MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgvc83d3c98-31b7-4d70-8abc-a6316499fbbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgvc83d3c98-31b7-4d70-8abc-a6316499fbbe-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ గురించి.. తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సినిమా హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా తనకు నచ్చిన సినిమాలు తీయడంలో వర్మ దిట్ట. అంతే కాకుండా తాను చెప్పదలుచుకున్నది కూడా సూటిగా చెప్పేస్తుంటాడు. వర్మ చేసే కొన్ని విషయాలు వివాదస్పదంగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలకు అడ్రస్ లా రామ్ గోపాల్ వర్మ మారారనేది అందరూ ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఎల్లప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్మ జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై తనదైన శైలిలో వ్యంగంగా స్పంrgv{#}thikkaకోవిడ్ పేర్లపై వర్మ సెటైర్...?కోవిడ్ పేర్లపై వర్మ సెటైర్...?rgv{#}thikkaFri, 25 Jun 2021 13:30:00 GMTరామ్ గోపాల్ వర్మ గురించి.. తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సినిమా హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా తనకు నచ్చిన సినిమాలు తీయడంలో వర్మ దిట్ట. అంతే కాకుండా తాను చెప్పదలుచుకున్నది కూడా సూటిగా చెప్పేస్తుంటాడు. వర్మ చేసే కొన్ని విషయాలు వివాదస్పదంగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలకు అడ్రస్ లా రామ్ గోపాల్ వర్మ మారారనేది అందరూ ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఎల్లప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్మ జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై తనదైన శైలిలో వ్యంగంగా స్పందిస్తుంటారు. చాలా సార్లు వర్మ చేసే ట్వీట్ లు వైరల్ గా మారి.. కుప్పులు తెప్పలుగా కామెంట్ల వర్షం కురుస్తుంది.


తాజాగా రామ్ గోపాల్ వర్మ మరోమారు తన వ్యంగత్వానికి పదును పెడుతూ.. ట్వీట్ చేశారు. తీరా అది నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకీ విషయమేంటంటే... కరోనా వైరస్‌ నూతన రూపాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరికీ అర్థం కాని రీతిలో, ఎవరూ గుర్తుంచుకోని పద్ధతిలో పేర్లు పెట్టడం తెలిసిందే. తాజాగా వర్మ ఇదే విషయం పై స్పందిస్తూ... పెద్ద, పెద్ద శాస్త్రవేత్తలు జనాలెవరికీ అర్థం కాని రీతిలో నూతన కరోనా వేరియంట్లకు Bi7172, Nk4421, K9472 ,AV415 అనే పేర్లను ఎందుకు పెడతారో అని ప్రశ్నించారు.

అలా కాకుండా నూతన వైరస్‌ రూపాలకు ప్యారేలాల్‌, చింటూ, జాన్‌ డేవిడ్‌, సుబ్బారావు లాంటి పేర్లు పెడితే బాగుంటుందని సూచించారు. ఇలాంటి పేర్లు పెడితే అర్థమవడంతో పాటు గుర్తుంచుకోవడానికి కూడా.. వీలుగా ఉంటుందన్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. తల తిక్క ప్రశ్న వేశారంటూ... కొంత మంది విరుచుకుపడుతుండగా.. సరైన ప్రశ్న అడిగారంటూ వర్మ అభిమానులు మాత్రం సమర్థిస్తున్నారు. వైరల్ గా మారిన ఈ ట్వీట్ కు వేలల్లో కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఎంతైనా వర్మ సినిమా తీసినా, ట్వీట్ వేసినా కూడా సంచలనమే అని పలువురు చర్చించుకుంటున్నారు.

" style="height: 332px;">





కరోనా పేర్లపై వర్మ రియాక్షన్... వైరలవుతున్న ట్వీట్..

మోడీని టార్గెట్ చేస్తూ ఆర్జివి ట్విట్.. షాకింగ్ కామెంట్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>