KidsN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/kids/107/children-118231b1-c882-4dd3-a892-f6992570f258-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/kids/107/children-118231b1-c882-4dd3-a892-f6992570f258-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా విపత్కార సమయంలో సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఈ క్లిష్ట సమయంలో తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లను పిల్లలకు నేర్పించాలి. ఇక వీటితోపాటు పిల్లలకు పోషకాహారం అందించడం చాలా అవసరం.Children {#}Turmeric;Almonds;Spinach;Coriander.;Pepper Powder;Coronavirus;televisionబుడుగు: ఈ ఆహారంతో పిల్లల ఆరోగ్యం క్షేమం..!!బుడుగు: ఈ ఆహారంతో పిల్లల ఆరోగ్యం క్షేమం..!!Children {#}Turmeric;Almonds;Spinach;Coriander.;Pepper Powder;Coronavirus;televisionFri, 25 Jun 2021 17:01:46 GMTదేశంలో కరోనా విపత్కార సమయంలో సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఈ క్లిష్ట సమయంలో తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లను పిల్లలకు నేర్పించాలి. ఇక వీటితోపాటు పిల్లలకు పోషకాహారం అందించడం చాలా అవసరం. అంతేకాదు.. పిల్లల ఆహారం విషయంలో తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక ముఖ్యంగా సూక్ష్మపోషకాలు చిన్నారుల ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

ఈ క్లిష్ట సమయంలో పిల్లలకు ఇంట్లో వండిన తాజా ఆహారాన్నే పెట్టాలి. ఆలా పెట్టడం వలన పిల్లలు గట్‌ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారని అన్నారు. అంతేకాదు.. వాళ్ళకి పాలు, పెరుగు కూడా అందజేయాలి. అయితే పిల్లలకు అందించే ఆహారంలో విటమిన్‌-డి  కూడా చాలా అవసరం అన్నారు. ఇక ప్రాసెస్‌ చేసిన, కృత్రిమ రంగులు కలిపిన ఆహారానికి పిల్లలను దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి. అయితే నిల్వ ఆహారంలో ఉప్పు, చక్కెర అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక వాటికి బదులుగా నిమ్మరసంలో కీరా, పుదీనా, కొత్తిమీర వేసుకొని తాగితే రోజంతా బాడీ హైడ్రేట్‌ అవుతుందని అన్నారు. అంతేకాదు.. పిల్లలు రోజుకు 8 నుంచి 10 కప్పుల నీళ్లు తాగేలా చూడాలి మరి. పిల్లలకు తాగే ద్రవాల్లో కూడా తియ్యదనం లేని పాలు, సిట్రస్‌ పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు అందించాలని అన్నారు. అంతేకాక కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల ఫ్యామిలీ సమయం పెరుగుతుందన్నారు. అంతేకాదు.. భోజనం సమయంలో టీవీ చూసే సమయం తగ్గుతుంది. ఇక పిల్లలకు ఆహార విషయంలో డైట్ ప్లాన్ చేస్తూ ఉండాలి.

పిల్లలు ఉదయం నిద్ర లేచాక 5 నానబెట్టిన బాదం గింజలు, ఎండుద్రాక్ష నానబెట్టిన నీళ్లు 1 గ్లాసు ఇవ్వాలి. ఆ తరువాత బ్రేక్ ఫస్ట్ కి పాలకూర ఇడ్లీలు లేదా పాలకూర దోశె,  పల్లీ చట్నీ లేదా సాంబారు పెట్టాలి. ఆ తరువాత పిల్లలకు పసుపు కలిపిన పాలు, మిరియాల పొడి చల్లిన, ఉడికించిన గుడ్డును తినిపించాలి. మధ్యాహ్నం మిక్స్‌డ్‌ వెజ్‌ పలావ్‌ లేదా సోయా కార్న్‌ పలావ్‌, క్యారెట్‌ రైతా వంటివి పెట్టాలి. ఇక రాత్రి నిద్రకు ముందు పసుపు కలిపిన పాలు తాగించాలి.



ఈ సినిమా కోసం రష్మిక ఏం చేసిందో తెలుసా..?

అలీ నిర్మాత కావటం హ్యాపీ.. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా: ప్రభాస్

ఆ విషయంలో అస్సలు ఆలస్యం చేయని నాని..?

ఆనంద‌య్య‌కు హైకోర్టు న్యాయ‌మూర్తుల సెల్యూట్‌?

అమ్మ: గర్భిణులు ఆకు కూరలు ఏవి తీసుకుంటే మంచిది..??

ఆక్సిజన్ పై కేజ్రీవాల్ మోసం బయటపడింది?

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నటి కూతురు..

'సుమ' బిగ్ అనౌన్స్మెంట్ అదేనా.. ప్లాన్ మాములుగా లేదే..?

నిర్మాతగా రాణించేందుకు నాని రాక్షస ప్రయత్నాలు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>