Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sbib62ac614-776b-48d3-bb00-7207cbb28bfc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sbib62ac614-776b-48d3-bb00-7207cbb28bfc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు వినూత్నమైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. టెక్నాలజీకి అనుగుణంగా పరిస్థితులకు తగ్గట్లుగా ఇప్పటికే ఎన్నో కొత్త సర్వీసులను తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ,ప్రైవేటు రంగ బ్యాంకులు అన్నీ కూడా ఛార్జీల విషయంలో అటు కస్టమర్లకు ఊహించని షాక్ లు ఇస్తున్నాయి. మొన్నటి వరకూ తమ బ్యాంకు కస్టమర్లకు ఉచితంగా అందించిన సర్వీసులకు ఇప్పుడు చార్జీలు వసూలు చేస్తూ షాSbi{#}SBI;Chequeఎస్బిఐ కస్టమర్లకు షాక్.. ఆ చార్జీలు పెరిగాయి?ఎస్బిఐ కస్టమర్లకు షాక్.. ఆ చార్జీలు పెరిగాయి?Sbi{#}SBI;ChequeFri, 25 Jun 2021 19:00:00 GMTప్రస్తుతం దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు వినూత్నమైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. టెక్నాలజీకి అనుగుణంగా పరిస్థితులకు తగ్గట్లుగా ఇప్పటికే ఎన్నో కొత్త సర్వీసులను తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ,ప్రైవేటు రంగ బ్యాంకులు అన్నీ కూడా ఛార్జీల విషయంలో అటు కస్టమర్లకు ఊహించని షాక్ లు ఇస్తున్నాయి.  మొన్నటి వరకూ తమ బ్యాంకు కస్టమర్లకు ఉచితంగా అందించిన సర్వీసులకు ఇప్పుడు చార్జీలు వసూలు చేస్తూ షాక్ ఇస్తున్నాయి.



 ఇక ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని అటు కస్టమర్లకు షాకిచ్చింది. జులై 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి తీసుకు వచ్చేందుకు నిర్ణయించింది ఎస్బిఐ. చెక్ బుక్,ఏటీఎం క్యాష్ విత్ డ్రాయల్స్ వంటి అంశాలకు సంబంధించి చార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తాయి అంటూ స్పష్టం చేసింది. ఇక ఈ కొత్త రూల్స్ ప్రకారం ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే ఇలాంటి చార్జీలు  లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక బ్రాంచ్ కి వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కూడా నాలుగుసార్లు అవకాశం ఉంటుంది. పరిమితులు దాటితే ప్రతి లావాదేవీ 15 రూపాయలు చార్జీ విధించనున్నారు.



 ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకున్న లేదా బ్యాంకుకు వెళ్లి విత్ డ్రాయల్  చేసినా కూడా ఇవే చార్జీలు వర్తిస్తాయి. ఇక అలాగే చెక్ బుక్ రూల్స్ కూడా మార్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సాధారణంగా సేవింగ్స్ ఖాతా కు ఇచ్చే పది పేజీల చెక్ బుక్ ఉచితంగానే  ఇవ్వనున్నారు. కానీ పది పేజీల తర్వాత మళ్లీ చెక్ బుక్ తీసుకోవాలి అంటే పది పేజీలకు 40 రూపాయలు.. 25 పేజీల చెక్ బుక్ కోసం 75 రూపాయలు. ఎమర్జెన్సీ చెక్ బుక్ కోసం 50 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త చార్జీలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఒక్కసారిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛార్జీలు పెంచడంతో కస్టమర్లకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.



రాజుల రాజకీయం: చీలిక వచ్చినట్లేనా!

రజిని సినిమాలకి గుడ్ బై చెప్తున్నాడా ?

సుడిగాలుల దెబ్బకు ఆ దేశం వణికిపోయింది..!

నకిలీ బంగారానికి ఋణం తీసుకోవచ్చా...?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు మైనస్ అదేనా!

అశోక్‌ని టార్గెట్ చేసిన విజయసాయి...మరి వాళ్ళు ఎందుకు అలా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>