WinnersDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/kotii-the-great3b015288-5621-4932-8be2-267c2a58075a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/kotii-the-great3b015288-5621-4932-8be2-267c2a58075a-415x250-IndiaHerald.jpgఏదైనా ఒక సాంకేతికతను రూపొందించాలి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.. అంటే మాత్రం అది అంత ఆషామాషీ కాదు. అందుకు ఎన్నో తెలివితేటలు, పెద్దపెద్ద చదువులు ఉంటే తప్పా, ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఇవన్నీ ఉంటే మాత్రం సరిపోతుందా..? అందుకు తగ్గట్టు ఆర్థిక సహాయం కూడా అందాలి. ఇక ఇవన్నీ ఉన్నా కూడా మనలో పట్టుదల ఉండాలి. పట్టుదల లేనిదే, ఏదీ సాధించలేము. మనం ప్రతి రోజూ ఏదో ఒక టెక్నాలజీని చూస్తున్నాము అంటే అది శాస్త్రవేత్తలు, టెక్నాలజీ పరిశోధకులు చేస్తున్న కృషి వల్ల మనం ప్రతిరోజు సరికొత్త టెక్నాలజీని చూస్తున్నాము..kotii-the-great{#}Office;Evening;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Amarnath Cave Temple;Microsoft;gold;Manam;job;Yevaru;Petrol;Fatherప‌దో త‌ర‌గ‌తి పాస్‌... రూ.750 నుంచి రూ.1600 కోట్ల‌కు అధిప‌తి..!ప‌దో త‌ర‌గ‌తి పాస్‌... రూ.750 నుంచి రూ.1600 కోట్ల‌కు అధిప‌తి..!kotii-the-great{#}Office;Evening;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Amarnath Cave Temple;Microsoft;gold;Manam;job;Yevaru;Petrol;FatherThu, 24 Jun 2021 10:20:00 GMT
ఏదైనా ఒక సాంకేతికతను రూపొందించాలి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.. అంటే మాత్రం అది అంత ఆషామాషీ కాదు. అందుకు ఎన్నో తెలివితేటలు, పెద్దపెద్ద చదువులు ఉంటే తప్పా, ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఇవన్నీ ఉంటే మాత్రం సరిపోతుందా..? అందుకు తగ్గట్టు ఆర్థిక సహాయం కూడా అందాలి. ఇక ఇవన్నీ ఉన్నా కూడా మనలో పట్టుదల ఉండాలి. పట్టుదల లేనిదే, ఏదీ సాధించలేము. మనం ప్రతి రోజూ ఏదో ఒక టెక్నాలజీని చూస్తున్నాము అంటే అది శాస్త్రవేత్తలు, టెక్నాలజీ పరిశోధకులు చేస్తున్న కృషి వల్ల మనం ప్రతిరోజు సరికొత్త టెక్నాలజీని చూస్తున్నాము.. అయితే ఇక్కడ ఒక అతను మాత్రం కేవలం చదివింది పదవ తరగతి. కానీ కొత్త కొత్త సాంకేతిక విజ్ఞానాలను డెవలప్ చేసి , పరిశోధకులకు కూడా అంతుచిక్కని సరికొత్త ప్రయోగాలు చేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇక అయితే ఆ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


కోటిరెడ్డి సరిపల్లి.. గుడివాడ దగ్గర్లోని జనార్ధనపురంలో జన్మించారు. ఇక ఈయన కుటుంబం లో  అమ్మ, నాన్న ,ఇద్దరు అక్కలు వుండేవారు. కోటిరెడ్డి పదవ తరగతి పరీక్షల్లో మండలంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇక ఎంసీఏ చేయాలన్న తన కోరిక ఆర్థిక స్తోమత లేకపోవడంతో, తన తండ్రి కాలేజీలో చేర్పించ లేక వ్యవసాయం పనులకు తీసుకెళ్లే వారు. ఇక అక్కడ కొద్దిరోజులు తన తండ్రి తో కలసి వ్యవసాయం పనులు చేసిన తర్వాత సంతృప్తి పడక.."  నాకోసం ఏదో ఒక గొప్ప అవకాశం ఎదురుచూస్తోంది .."అని గట్టిగా విశ్వసించేవారు. అయితే అనుకుంటే సరిపోదు..అందుకు తగ్గట్టు ఏదో ఒకటి చేయాలి..? అయితే  ఏం చేయాలి ? ఎలా చేయాలి ? ఏమి చేస్తే జీవితంలో పైకి ఎదుగుతాము ? అని తీవ్రంగా ఆలోచించగా, ప్రస్తుతం కంప్యూటర్ టెక్నాలజీ యుగం లో ఉన్నాము కాబట్టి, ఆ రంగంలో అయితేనే జీవితంలో పైకి ఎదగగలనని ఆలోచించాడు. కానీ ఇవన్నీ చేయాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు ? అని ఆలోచిస్తున్న సమయంలో ఏదో ఒక పండగకు వాళ్ళ అమ్మ కొత్త బట్టలు కొనుక్కోమని వెయ్యి రూపాయలు ఇచ్చింది. ఇక బట్టలు కొనుక్కోకుండా, రూ .1000 కే  పీ జీ డీ సీ ఏ కోర్సు అనగానే,  గుడివాడ లో అక్కడే కోర్స్ లో చేరి , ఇక అక్కడే ఒక  సంస్థలో  డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు.
ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు అదే సంస్థను లీజుకు తీసుకొని ఒక సంవత్సరంపాటు నడిపించాడు. అప్పటికీ సంతృప్తి పడక, జేబులో ఉన్న 750 రూపాయలు తీసుకొని , తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు కోసం వెతకసాగాడు. ఇక కొంతకాలం తర్వాత కంప్యూటర్ రిపేర్ చేయడం నేర్చుకున్నాడు. కంప్యూటర్లను అసెంబుల్ చేసి విక్రయించడం మొదలుపెట్టి, అక్కడ మంచి గుర్తింపు పొందాడు. తర్వాత మన చుట్టూ ఉన్న ఏ సమస్యకైనా కంప్యూటర్ టెక్నాలజీ పరిష్కారం చూపుతుందని ఆలోచించి, అప్పట్లో బంగారం యొక్క నాణ్యతను నిర్ధారించే సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రజలకు బంగారం యొక్క నాణ్యత విలువల గురించి తెలియజేశారు.
ఇక ఆ తర్వాత కార్పొరేషన్ పెట్రోల్ బంకుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ, ఆ రోజు ఎంత ఇంధనం ఖర్చు అయింది  అని ఖచ్చితంగా చెప్పగల ఒక టెక్నాలజీని కూడా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఒక  కాంట్రాక్టర్ నమ్మి , లక్షల్లో అప్పు చేసి మరీ ఒక ఆఫీసు కూడా పెట్టడం జరిగింది. దాదాపు ఒక 25 మంది ఉద్యోగులకు ఉద్యోగం ఇచ్చి , ఆ  సంస్థను ఏర్పాటు చేశాడు. ఇక తర్వాత కాంట్రాక్టర్ మోసం చేయడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, ఢిల్లీలోని ఐఓసీ ఆఫీస్ కి వెళితే గేటు లోపలికి కూడా రానివ్వలేదు అట. ఇక ఒక్క సారిగా నిరాశతో వెను తిరిగి వెక్కి వెక్కి ఏడ్చారు.ఇక అక్కడ నుంచి వచ్చి, జరిగిందంతా ఉద్యోగులకు చెప్పడంతో, ఉద్యోగులు కూడా నిరాశగా ఆయన వైపు చూడడంతో ఒక్కసారిగా చచ్చిపోవాలనిపించిందట.
ఇక అప్పుడే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏదైనా వ్యాపారం చేయాలంటే నైపుణ్యం ఉంటే సరిపోదు.. ఆర్థికంగా కూడా ఎదిగి ఉండాలని అప్పుడే అర్థం చేసుకొని, అలా మరోసారి ఉద్యోగ బాట పట్టాడు. ఇక జావా కోర్స్ నేర్చుకొని , అతి చిన్న వయసులోనే జావా నేర్చుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇక అప్పటి నుంచి ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. మరోసారి మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా మారి ప్రస్తుతం 14 టెక్ సంస్థలకు అధినేతగా మారాడు. ఏడు వందల రూపాయలతో మొదలైన తన సంపాదన, ప్రస్తుతం 16 వందల కోట్ల టర్నోవర్ కు చేరింది.అతి సామాన్య వ్యక్తి ప్రస్తుతం ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తిగా మారి అందరిచేత మన్ననలు పొందుతున్నారు కోటిరెడ్డి.




రూ.750 తో పాటు తన సంపాదన మొదలుపెట్టి ప్రస్తుతం రూ.1600 కోట్లకు అధిపతి అయ్యారు కోటిరెడ్డి సరిపల్లి.

మట్టిలో మాణిక్యం.. కోటి మందికి ఆదర్శంగా ' కోటిరెడ్డి ' అడుగులు...!

అయ్యో పాపం .. చిన్నారులను అనాధలను చేసిన కరోనా..

ఇప్పుడే చాలా ఆనందంగా ఉందటున్న నరేష్..

నేటి కాంగ్రెస్ సమావేశంలో ఏం జరగబోతోంది..?

అద్భుతం: జీవన సుగంధ పరిమళ 'కోటి'.. ఆయనతో పరిచయమే అపురూపం..!

మా అధ్యక్ష ఎన్నికల పై సీనియర్ నరేష్ సందిగ్ధ కామెంట్స్ !

ప‌త‌కం ప‌ట్టండి.. కోట్లు కొట్టేయండి!

బతికే ఛాన్స్ లేదు.. పుట్టినరోజు వేడుకలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>