MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashourya------aa80aa8f-c532-4eab-96e8-91f6ee5a48bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashourya------aa80aa8f-c532-4eab-96e8-91f6ee5a48bb-415x250-IndiaHerald.jpgస్మార్ట్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు నాగ శౌర్య. ఆయన ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. ఇక నాగ శౌర్య సినీ జీవితంలో పలు సినిమాలు హిట్ అయినప్పటికీ వాటిలో ఛలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. నాగశౌర్య ఛలో మూవీ తర్వాత సొంత బేనర్లో వచ్చిన నర్తనశాల, కణం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.Nagashourya {#}naga shourya;santhosh jagarlapudi;srinivas avasarala;Chalo;Lakshmi Devi;Oohalu Gusagusalade;NagaShaurya;IRA Creations;anil music;sithara;naga;Population;Oh Baby;Samantha;Cinemaఒకేసారి 5 సినిమాలకు ఓకే చెప్పిన నాగశౌర్య.. కారణమిదేనా..?ఒకేసారి 5 సినిమాలకు ఓకే చెప్పిన నాగశౌర్య.. కారణమిదేనా..?Nagashourya {#}naga shourya;santhosh jagarlapudi;srinivas avasarala;Chalo;Lakshmi Devi;Oohalu Gusagusalade;NagaShaurya;IRA Creations;anil music;sithara;naga;Population;Oh Baby;Samantha;CinemaFri, 25 Jun 2021 15:49:01 GMTస్మార్ట్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు నాగ శౌర్య. ఆయన ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. ఇక నాగ శౌర్య సినీ జీవితంలో పలు సినిమాలు హిట్ అయినప్పటికీ వాటిలో ఛలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. నాగశౌర్య ఛలో మూవీ తర్వాత సొంత బేనర్లో వచ్చిన నర్తనశాల, కణం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రస్తుతం నాగ శౌర్య వరుసగా సినిమాలు చేసుకుంటున్నారు.

అంతేకాదు.. సమంత నటించిన ఓ బేబీ మూవీ నాగ శౌర్యకి మరో హిట్ ని తీసుకొచ్చింది. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషించినప్పటికీ నాగ శౌర్య కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. నాగ శౌర్య ప్రస్తుతం ఒకేసారి ఐదు సినిమాలను లైన్ లో పెట్టినట్లు సమాచారం.  ఆయన సొంత బ్యానర్ తో పాటు బయటి బ్యానర్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక ప్రస్తుతం నాగ శౌర్య శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్య మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాగశౌర్య ఫిట్ గా మారారు. ఈ సినిమాలో అతను 8 ప్యాక్ లో కనిపించనున్నారు. అంతేకాక దీంతోపాటు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘వరుడు కావలెను’ అనే మూవీ లో కూడా నాగ శౌర్య నటిస్తున్నారు.

అయితే ఈస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజేంద్ర దర్శకత్వంలో ‘పోలీసువారి హెచ్చరిక’, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అంతేకాక సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై అనిల్ కృష్ణ డైరెక్షన్ లో మరో సినిమా చేసేందుకు నాగశౌర్య ఒప్పుకున్నారు. ఈ మూవీకి అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక నాగ శౌర్య వరుసగా ఐదు సినిమాలు చేస్తూ యూత్ హీరోల్లో అందరికంటే బిజీగా ఉన్నారు.





ఈ సినిమా కోసం రష్మిక ఏం చేసిందో తెలుసా..?

అలీ నిర్మాత కావటం హ్యాపీ.. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా: ప్రభాస్

విజయ్ పై ఆగ్రహంలో తమిళులు.. భాషను మర్చిపోయాడా!!

మందు మానేసినట్టు ప్రకటించిన తారలు

బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇస్తే.. గాలి తీసేసుకున్నాడు..!!

ఒక్క సినిమాతో స్టార్ క్రేజ్.. లైన్ లో 3 సినిమాలు.. ఉప్పెన బ్యూటీని అందుకోవడం కష్టమే..!

హరీష్-పవన్ కాంబోపై ఊహించని టాక్..?

ఆ కుర్ర హీరో సినిమాలో అనుష్క అతిధి పాత్ర... ?

‘క్యాలీఫ్లవర్‌’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>