Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death2b8daaff-30b4-4ebf-8ad9-23afb46023fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death2b8daaff-30b4-4ebf-8ad9-23afb46023fe-415x250-IndiaHerald.jpgకరోనా తో ఎంతో మంది జీవితాలు దుర్భరంగా మారిపోయాయ్. ముఖ్యంగా వ్యాపారాల్లో నష్టాలతో ఎంతోమంది ఆర్థిక కష్టాల్లో మునిగిపోతే.. మరికొందరికి ఉపాధి దొరక్క అప్పుల పాలైన వారు కూడా ఉన్నారు అయితే పరిస్థితులు చక్కబడేలా కనిపించకపోవడంతో చివరికి ఎంతోమంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుల బాధ తాళలేక ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రేమగా పెంచుకుంటున్న కుక్కను చంపేందుకు ప్రయత్నించారు అనంతరం భాDeath{#}Husband;House;News;Smart phone;Coronavirus;policeకరోనా తెచ్చిన కష్టం.. మిత్రుడికి మెసేజ్ పెట్టి.. ఆ భార్యాభర్తలు ఏం చేసారంటే?కరోనా తెచ్చిన కష్టం.. మిత్రుడికి మెసేజ్ పెట్టి.. ఆ భార్యాభర్తలు ఏం చేసారంటే?Death{#}Husband;House;News;Smart phone;Coronavirus;policeFri, 25 Jun 2021 10:15:00 GMTకరోనా తో ఎంతో మంది జీవితాలు దుర్భరంగా మారిపోయాయ్. ముఖ్యంగా వ్యాపారాల్లో నష్టాలతో ఎంతోమంది ఆర్థిక కష్టాల్లో మునిగిపోతే.. మరికొందరికి ఉపాధి దొరక్క అప్పుల పాలైన వారు కూడా ఉన్నారు  అయితే పరిస్థితులు చక్కబడేలా కనిపించకపోవడంతో చివరికి ఎంతోమంది మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుల బాధ తాళలేక ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రేమగా పెంచుకుంటున్న కుక్కను చంపేందుకు  ప్రయత్నించారు  అనంతరం భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.



 ఈ ఘటన చెన్నైలోని మండవెలిలో వెలుగులోకి వచ్చింది. లోకనాథన్ శాంతి దంపతులు మండవెలిలో నివసిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. ఇక ప్రేమగా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. అయితే శాంతి ఇంటివద్ద వ్యాపారం చేస్తుండగా.. కార్ల మెకానిక్ షెడ్ లో పనిచేస్తూ ఉండేవాడు భర్త లోకనాథన్. ఇటీవలే కరోనా వైరస్ కారణంగా పని లేక పోవడం వల్ల వ్యాపారం కూడా సాగకపోవడంతో ఇల్లు గడవడానికి అప్పులు చేశారు. ఇక రోజు రోజుకు అప్పుల భారం ఎక్కువ అవుతూ వచ్చింది. అయితే అటు పరిస్థితులు మాత్రం చక్కబడేలా కనిపించలేదు. దీంతో అప్పుల బాధతో మనస్థాపం చెందారు ఇద్దరు భార్యాభర్తలు.



 ఆత్మహత్య చేసుకుంటున్నాము అంటూ మిత్రుడికి ఫోన్ లో మెసేజ్ పంపించారు. ఇక ముందుగా అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్కని చంపేందుకు దానికి పాలిథిన్ కవర్ కట్టి ఊపిరాడకుండా చేశారు. ఆ తర్వాత ఇద్దరు దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇక పాలిథీన్ కవర్ ను నోటితో కొరికేసిన ప్రాణాలను దక్కించుకుంది కుక్క. మిత్రుడి నుండి వచ్చిన ఫోన్ మెసేజ్ ని ఉదయాన్నే చూశాడు ధనపాల్ అనే వ్యక్తి. దీంతో లోకనాథన్ ఇంటికి పరుగులు తీశాడు. ఇక అప్పటికే ఉరికొయ్యకు వేలాడుతూ ఇద్దరు కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.



డెల్టా ప్లస్ చాలా డేంజర్.. పక్క నుండి వెళ్ళిన సోకుతుందట?

ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. ఏమన్నారో తెలుసా?

ఆకలితో ఉంటే.. పడుకుంటావా అనేవారు.. మహిళ ఆవేదన..!!

సేఫ్ గేమ్ తో స్థిరపడాలన్న ఆలోచనలలో నితిన్ !

ఎప్పుడు లేనిది చిరు ఇంత అయోమయం లో ఉన్నాడేంటి?

లొకేషన్ ఆధారంగా జీతాలు.. ఎలాగంటే?

ఫ్యాన్స్ కి షాక్.. పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే..!!

నా భర్తపై ఆ ఫీలింగ్స్ రావట్లేదు.. ఏం చేయాలి..?

జ్యూయలరీ బిజినెస్ లో సమంత పరుగులు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>