MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sisters-sweating-for-the-brothers33c602de-b889-4400-a197-2443e9a2306c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sisters-sweating-for-the-brothers33c602de-b889-4400-a197-2443e9a2306c-415x250-IndiaHerald.jpgబ్రదర్స్ కోసం సిస్టర్ తెగ కష్టపడుతున్నారు. వెండితెరపై తమ తమ్ముళ్లూ.. అన్నలు.. ఓ వెలుగు వెలగాలని ఆకాంక్షిస్తూ తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఆ హీరోల కోసం తమ సోదరీమణులు తీసుకుంటున్న శ్రద్ధను చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. tollywood{#}krishnam raju;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Father;producer;Producer;Ram Charan Teja;Success;Prabhas;Reddy;Nani;Chiranjeevi;Cinema;Smart phoneబ్రదర్స్ కోసం చెమటోడుస్తున్న సిస్టర్స్ వీళ్లే..!బ్రదర్స్ కోసం చెమటోడుస్తున్న సిస్టర్స్ వీళ్లే..!tollywood{#}krishnam raju;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Father;producer;Producer;Ram Charan Teja;Success;Prabhas;Reddy;Nani;Chiranjeevi;Cinema;Smart phoneFri, 25 Jun 2021 06:13:03 GMTసినిమాల్లో దర్శక, నిర్మాతలు సిస్టర్స్ సెంటిమెంట్ ను పండించేందుకు తెగ ఆరాటపడతారు. ఇలాంటి కథాంశంతో సినిమాలు తీస్తే.. హిట్స్ పరిగెత్తుకుంటూ వస్తాయని భావిస్తారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తూ.. వీలైనంత సెంటిమెంట్ ను చూపించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తుంటారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. నిజ జీవితంలో కూడా సిస్టర్స్ వాళ్ల బ్రదర్స్ ఎదుగుదలకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.  

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది అడుగుపెట్టారు. చిరు ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తనదైన నటనతో వరుస హిట్ లు అందుకుంటూ మెగా కుటుంబానికి తగ్గ మెగా వారసుడినని నిరూపించుకుంటున్నాడు. అయితే సినిమాల్లో రామ్ చరణ్ తన పాత్రకు తగ్గట్టుగా కనిపించేందుకు.. తన సోదరి సుస్మిత పాత్ర ఎంతో ఉంది. తాను కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు భుజాన వేసుకుంది.  

చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మూవీ ఖైదీ నెంబర్ 150. ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీకి రామ్ చరణ్ నిర్మాతగా మారితే.. కాస్ట్యూమ్ డిజైనర్ గా సుస్మిత కీలక పాత్ర పోషించింది. అంతేకాదు సైరా మూవీ విషయంలో కూడా సుస్మిత కృషి దాగుంది.

ఇక నేచురల్ స్టార్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన నాని కూడా తన సోదరిని దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మీట్ క్యూట్ మూవీతో నాని సోదరి దీప్తి మెగా ఫోన్ పడుతోంది. అయితే ఆమెకు దర్శకత్వంపై కొంత అనుభవం కూడా ఉంది. అనగనగా ఒక నాన్న పేరుతో తీసిన ఓ షార్ట్ ఫిలిమ్ ప్రేక్షక ఆదరణను పొందింది.

సీనియర్ నటుడు కృష్ణం రాజు కూతురు ప్రసీద ఉప్పలపాటి ప్రొడ్యూసర్ గా మారింది. ఆమె నిర్మాణ సారథ్యలో ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్ వస్తోంది. నితిన్ సోదరి నిఖితా రెడ్డి నిర్మాతగా సక్సెస్ అయింది. నితిన్ అప్ కమింగ్ మూవీ మాస్ట్రోకు కూడా నిఖిత ప్రొడ్యూసర్ గా బాధ్యత వహిస్తూ.. తమ్ముడి ఎదుగుదలకు కీలక పాత్ర పోషిస్తోంది.



అతి త్వరలో రాబోతున్న ఐఫోన్ 13..

టీవీ : సినిమాలకు గుడ్బై చెప్పిన రష్మీ.. కారణమేంటి..?

బిగ్ బాస్ సోహైల్.. అనీల్ రావిపుడి.. వాట్ ఈజ్ ద మ్యాటర్..?

మరో రీమేక్ మీద మనసు పడ్డ టాలీవుడ్..!!

ఎన్.టి.ఆర్ కు స్టార్డం తెచ్చిన సింహాద్రి ఆ హీరో చేసి ఉంటే..?

విజయశాంతి నటించిన మొదటి సినిమా సంపాదన ఎంతో తెలుసా ?

'కేజీఎఫ్2' వెంట పడుతున్న వైసీపీ ఎంపీ..?

పోసాని గారే..నాకు లైఫ్ ఇచ్చారు అంటున్న బి.వి.ఎస్.రవి..

విజయశాంతి ని సినిమాల్లోకి తెచ్చిన ఆ నటుడు ఎవరో తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>