BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag08547c49-c5f6-4cc9-8f88-9cd6eecf6f69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag08547c49-c5f6-4cc9-8f88-9cd6eecf6f69-415x250-IndiaHerald.jpgవ‌చ్చే శ్రావ‌ణ‌మాసంలో మెద‌క్‌లో వెయ్యి డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి హ‌రీష్‌రావు వెల్ల‌డించారు. అలాగే న‌ర్సాపూర్‌లో 800, తూప్రాన్‌లో 800, రామాయంపేట‌లో 300 ఇళ్లు కూడా పంపిణీ చేస్తామ‌న్నారు. మెద‌క్‌లో జ‌రిగిన ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌ల్లో మంత్రి పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌లోనే క‌లెక్ట‌ర్‌, ఎస్పీ కార్యాల‌యాల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం జ‌రుగుతుంద‌ని, ఎస్పీ కార్యాల‌tag{#}MLA;District;Ministerశ్రావ‌ణ‌మాసంలో మెద‌క్‌కు శుభ‌వార్త‌?శ్రావ‌ణ‌మాసంలో మెద‌క్‌కు శుభ‌వార్త‌?tag{#}MLA;District;MinisterThu, 24 Jun 2021 18:44:00 GMT
వ‌చ్చే శ్రావ‌ణ‌మాసంలో మెద‌క్‌లో వెయ్యి డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి హ‌రీష్‌రావు వెల్ల‌డించారు. అలాగే న‌ర్సాపూర్‌లో 800, తూప్రాన్‌లో 800, రామాయంపేట‌లో 300 ఇళ్లు కూడా పంపిణీ చేస్తామ‌న్నారు. మెద‌క్‌లో జ‌రిగిన ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌ల్లో మంత్రి పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌లోనే క‌లెక్ట‌ర్‌, ఎస్పీ కార్యాల‌యాల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం జ‌రుగుతుంద‌ని, ఎస్పీ కార్యాల‌యం నిర్మాణ ప‌నులు నెమ్మ‌దిగా జ‌రుగుతున్నాయ‌ని, కాంట్రాక్ట‌ర్‌ను వెంట‌నే తొల‌గించాల‌ని మంత్రి ఆదేశించారు. రైతుబంధు ప‌థ‌కం కింద ఇచ్చిన న‌గ‌దును వెంట‌నే చెల్లించాల‌ని లీడ్ బ్యాంకు అధికారుల‌కు సూచించారు. స‌మావేశంలో మంత్రి హ‌రీష్‌రావుతోపాటు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్‌రెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రీష్‌, ఎస్పీ చంద‌న‌దీప్తి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. మెద‌క్ జిల్లాలో కొవిడ్ పూర్తిగా అదుపులో ఉండ‌టంపై హ‌రీష్‌రావు అధికారుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు.





వ‌చ్చే శ్రావ‌ణ‌మాసంలో మెద‌క్‌లో వెయ్యి డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి హ‌రీష్‌రావు వెల్ల‌డించారు. అలాగే న‌ర్సాపూర్‌లో 800, తూప్రాన్‌లో 800, రామాయంపేట‌లో 300 ఇళ్లు కూడా పంపిణీ చేస్తామ‌న్నారు. మెద‌క్‌లో జ‌రిగిన ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌ల్లో మంత్రి పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఆన్‌లైన్‌లో భారీ మోసానికి పాల్ప‌డుతున్న‌వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు కాయిన్లు, బార్స్ ఇప్పిస్తామంటూ పెట్టుబ‌డులు పెట్టించి ఆ డ‌బ్బుల‌ను మాయం చేస్తున్నారు. మొత్తం న‌లుగురు స‌భ్యుల ముఠా కాగా వీరిలో ఇద్ద‌రిని ముంబ‌యి పోలీసులు అరెస్ట్ చేయ‌గా, మ‌రో ఇద్ద‌రిని రాచ‌కొండ సైబ‌ర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బంగారం ట్రేడింగ్‌లో భారీ మోసం?

కేటీఆర్ ట్వీట్‌కి దేవిశ్రీ రిప్లై.. ఆ షోలో ఆమెకు అవకాశం..?

అశోక్‌ని టార్గెట్ చేసిన విజయసాయి...మరి వాళ్ళు ఎందుకు అలా...!

రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ త‌న స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబ‌రు ప‌దోతేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ‘జియో ఫోన్‌ నెక్స్ట్‌’ను విడుద‌ల చేయ‌నున్నారు. రిల‌య‌న్స్ కంపెనీ, గూగుల్.. ఇద్ద‌రూ క‌లిసి అత్యంత చౌకైన ఫోన్‌గా దీనికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ విష‌యాన్ని రిల‌యన్స్ అధినేత ముకేష్అంబ‌నీ త‌మ కంపెనీ ఏజీఎం సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. 4జీ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకునేవారి కోసం ఈ ఫోన్ త‌యారుచేశారు.

వినాయ‌క‌చ‌వితికి రిల‌య‌న్స్ జియో స్మార్ట్ ఫోన్‌

భార‌తీయ జ‌న‌తాపార్టీపై పోరాడేందుకు అన్ని పార్టీల‌ను ఒకేచోట‌కి చేర్చేలా రాహుల్‌గాంధీ చొర‌వ తీసుకోవాల‌ని శివ‌సేన పార్టీ సూచించింది. అందుకు ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్‌ప‌వార్‌తో క‌లిసి ముందుకురావాల‌ని కోరింది. ఇప్ప‌టికే భార‌త‌దేశంలోని ప‌రిస్థితుల‌న్నీ త‌న చేతుల్లోనుంచి జారిపోతున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రికి బాగానే అర్థ‌మైన‌ట్లుంద‌ని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.

రాహుల్ గాంధీ చొర‌వ తీసుకోవాలి!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>