HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/carona5d6250b0-bf31-41d0-ad04-0f31d2b67ff8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/carona5d6250b0-bf31-41d0-ad04-0f31d2b67ff8-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళిని కరోనా రక్కసి గడగడళాడిస్తోంది. కరోనా సోకిన వారిలో రక్తం ఎందుకు గడ్డకడుతుందనే విషయంపై ఐర్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి.. దిమ్మ తిరిగిపోయే విషయాలు వెల్లడించారు. ఇన్నాళ్లు ఎందుకు రక్తం గడ్డ కడుతుందనే ప్రశ్నకు వీరి పరిశోధనతో సమాధానం లభించినట్లయింది. విషయమేంటంటే.. పాజిటివ్ వచ్చిన వారిలో కొన్ని ప్రత్యేకమైన అణువులు భారీ సంఖ్యలో పెరుగుతాయట. ఈ కారణం చేతే.. బాడీలో రక్తం గడ్డకడుతుందని వారు నిర్ధారించారు. అంతే కాకుండా ఈ కారణంతో రోగి మరణించే ప్రమాదం పెరుగుతcarona{#}Ireland;Doctor;Coronavirusకరోనా సోకిన వారిలో రక్తం అందుకే గడ్డ కడుతుందా..?కరోనా సోకిన వారిలో రక్తం అందుకే గడ్డ కడుతుందా..?carona{#}Ireland;Doctor;CoronavirusFri, 25 Jun 2021 11:00:00 GMTప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళిని కరోనా రక్కసి గడగడళాడిస్తోంది. కరోనా సోకిన వారిలో రక్తం ఎందుకు గడ్డకడుతుందనే విషయం పై ఐర్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి.. దిమ్మ తిరిగిపోయే విషయాలు వెల్లడించారు. ఇన్నాళ్లు ఎందుకు రక్తం గడ్డ కడుతుందనే ప్రశ్నకు వీరి పరిశోధనతో సమాధానం లభించినట్లయింది.


విషయమేంటంటే.. పాజిటివ్ వచ్చిన వారిలో కొన్ని ప్రత్యేకమైన అణువులు భారీ సంఖ్యలో పెరుగుతాయట. ఈ కారణం చేతే.. బాడీలో రక్తం గడ్డకడుతుందని వారు నిర్ధారించారు. అంతే కాకుండా ఈ కారణంతో రోగి మరణించే ప్రమాదం పెరుగుతుందనే షాకింగ్ విషయాన్ని కూడా వెల్లడించారు. డబ్లిన్‌లోని బ్యూమాంట్ ఆసుపత్రికి వచ్చిన కరోనా రోగులపై ఈ పరిశోధనలు చేశారు. వాళ్ల నుంచి రక్త నమూనాలను తీసుకున్న తర్వాత పరిశోధనలు చేశారు. ఇందులో వెల్లడైన షాకింగ్ విషయమేంటంటే.. వీరిలో విడబ్ల్యుఎఫ్ అణువులు మోతాదుకు మించి..  అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. రక్తం గడ్డ కట్టడానికి ఈ అణువులు ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు.

రక్తం గడ్డ కట్టకుండా ఆపే ADAMTS13 అణువుల స్థాయి విపరీతంగా తక్కువగా ఉందని వెల్లడించారు. కరోనా వ్యాధి గ్రస్తులలో ADAMTS13 మరియు VVF స్థాయిని నిర్వహించడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమట. ఈ విషయాన్ని స్వయంగా ఈ పరిశోధనలు చేసిన డాక్టర్ జామీ ఓసుల్లివన్ తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారంగా.. కోవిషీల్డ్ టీకా తీసుకున్న తర్వాత రక్తస్రావం వల్ల 26 అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 498 కేసులను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారని.. ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి అవకాశాలను కేవలం 26 మంది లో మాత్రమే గుర్తించారట. మరో  విషయం ఏమిటంటే ఎవరైతే కోవాక్సిన్ తీసుకుంటారో... వారిలో రక్తం గడ్డ కట్టినట్లు ఇప్పటి వరకు గుర్తించలేదని చెబుతున్నారు.



దేశంలో చావులు ఆగవా...?

బ్రేకింగ్: హుజారాబాద్ బరిలో షర్మిల...?

బ్రేకింగ్: తెలంగాణా పోలీసులకు సంచలన ఆదేశాలు...?

టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దు స్టూడెంట్స్ కి నష్టమా లాభమా ?

బాలయ్య వినాయక చవితి సెంటిమెంట్ వెంటాడుతున్న యష్ భయాలు !

అమ్మకానికి టాలీవుడ్ హీరోల ఆస్తులు

నెక్స్ట్ సినిమాల కోసం అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న పూజా..?

మళ్లీ లాక్ డౌన్..! దడదడలాడిస్తున్న డెల్టావేరియంట్...!

ఫోన్‌తో కరోనా నిర్ధారణ.. ఎలా అంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>