PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh2194f4d5-465b-4885-bc0a-b882482166bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh2194f4d5-465b-4885-bc0a-b882482166bb-415x250-IndiaHerald.jpgఏపీలో ఉన్నవి రెండే పార్టీలు. మూడవ ఆల్టర్నేషన్ అన్నది బయటకు చెప్పుకున్నంత తేలికగా కుదిరే వ్యవహారం కాదు. ఈ రోజుకు కూడా గ్రాస్ రూట్ లెవెల్ లో ఉన్న పార్టీలు వైసీపీ, టీడీపీ మాత్రమే. ఈ రెండింటి మధ్యనే మరో మూడేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో పోరు సాగనుంది. lokesh{#}Lokeshజగన్ ప్రత్యర్ధిగా లోకేష్... ?జగన్ ప్రత్యర్ధిగా లోకేష్... ?lokesh{#}LokeshFri, 25 Jun 2021 20:00:53 GMTఏపీలో ఉన్నవి రెండే పార్టీలు. మూడవ ఆల్టర్నేషన్ అన్నది బయటకు చెప్పుకున్నంత తేలికగా కుదిరే వ్యవహారం కాదు. ఈ రోజుకు కూడా గ్రాస్ రూట్ లెవెల్ లో ఉన్న పార్టీలు వైసీపీ, టీడీపీ మాత్రమే. ఈ రెండింటి మధ్యనే మరో మూడేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో  పోరు సాగనుంది.

అయితే ఏపీలో జగన్ కి అసలైన ప్రత్యర్ధి ఎవరు అన్న చర్చ అయితే సాగుతోంది. చంద్రబాబు జగన్ కి ప్రత్యర్ధిగా 2014, 2019 ఎన్నికల వరకూ ఉన్నారు. కానీ 2024లో మాత్రం ఆయన కుమారుడు లోకేష్ జగన్ని ఎదుర్కొంటారు అంటున్నారు. టీడీపీని న్యూ ఫేస్ గా లోకేష్ ఉంటారని, ఆ విధంగా జగన్ మీద యూత్ లో ఉన్న క్రేజ్ కి చెక్ పెడతారు అంటున్నారు. ఇప్పటికే ఏపీలో ఆ పని మొదలైనని అంటున్నారు. ఒక వైపు టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు విజయాన్ని  తన ఖాతాలో వేసుకున్న లోకేష్ ఇపుడు నిరుద్యోగులను టార్గెట్ చేసారు.

ఏపీకి పరిశ్రమలు రావడం లేదని, ఉన్నవి కూడా వెళ్ళిపోతున్నాయని లోకేష్ అనడం వెనక యూత్ టార్గెట్ ఉందని అంటున్నారు. ఇక ఏపీలో జాబ్ క్యాలండర్ ని డాబు క్యాలండర్ గా లోకేష్ విమర్శిస్తూ తన మాటల దూకుడు పెంచుతున్నారు. జగన్ని ఫేక్ సీఎం అంటూ రెచ్చగొడుతున్నారు జగన్ రెడ్డీ, దమ్ముంటే సీబీఐ వేయ్ అంటూ కర్నూల్ లో గట్టిగా డిమాండ్ చేసిన లోకేష్ ముందు ముందు మరింత దూకుడు చేస్తారు అంటున్నారు.

దీని మీద టీడీపీతో పాటు వైసీపీలోనూ ఆసక్తికరమైన  చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల నాటికి లోకేష్ మరింత రాటుతేలితే టీడీపీకి అది ప్లస్ అవుతుందని ఆ పార్టీలో అనుకూల చర్చ సాగుతూంటే లోకేష్ జగన్ కి ప్రత్యర్ధిగా ఉండడం తమకే ప్లస్ అవుతుందని వైసీపీలో చర్చ సాగుతోంది. జగన్ ధాటికి చంద్రబాబే ఆగలేకపోయారని, లోకేష్  అసలు తట్టుకోలేరని  వైసీపీలో విశ్లేషణలు ఉన్నాయి. అంతే కాదు లోకేష్ నాయకత్వం పట్ల టీడీపీలోనే వ్యతిరేకత ఉందని ఆయన్ని ముందు పెట్టి కధ నడిపితే టీడీపీకే అది రివర్స్ కొడుతుందని కూడా వైసీపీ పెద్దలు ఊహిస్తున్నారు. మొత్తానికి లోకేష్ ఇలా రెచ్చిపోవడాన్ని బయట గట్టిగా తప్పు పడుతున్నా కూడా లోలోపల వైసీపీ కూడా అదే కోరుకుంటోందిట. లోకేష్ ఎంత ఎదిగితే అంతలా టీడీపీకే ఇబ్బంది అని కూడా అంచనా వేస్తోందిట. చూడాలి మరి ఎవరి ఆశలు, అంచనాలు నిజమవుతాయో.






ఏపీలో ఉన్నవి రెండే పార్టీలు. మూడవ ఆల్టర్నేషన్ అన్నది బయటకు చెప్పుకున్నంత తేలికగా కుదిరే వ్యవహారం కాదు. ఈ రోజుకు కూడా గ్రాస్ రూట్ లెవెల్ లో ఉన్న పార్టీలు వైసీపీ, టీడీపీ మాత్రమే. ఈ రెండింటి మధ్యనే మరో మూడేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో పోరు సాగనుంది.

జగన్ వర్సెస్ లోకేష్: మేనమామ మారిపోయాడా!

జగన్ రాక్షస క్రీడ ముగిసింది.. ఇప్పుడు సంతోషంగా ఉంది : నారా లోకేష్

సీనియర్ నటీమణులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

చినబాబు..నీకు ఆ స్టేజ్ ఇంకా రాలేదు...పవన్ కూడా మేల్కొవాలి!

ప‌రీక్ష‌ల ర‌ద్దు విజ‌యం ఎవ‌రిది..? లోకేష్ భ‌జ‌న మొద‌లైందా..?

అచ్చెన్నా...బాబు ఆ పని చేయనివ్వడం లేదా!

లోకేష్ నాయకత్వానికి అదే అసలు పరీక్ష..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>