PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/srinivas-goude1fe1bbc-844b-4c6b-9a55-3e375abd1fc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/srinivas-goude1fe1bbc-844b-4c6b-9a55-3e375abd1fc7-415x250-IndiaHerald.jpgతెలంగాణా వెనుకబాటు తనానికి కారణం వైఎస్ఆర్ అని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ నేతలు మాట్లాడుతుంటే కొందరు సంబందం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాన‌ని మంత్రి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఇస్తాన‌ని మభ్యపెట్టి..అధికారం వచ్చాక యూ టర్న్ తీసుకున్నారంటూ మండిప‌డ్డారు. ఆంధ్ర ప్రజలపై మాకు కోపం లేదని..ఆంధ్రలో లేనట్టుగా తెలంగాణలో అభివృద్ధి, పరిస్థితులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. తండ్రి తప్పు చెస్తే, కొడుకుsrinivas {#}Rakshasudu;dr rajasekhar;Huzur Nagar;Thief;Donga;Ishtam;Government;Y. S. Rajasekhara Reddy;Father;srinivas;Andhra Pradesh;Hyderabad;Jagan;Telangana;Ministerతెలంగాణా మొత్తం వైఎస్ విగ్రహాలే, పీజేఆర్ మృతికి వైఎస్ కారణం: మంత్రి పిడుగులుతెలంగాణా మొత్తం వైఎస్ విగ్రహాలే, పీజేఆర్ మృతికి వైఎస్ కారణం: మంత్రి పిడుగులుsrinivas {#}Rakshasudu;dr rajasekhar;Huzur Nagar;Thief;Donga;Ishtam;Government;Y. S. Rajasekhara Reddy;Father;srinivas;Andhra Pradesh;Hyderabad;Jagan;Telangana;MinisterFri, 25 Jun 2021 13:25:00 GMTతెలంగాణా వెనుకబాటు తనానికి కారణం వైఎస్ఆర్ అని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ నేతలు మాట్లాడుతుంటే కొందరు సంబందం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాన‌ని మంత్రి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఇస్తాన‌ని మభ్యపెట్టి..అధికారం వచ్చాక యూ టర్న్ తీసుకున్నారంటూ మండిప‌డ్డారు. ఆంధ్ర ప్రజలపై మాకు కోపం లేదని..ఆంధ్రలో లేనట్టుగా తెలంగాణలో అభివృద్ధి, పరిస్థితులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. తండ్రి తప్పు చెస్తే, కొడుకు అలా ఉండడు అనుకున్నాం..తప్పు దిద్దుకుంటారని చర్చల ద్వారా మాట్లాడామ‌ని తెలిపారు. తెలంగాణా నీటిని దోచుకుపోతుంటే రాజశేఖర్ రెడ్డిని దొంగ అనక ఏమంటారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు కొడుకు జగన్ అలానే నీటిని దోచుకు పోతున్నారంటూ విమ‌ర్శ‌లు కురిపించారు. 

తెలంగాణకు అన్యాయం జరగనివ్వమంటూ వ్యాఖ్యానించారు. పిజెఆర్ చావుకు వైఎస్ ఆర్ కారణం కాదా..? అంటూ సంచ‌ల వ్యాఖ్య‌లు చేశారు. నక్సల్స్ పేరుతో తెలంగాణ ప్రజలను చంపింది వైఎస్ ఆర్ కాదా అంటూ మండి ప‌డ్డారు. తెలంగాణను దోచుకు పోయారు.. వైఎస్ఆర్ తెలంగాణకి ఏం చేశారు ? అంటూ ప్ర‌శ్నించారు. ఉద్యమంలో ఉన్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు. తెలంగాణ భూములు దోచుకున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. విద్యార్థులకు మార్కులు తక్కువ వేసి వారి భవిష్యత్తుపై దాడి చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ నరరూప రాక్షసుడు  వైఎస్ ఆర్ అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణా వెనుకబాటు తనానికి కారణం వైఎస్ఆర్ కాదా అంటూ ప్ర‌శ్నించారు. మహబుబ్ నగర్ వాసులు 14 లక్షల మంది వలస పోవడానికి కారణం వైఎస్ ఆర్ అని అన్నారు.

నవ్వుతూ నవ్వుతూ తెలంగాణకి వైఎస్ఆర్ అన్యాయం చేసారని ఆరోపించారు. ఊసరవెల్లిలా తెలంగాణ లో తిరుగుతున్నారంటూ వైఎస్ ష‌ర్మిల‌ను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ఆర్ బతికుంటే తెలంగాణ రానియ్యకుండా ఉండేవారని అని ఆంధ్రావారే అనుకుంటారని తెలిపారు. తెలంగాణ తెచ్చుకుంటే సయోధ్య తో ఉందా మనుకుంటే..నోట్లో చక్కెర..కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలు ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ లో ఉండే ఆంధ్రావారు మాకు శత్రువులు కాదని అన్నారు. ఏపీ నీటి పంచాయితీల వల్ల మళ్ళీ గొడవలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలన్నారు. తెలంగాణా కు అన్యాయం జరిగితే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రావారు ఏపీని ప్రశ్నించాలంటూ డిమాండ్ చేశారు.



జాతీయ మ‌హిళా క‌మీష‌న్‌కు వంగ‌ల‌పూడి లేఖ‌

ఎట్టకేలకు పది, ఇంటర్ పరీక్షలని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో దేశంలో చాలా రాష్ట్రాలు పరీక్షలని రద్దు చేశాయి. ఆఖరికి కేంద్ర పరిధిలో ఉండే పరీక్షలు కూడా రద్దు అయ్యాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపించింది. ఎప్పటికప్పుడు పరీక్షలని వాయిదా వేసుకుంటూ వచ్చింది గానీ, రద్దు వైపు మొగ్గుచూపలేదు. అయితే పది, ఇంటర్ పరీక్షలని రద్దు చేయాలని టీడీపీ నేత నారా లోకేష్ గట్టిగానే డిమాండ్ చేశారు.

జగన్ వర్సెస్ లోకేష్: మేనమామ మారిపోయాడా!

పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్ట్ సంచలన నిర్ణయం!

నేను నాన్ లోకల్ ఏంటి.. యూనివర్సల్ : ప్రకాష్ రాజ్

సుడిగాలుల దెబ్బకు ఆ దేశం వణికిపోయింది..!

టీఆర్ఎస్ మూలాల‌పై బీజేపీ దెబ్బ‌? (క‌థ‌నం)

టీఆర్ఎస్‌లో ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు... ఒక కొత్త‌ మంత్రి...!

బిగ్ బ్రేకింగ్: ఏపీ సిఎస్ ను జైలుకి పంపిస్తాం: ఎన్ జీ టి వార్నింగ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>