QuotesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchi-mata-shakuni5a7a82f5-4317-4711-850d-5cafd2018b94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchi-mata-shakuni5a7a82f5-4317-4711-850d-5cafd2018b94-415x250-IndiaHerald.jpgశకుని అనగానే ముందుగా గుర్తొచ్చేది పాచికలు, ఎత్తుగడలు, మాయ, మోసం.. ఇక వర్ణించడానికి మాటలు కూడా ఉండవు. అంతటి దుర్మార్గుడు శకుని అని అందరికీ తెలుసు. నిజానికి శకుని ఇంత దుర్మార్గుడిగా మారడానికి కారణం ఎవరో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా శకుని గురించి అపార్థం చేసుకోరు. ఇదంతా పక్కన పెడితే , శకుని తన కనుసైగలతో పాచికలను మారుస్తాడు అని మహాభారతం నాటి నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఇలా మోసం చేసే కౌరవుల చేతిలో పాండవులు ఓడిపోయేలా చేశాడు. ఇక ఈ పాచికల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఎందుకు ఈ పాచికలు శకుని మాట వింటాయMANCHI MATA ;SHAKUNI{#}ambika;Kerala;Audi;temple;Mahabharatham;Mantra;Nijam;king;Father;marriage;Girlమంచిమాట : శకుని పాచికల వెనుక ఉన్న రహస్యం ఇదే..మంచిమాట : శకుని పాచికల వెనుక ఉన్న రహస్యం ఇదే..MANCHI MATA ;SHAKUNI{#}ambika;Kerala;Audi;temple;Mahabharatham;Mantra;Nijam;king;Father;marriage;GirlThu, 24 Jun 2021 14:05:14 GMT
శకుని అనగానే ముందుగా గుర్తొచ్చేది పాచికలు, ఎత్తుగడలు, మాయ, మోసం.. ఇక వర్ణించడానికి మాటలు కూడా ఉండవు. అంతటి దుర్మార్గుడు శకుని అని అందరికీ తెలుసు. నిజానికి శకుని ఇంత దుర్మార్గుడిగా మారడానికి కారణం ఎవరో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా శకుని గురించి అపార్థం చేసుకోరు. ఇదంతా పక్కన పెడితే , శకుని తన కనుసైగలతో పాచికలను మారుస్తాడు అని మహాభారతం నాటి నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఇలా మోసం చేసే కౌరవుల చేతిలో పాండవులు ఓడిపోయేలా చేశాడు. ఇక ఈ పాచికల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఎందుకు ఈ పాచికలు శకుని మాట వింటాయి ? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..ఇక మహాభారత యుద్ధానికి కారకుడు శకుని అని ప్రతి ఒక్క హిందువుకి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ అ మహాభారతం చూడని, చదవని వారికి తెలియని విషయం ఏమిటంటే, శకుని కౌరవుల వైపు ఉంటూనే కౌరవ సామ్రాజ్యాన్ని , కురువంశస్తుతులను నాశనం చేస్తాడు. నిజానికి శకుని ఎంత మంచివాడు కాకపోతే శకునికి కేరళలో ఒక ప్రత్యేఖంగా గుడి కట్టి మరీ పూజించడం కూడా జరుగుతోంది. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఒక తెగకు చెందిన వారు శకునిని దేవుడిగా పూజిస్తారు. ఇక నిజం చెప్పాలంటే శకునిని మించిన పట్టుదల గల వ్యక్తి మరొకరు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శకునికి తెలిసిన అన్ని కుట్రలు, కుతంత్రాలు మరెవరికీ తెలియదు. ఎత్తులు, పైఎత్తులు వేసి కురు సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు.
శకుని జన్మించింది గాంధార రాజ్యంలో. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో కాంధార్ గా పిలువబడుతోంది. శకుని తండ్రి సుభల. ఇతనికి వందమంది కుమారులు. ఒక కుమార్తె. సుభలకి శకుని నూరవ సంతానం. శకుని తరువాత జన్మించిన అమ్మాయి గాంధారి. సుభల తన పిల్లలందరినీ ఉదయాన్నే నిద్ర లేపి , శివపూజ చేయించడంతో ప్రతి ఒక్కరు శివభక్తులు అయ్యారు. ఇక శకుని చిట్టచివరి వాడు కావడం చేత చురుకుగా, చలాకీగా ఉండడంతోపాటు పెద్దయిన తర్వాత శస్త్ర విద్యలో, జూదంలో మంచి నేర్పు కూడా పొందగలిగాడు.అపురూప సౌందర్యవతిగా పెరిగిన గాంధారి యుక్తవయస్సు రాగానే , సుభల పండితులను పిలిపించి, గాంధారి కి వివాహం జరిపించాలని, ఆమె జాతకాన్ని పరిశీలించిమని అడుగుతారు. అయితే ఆ పండితులు ఆమెకు కుజదోషం ఉన్నదని, ఒక గొర్రెకు ఇచ్చి వివాహం చేసిన తర్వాత పెళ్లి చేయవచ్చునని సలహా ఇస్తారు. ఇక రాజు గాంధారిని గొర్రెకు ఇచ్చి వివాహం చేసి, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. తరువాత గాంధారి వివాహం జరపాలని నిశ్చయించుకున్నట్లు వరుడి కోసం ఆహ్వానాలు పంపుతారు. ఇక గాంధారి అందానికి మంత్ర ముగ్ధురాలైన ధృతరాష్ట్రుని తల్లి అంబిక ఎలాగైనా తన ఇంటి కోడలు చేసుకోవాలని పట్టుబడుతుంది.ఇక ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి , గాంధారిని ఇచ్చి వివాహం చేస్తారు. కానీ దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత గాంధారికి ముందే ఒక గొర్రె తో వివాహం జరిగిందని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు కోపోద్రిక్తుడై, సుభలను , ఆయన కుమారులను ఒక కారాగారంలో బంధించి, రోజుకు ఒక్కొక్కరికి ఒక అన్నం మెతుకు చొప్పున ఇచ్చేవారట. అయితే కురు వంశాన్ని నాశనం చేయగల తెలివితేటలు కేవలం శకునికి మాత్రమే ఉన్నాయని, ఆ పగను మరిచిపోకుండా ఉండేందుకు శకునికి ఒక కాలు కూడా విరగగొడతారు. ఇక అంతే కాదు శకునికి ఏమీ జరగకుండా ఉండేందుకు తమకిచ్చిన ఒక్కో అన్నం మెతుకుని అంతా కలిపి కేవలం శకునికి మాత్రమే ఇచ్చేవారు.అందరూ ఆకలికి తట్టుకోలేక మరణిస్తారు. ఇక సుభల కూడా చనిపోయే స్థితికి చేరుకున్నప్పుడు, శకునిని పిలిచి. " నీవు నేను చనిపోయిన తర్వాత..నా ఎముకలలోనే పగ అంతా ఉంటుంది కాబట్టి ఎముకలను తీసి పాచికలు తయారు చేసి,  నీవు మనసులో ఏమి అనుకొని వేస్తే ,అదే జరుగుతుంది. నీకు జూదం లో మంచి పట్టు ఉంది కాబట్టి,జూదం ఆడి కౌరవుల సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని "ప్రమాణం చేయించుకుంటాడు సుభల. ఇక అందరూ చనిపోయారు.. కేవలం శకుని మాత్రమే ఉన్నారు.. అతనిని కారాగారం నుంచి విడిపించమని గాంధారి ధృతరాష్ట్రుని కోరగా, శకునిని విడిపిస్తారు.ఇక శకుని తన తెలివితేటలకు తగ్గట్టుగా అందరిని తన మాట వినేటట్టు చేసుకొని, పాండవులతో జూదం ఆడమని పాండవుల మీదకు కౌరవులను ఉసిగొల్పుతాడు. పాండవులకు ఎలాగో శ్రీకృష్ణుడు అండగా ఉంటాడు కాబట్టి కౌరవుల నాశనం తప్పక జరుగుతుంది అని పాండవులకు, కౌరవులకు మధ్య మహాభారత యుద్ధాన్ని జరిగేలా చేసి , కౌరవ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు.





కౌరవుల మీద పగ తీర్చుకునేందుకు శకుని తండ్రి సుబల..నీవు నేను చనిపోయిన తర్వాత..నా ఎముకలలోనే పగ అంతా ఉంటుంది కాబట్టి ఎముకలను తీసి పాచికలు తయారు చేసి, నీవు మనసులో ఏమి అనుకొని వేస్తే ,అదే జరుగుతుంది. నీకు జూదం లో మంచి పట్టు ఉంది కాబట్టి,జూదం ఆడి కౌరవుల సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని "ప్రమాణం చేయించుకుంటాడు సుభల.శకుని తన తెలివితేటలకు తగ్గట్టుగా అందరిని తన మాట వినేటట్టు చేసుకొని, పాండవులతో జూదం ఆడమని పాండవుల మీదకు కౌరవులను ఉసిగొల్పుతాడు. పాండవులకు ఎలాగో శ్రీకృష్ణుడు అండగా ఉంటాడు కాబట్టి కౌరవుల నాశనం తప్పక జరుగుతుంది అని పాండవులకు, కౌరవులకు మధ్య మహాభారత యుద్ధాన్ని జరిగేలా చేసి , కౌరవ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు.

పెళ్లయిన మూడు వారాలకే భార్య మిస్సింగ్..!

హీరో వెంకట్ గుర్తున్నాడా.. ? సినిమాలు లేకపాయినా బాగానే సంపాదిస్తున్నాడు

ఎన్ని ఉన్నా కానీ నా ఓట దానికే అంటున్న రష్మిక..!

వావ్.. సూపర్ టాలెంట్.. తెలంగాణలో మరో మట్టిలోమాణిక్యం?

విజయశాంతికి విషెస్ తెలిపిన మహేష్..!

మా ఎన్నికలలో ట్విస్ట్..రంగంలోకి నందమూరి హీరో!

విజయశాంతి భర్తకు ఆ స్టార్ ఫ్యామిలీ తో గల చుట్టరికం ఏంటి .. ?

ఎన్ఆర్ఐ బోర్డు కీలక నిర్ణయం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>