PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-439b1c48-bae3-4c65-97ea-344027260e62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-439b1c48-bae3-4c65-97ea-344027260e62-415x250-IndiaHerald.jpgదేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాసరావువుపై జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి పోతిన మ‌హేష్ తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. విజ‌య‌వాడ కార్పోరేష‌న్‌లో 140 పోస్టుల నియామ‌కం పేరుతో మూడు కోట్ల రూపాయలు దోచుకున్నార‌ని...మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మీ,మంత్రి వెల్లంప‌ల్లి ఒక్కొక్క‌రి నుంచి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేశార‌ని ఆయ‌న ఆరోపించారు.ఉద్యోగాల భ‌ర్తీకి పేప‌ర్ నోటిఫికేష‌న్ లేకుండా కార్పోరేష‌న్‌లో ఉద్యోగాలు ఎలా భ‌ర్తీ చేస్తార‌ని పోతిన మ‌హేష్ ప్ర‌శ్నించారు.దీనిపై మున్నిప‌ల్ క‌మిష‌ర్ నోరు విప్పాల‌ని ఆయ‌న డిమాjanasena;{#}BOTCHA SATYANARAYANA;High court;CM;Car;Silver;Ministerవారి అండ‌తోనే ఆ మంత్రి అవినీతి చేస్తున్నారంటున్న జ‌న‌సేన నేత‌వారి అండ‌తోనే ఆ మంత్రి అవినీతి చేస్తున్నారంటున్న జ‌న‌సేన నేత‌janasena;{#}BOTCHA SATYANARAYANA;High court;CM;Car;Silver;MinisterFri, 25 Jun 2021 16:24:33 GMTదేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాసరావువుపై జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి పోతిన మ‌హేష్ తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. విజ‌య‌వాడ కార్పోరేష‌న్‌లో 140 పోస్టుల నియామ‌కం పేరుతో మూడు కోట్ల రూపాయలు దోచుకున్నార‌ని...మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మీ,మంత్రి వెల్లంప‌ల్లి ఒక్కొక్క‌రి నుంచి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేశార‌ని ఆయ‌న ఆరోపించారు.ఉద్యోగాల భ‌ర్తీకి పేప‌ర్ నోటిఫికేష‌న్ లేకుండా కార్పోరేష‌న్‌లో ఉద్యోగాలు ఎలా భ‌ర్తీ చేస్తార‌ని పోతిన మ‌హేష్ ప్ర‌శ్నించారు.దీనిపై మున్నిప‌ల్ క‌మిష‌ర్ నోరు విప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.


మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ దీనిపై స్పందించి విచార‌ణ చేయించాల‌ని..త్వ‌ర‌లోనే మంత్రి వెల్లంపల్లి,మేయ‌ర్ మూడుకోట్లు పుచ్చుకున్న‌ట్లు ఆధారాల‌ను బ‌య‌ట‌పెడ‌తాన‌ని తెలిపారు. మేయ‌ర్ అయిన త‌రువాత భాగ్య‌ల‌క్ష్మీ కియా కారు కొన్నార‌ని ఆ కారుకు డ‌బ్బులు ఎలా వ‌చ్చాయో చెప్పాల‌ని పోతిన మ‌హేష్ డిమాండ్ చేశారు.వెల్లంప‌ల్లి అవినీతిపై సీఎం జ‌గ‌న్‌,జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లేదంటే ముడుపులు మడుతున్నాయ‌ని భావించాల్సి వ‌స్తుంద‌న్నారు. ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల అండ‌తోనే మంత్రి వెల్లంప‌ల్లి అవినీతి చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.ప్రభుత్వం స్పందించకపోతే.. న్యాయ స్థానం ద్వారా పోరాటం చేస్తాన‌ని పోతిన మ‌హేష్ తెలిపారు.
గ‌తంలో దుర్గగుడి ఈవోగా సురేష్‌బాబు నియ‌మాకంపై కూడా పోతిన మ‌హేష్ న్యాయ‌పోరాటం చేశారు.సురేష్‌బాబుకి ఈవోగా ప‌నిచేసేందుకు అర్హ‌త లేదంటూ హైకోర్టు పిటిష‌న్ వేశారు.సురేష్‌బాబు ఈవోగా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి దుర్గ‌గుడిలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను పోతిన మహేష్ బ‌య‌ట‌పెట్టారు.శానిటైజేష‌న్ టెంట‌ర్లు,సెక్యురిటీ టెండ‌ర్ల విష‌యంలో ఈవో,మంత్రి వెల్లంప‌ల్లి అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.దుర్గ‌గుడిలో వెండి విగ్ర‌హాలు చోరీ ఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం క‌లిగించింది.దీనిపై కూడా పొతిన మ‌హేష్ తీవ్ర‌స్థాయిలో ఈవో,మంత్రిపై ఆరోప‌ణ‌లు చేశారు.మంత్రి క‌నుస‌న్నుల్లోనే ఈ విగ్ర‌హాలు చోరి జ‌రిగాయాని ఆయ‌న ఆరోపించ‌డం ప్ర‌కంప‌ణ‌లు రేపాయి.తాజాగా విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లో ఉద్యోగాల కోసం మూడు కోట్ల రూపాయ‌లు వ‌సూళ్లు చేశార‌ని మంత్రి వెల్లంప‌ల్లి,మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మీపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.దీనిపై ఆధారాల‌ను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తాన‌ని మ‌హేష్ తెలిపారు.



హాజ‌రు కాకుండా త‌ప్పించుకున్న ఎంపీ?

అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాత రేస్తాం!

కేసీఆర్ చెప్పేవ‌న్నీ అంకాపూర్ ముచ్చ‌ట్లే - మాజీ ఎంపీ విజ‌య‌శాంతి

కోటా గారి కోడి క‌థ లెక్కుంది..కేసీఆర్ అంకాపూర్ క‌హానీ..!

బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ నేతలకు సీఎం అపాయింట్ మెంట్ ..!

లోకేష్ లీకేజ్ కుట్ర.. మంత్రి సంచలన ఆరోపణలు!

ఆనంద‌య్య‌కు హైకోర్టు న్యాయ‌మూర్తుల సెల్యూట్‌?

మీరు రైలు ఎక్క‌డం కాదు..మ‌మ్మ‌ల్ని విమానం ఎక్కించండి సార్.. !

ఈ వైసీపీ ఎమ్మెల్యేల అగ‌చాట్లు మామూలుగా లేవే... పాపం ఎన్ని క‌ష్టాలు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>