TechnologySuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/windows11de41d00f-3a48-4994-9382-aa076abe484b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/windows11de41d00f-3a48-4994-9382-aa076abe484b-415x250-IndiaHerald.jpgటెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన తర్వాతి వెర్షన్ విండోస్ 11ను తీసుకొచ్చేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎప్పుడో 2015లో మైక్రోసాఫ్ట్ నుంచి విండోస్ 10 సాఫ్ట్ వేర్ రిలీజైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి అప్ డేట్ రాలేదు. ఈ అప్ డేట్ కోసం టెక్ ప్రియులు కళ్లల్లో వత్తులేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఈ నూతన ఆపరేటింగ్ సిస్టం మోడల్ ను ఆన్ లైన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఆవిష్కరించింది. మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. విండోస్ చరిత్రలోనే 11వ వెర్షwindows11{#}satya;Microsoft;TECHNOLOGY;software;Google;Dell;HP;Asus;Acer;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Apple;Samsung;Redmi;vegetable marketమైక్రోసాఫ్ట్... ప్లాన్ మామూలుగా లేదుగా.. !మైక్రోసాఫ్ట్... ప్లాన్ మామూలుగా లేదుగా.. !windows11{#}satya;Microsoft;TECHNOLOGY;software;Google;Dell;HP;Asus;Acer;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Apple;Samsung;Redmi;vegetable marketFri, 25 Jun 2021 13:21:00 GMTటెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన తర్వాతి వెర్షన్ విండోస్ 11ను తీసుకొచ్చేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎప్పుడో 2015లో మైక్రోసాఫ్ట్ నుంచి విండోస్ 10 సాఫ్ట్ వేర్ రిలీజైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి అప్ డేట్ రాలేదు. ఈ అప్ డేట్ కోసం టెక్ ప్రియులు కళ్లల్లో వత్తులేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఈ నూతన ఆపరేటింగ్ సిస్టం మోడల్ ను ఆన్ లైన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఆవిష్కరించింది.


మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. విండోస్ చరిత్రలోనే 11వ వెర్షన్ అనేది ప్రత్యేకమైందని అభివర్ణించారు. తర్వాత రానున్న పదేళ్ల వరకు విండోస్ ఆపరేటింగ్ సిస్టం వాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా దీనిని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. విండోస్ 11లో స్టార్ట్ మెనూ కొత్తగా ఉండనుందట. అంతే కాకుండా.. ఇందులో ఉన్న టాస్క్ బార్ ప్రత్యేకంగా ఉంటుందట. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం వాడితే వినియోగదారులు నూతన అనుభూతికి తప్పక గురవుతారని సీఈవో సత్య నాదేళ్ల పేర్కొన్నారు. త్వరలో మార్కెట్ లోకి విడుదల కాబోయే మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ద్వారా ఆండ్రాయిడ్ సేవలను కూడా పొందవచ్చు. ఈ అప్ డేట్ ను త్వరగా రిలీజ్ చేసేందుకు కంపెనీ ప్రతినిధులు తీవ్రంగా పనులు చేస్తున్నారట.


వినియోగదారులను ఊరిస్తున్న విండోస్ అప్ డేట్ మైక్రోసాఫ్ట్ విండోస్ 11ను ఈ సంవత్సరం చివరి వరకు ఆవిష్కరించనున్నట్లు సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. గడిచిన కొన్నేళ్లుగా... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్లు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటడంతో విండోస్ హవా తగ్గింది. ప్రస్తుతం ఆపిల్, గూగుల్ లాంటి దిగ్గజ టెక్నాలజీ సంస్థల నుంచి మైక్రోసాఫ్ట్ కు గట్టి పోటీ ఎదురవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.  మరి వేచిచూడాలి విండోస్ 11వ వెర్షన్ టెక్ ప్రియులను ఎంత మేర ఆకర్షిస్తుందో...



బుల్లి పిట్ట: ఈ ఫ్యాన్ తో ఇంట్లో ఉన్న క్రిములన్ని పరార్..

ఆ హీరోలకు సాధ్యం కానిదీ ధనుష్ కి ఎలా సాధ్యమైంది.?

లొకేషన్ ఆధారంగా జీతాలు.. ఎలాగంటే?

ఆ సినిమాను అంతమంది వదులుకున్నారా? ఎందుకో..

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. వెండి ధర ఇలా .. !!

సేల్స్ మెన్‌గా సోనూసూద్.. సైకిల్‌పైనే మార్కెంటింగ్..?

అతి త్వరలో రాబోతున్న ఐఫోన్ 13..

మరో ఘనత సాధించిన హొండా.. భారీ సేల్స్..

వైరల్ : ఒక్క చొక్కాను ఆవిడ అన్ని సార్లు ధరించినా గుర్తు పట్టలేకపోయారా..?!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>