyam;sudheer babu;Girl;Vaishnav Tej;Sai Pallavi;Fidaa;CBN;Heroine;Cinema;Teluguఒక్క సినిమాతో స్టార్ క్రేజ్.. లైన్ లో 3 సినిమాలు.. ఉప్పెన బ్యూటీని అందుకోవడం కష్టమే..!ఒక్క సినిమాతో స్టార్ క్రేజ్.. లైన్ లో 3 సినిమాలు.. ఉప్పెన బ్యూటీని అందుకోవడం కష్టమే..!Krithi-Shetty{#}bhama;shyam;sudheer babu;Girl;Vaishnav Tej;Sai Pallavi;Fidaa;CBN;Heroine;Cinema;TeluguFri, 25 Jun 2021 18:00:00 GMTతొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం చాలా తక్కువమంది హీరోయిన్స్ కు వస్తుంది. మొదటి సినిమాతోనే ఆడియెన్స్ లో ఓ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత వరుస అవకాశాలు తెచ్చుకుని స్టార్ స్టేటస్ సంపాదిస్తారు. ఇప్పుడు అలాంటి ఫాం లోనే ఉంది ఉప్పెన భామ కృతి శెట్టి. ఏ ముహుర్తాన ఉప్పెన సినిమాకు సైన్ చేసిందో కాని అమ్మడి దశ తిరిగింది. ఆ సినిమాతో తెలుగులో ఆమె సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు డైరక్షన్ లో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఆ సినిమాతో తెలుగు యూత్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలో ఆమె చూపించిన అభినయం అందరిని ఫిదా చేసింది. అందం, అభినయం సొంతమైన అమ్మడికి ఉప్పెన హిట్ తో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే సెట్స్ మీద రెండు సినిమాలు ఉన్నాయి. త్వరలో మరో సినిమా కూడా షూటింగ్ స్టార్ట్ అవబోతుంది.

నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో సాయి పల్లవి కూడా ఒక హీరోయిన్ గా చేస్తుంది. ఇక సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కూడా అమ్మడు నటిస్తుంది. ఈ రెండు సినిమాలే కాదు రామ్, లింగుసామి కాంబో సినిమాలో కూడా కృతి శెట్టికి ఛాన్స్ వచ్చింది. ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా కూడా అమ్మడి క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ మూడు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. తనకు వచ్చిన ఈ క్రేజ్ తో కృతి శెట్టి రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టు టాక్. ఉప్పెనకు 10 లక్షల లోపే రెమ్యునరేషన్ గా అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సినిమాకు 75 లక్షల నుండి కోటి అనేస్తుందట. అయినా కూడా ఆమె అడిగినంత ఇచ్చి కృతి శెట్టిని హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.





విజయ్ పై ఆగ్రహంలో తమిళులు.. భాషను మర్చిపోయాడా!!

మందు మానేసినట్టు ప్రకటించిన తారలు

బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇస్తే.. గాలి తీసేసుకున్నాడు..!!

హరీష్-పవన్ కాంబోపై ఊహించని టాక్..?

ఒక్క సినిమాతో స్టార్ క్రేజ్.. లైన్ లో 3 సినిమాలు.. ఉప్పెన బ్యూటీని అందుకోవడం కష్టమే

ఆ కుర్ర హీరో సినిమాలో అనుష్క అతిధి పాత్ర... ?

‘క్యాలీఫ్లవర్‌’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..?

దానివల్లే లారెన్స్ డైరెక్షన్ కి దూరం గా ఉంటున్నాడా?

రామ్ చరణ్ కోసం ముగ్గురు అభిమానుల సాహసం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>