MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli917f8975-ba94-44bf-a1b8-6a532202ae53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli917f8975-ba94-44bf-a1b8-6a532202ae53-415x250-IndiaHerald.jpgప్రస్తుత తరం ప్రేక్షకులు సినిమా ధియేటర్లలో పాటలు వస్తే చాలామంది అసహనానికి లోనవుతున్నారు. ఆ పాట ఎంతో బాగుంటే కాని నేటితరం ప్రేక్షకులు చూడటం లేదు. దీనితో ఇదివరకు లా సందర్భం లేకుండా సినిమాలలో పాటలు వచ్చే సీన్స్ ను పూర్తిగా తగ్గించి వేస్తున్నారు. అయినా కాని టాప్ హీరోల సినిమాలలో పాటలు ఉంటూనే ఉన్నాయి.ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు హడావిడి చేస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో 8 నిముషాల పాటు ఒక పెద్ద పాట ఉంటుందట. 8 చరణాలతో ఒక పల్లవి తో ఉండేrajamouli{#}Alluri Sitarama Raju;Seetharamaraju;Seetharama Raju;Audience;m m keeravani;Komaram Bheem;Jr NTR;Rajamouli;Ram Charan Teja;News;Telugu;Cinemaరాజమౌళి 8 నిముషాల సాంగ్ పై అందరిలోనూ సందేహాలు !రాజమౌళి 8 నిముషాల సాంగ్ పై అందరిలోనూ సందేహాలు !rajamouli{#}Alluri Sitarama Raju;Seetharamaraju;Seetharama Raju;Audience;m m keeravani;Komaram Bheem;Jr NTR;Rajamouli;Ram Charan Teja;News;Telugu;CinemaFri, 25 Jun 2021 08:00:00 GMTప్రస్తుత తరం ప్రేక్షకులు సినిమా ధియేటర్లలో పాటలు వస్తే చాలామంది అసహనానికి లోనవుతున్నారు. ఆ పాట ఎంతో బాగుంటే కాని నేటితరం ప్రేక్షకులు చూడటం లేదు. దీనితో ఇదివరకు లా సందర్భం లేకుండా సినిమాలలో పాటలు వచ్చే సీన్స్ ను పూర్తిగా తగ్గించి వేస్తున్నారు. అయినా కాని టాప్ హీరోల సినిమాలలో పాటలు ఉంటూనే ఉన్నాయి.


ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు హడావిడి చేస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో 8 నిముషాల పాటు ఒక పెద్ద పాట ఉంటుందట. 8 చరణాలతో ఒక పల్లవి తో ఉండే ఈపాట అలనాటి స్వాతంత్రోద్యమ స్పూర్తిని గుర్తుకు చేసేలా ఉంటుంది అని తెలుస్తోంది.


ఈ పాటను కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు పాత్రలను పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లపై జూలై మొదటి వారంలో ఒక భారీ సెట్ చిత్రీకరిస్తారని టాక్. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సాంగ్ ఒకనాటి ‘అల్లూరి సీతారామరాజు’ మూవీలోని ‘తెలుగువీర లేవరా’ పాట స్పూర్తితో ఉంటుందని వార్తలు గుప్పుమంటున్నాయి.


దీనితో ఈ పాట విషయంలో రాజమౌళి సాహసం చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి ట్రెండింగ్ సినిమాలలో పాటలను బాగా ఆదరిస్తున్నప్పటికీ ఆ పాటలు సినిమా కథలో పూర్తిగా ఇమిడిపోయి ప్రేక్షకులకు ఏమాత్రం అసహనం కలిగించకుండా ఉండాలి. ‘ఆర్ ఆర్ ఆర్’ విషయానికి వస్తే ఈ మూవీ చూస్తున్న ప్రేక్షకులకు అలనాటి స్వాతంత్రోద్యమ కాలంలోకి ప్రేక్షకులు వెళ్ళిపోయేలా చేయాలి అందుకోసమే ఈ పాటలో విపరీతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉండేలా రాజమౌళి డిజైన్ చేస్తున్నట్లు టాక్. ఈ ప్రయోగానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మళ్ళీ దేశభక్తి పాటల ట్రెండ్ తెలుగు సినిమాలలో మొదలయ్యే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఈ మూవీ నిడివి దాదాపు 2 గంటల 45 నిముషాలు ఉంటుంది అని ప్రచారం జరుగుతున్న పరిస్థితులలో జక్కన్న ప్రయోగాన్ని ప్రేక్షకులు ఏవిధంగా ఆదరిస్తారో చూడాలి..    








ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా?

రాధే శ్యామ్ షురూ.. !

నేటి నుంచే స్కూళ్లు, కాలేజీలకు రండి.. కేసిఆర్ ఆదేశాలు?

మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !

భర్తకు బుద్ది చెప్పాలనుకుంది ఓ భార్య.. చివరికి షాక్..?

నేడు ఊర్వశి శారద పుట్టిన రోజు, తెలుగు, మలయాళ చిత్రాల్లో ప్రతిభ కనుబరిచిన నటి. బాలనటిగా.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన శారద.

ఆ సినిమాను అంతమంది వదులుకున్నారా? ఎందుకో..

ఇతనితోనా సినిమా అని ఎన్.టి.ఆర్ ను చూసి అనుకున్న డైరక్టర్..?

హ్యాపీ బర్త్ డే : నటి ఊర్వశి శారద పుట్టిన రోజు నేడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>