WinnersDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/kotii-the-great976caff1-f672-43f5-a506-e09454e5337b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/kotii-the-great976caff1-f672-43f5-a506-e09454e5337b-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో మన తెలుగువారు తమ తెలివితో.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు కీర్తిని పెంచుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కూడా మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కావడం విశేషం. ఈయన అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేశారు.. వీళ్లు కేవలం వాళ్ళు చేసిన రంగంలో మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు కానీ, ఇక్కడ ఒక మహానుభావుడు మాత్రం ఏకంగా ఆయన సేవలను ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలు పొందడం విశేషం. ఇంతటి ప్రపంచ ఖ్యాతిని చేకూర్చిన మొట్టమొదటి వ్యక్తిkotii-the-great{#}Microsoft;Mahanubhavudu;Degree;satya;Qualification;Interview;job;Smart phone;Population;Telugu;Andhra Pradesh;Indiaతెలుగు వారే కానీ..162 దేశాలు.. సాయం పొందుతున్నాయి..తెలుగు వారే కానీ..162 దేశాలు.. సాయం పొందుతున్నాయి..kotii-the-great{#}Microsoft;Mahanubhavudu;Degree;satya;Qualification;Interview;job;Smart phone;Population;Telugu;Andhra Pradesh;IndiaThu, 24 Jun 2021 06:26:22 GMT
ఇటీవల కాలంలో మన తెలుగువారు తమ తెలివితో.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు కీర్తిని పెంచుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కూడా మన ఆంధ్రప్రదేశ్ కి  చెందిన వారు కావడం విశేషం. ఈయన అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేశారు.. వీళ్లు  కేవలం వాళ్ళు చేసిన రంగంలో మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు కానీ, ఇక్కడ ఒక మహానుభావుడు మాత్రం ఏకంగా ఆయన సేవలను ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలు పొందడం విశేషం. ఇంతటి ప్రపంచ ఖ్యాతిని చేకూర్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నారా..? అతనెవరో కాదు మన తెలుగు బిడ్డ సరిపల్లి కోటిరెడ్డి.
కోటిరెడ్డి సరిపల్లి.. చదివింది మాత్రం పదవ తరగతి. ఈయనకు మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటర్వ్యూ కోసం ఆహ్వానం అందింది. మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం పొందాలంటే ముందుగా అందులో ఇంటర్వ్యూలో నెగ్గాలి. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.. మొత్తం 12 రౌండ్లలో అన్ని ప్రశ్నలకు చకచకా సమాధానం ఇస్తూ..విజయవంతంగా పూర్తి చేసుకున్నారు కోటిరెడ్డి. ఆ తరువాత సర్టిఫికెట్ కోసం మైక్రోసాఫ్ట్ హెచ్ఆర్ నుంచి ఫోన్ రావడంతో కేవలం పదవ తరగతి సర్టిఫికేట్ మాత్రమే ఉందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ నుంచి మరొక కాల్ వచ్చి, కనీసం డిగ్రీ అయినా అర్హత ఉండాలి అని అడిగారు..ఇక కోటిరెడ్డి అడిగిన ప్రశ్నకు వారు కొన్ని గంటల వ్యవధిలోనే నీకు ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు. అలా పదవ తరగతి చదువుతోనే మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం పొందిన మొదటి భారత వ్యక్తిగా కోటిరెడ్డి రికార్డు సృష్టించారు.
డీటీపీ ఆపరేటర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి,10 సంవత్సరాల వ్యవధిలోనే చీఫ్ ఆఫ్ ఆర్కిటిక్ స్థాయికి ఎదిగారు. మొట్టమొదటిసారిగా కేవలం 750 రూపాయలతో మొదలైన తన సంపాదన , ప్రస్తుతం కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ తో 1,600 కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకుంది. ఈయన మొత్తం దేశ వ్యాప్తంగా 14 కంపెనీలను ఏర్పాటు చేసి , అందులో కొన్ని వందల మందికి ఉద్యోగాలను ఇచ్చి, మంచి జీవితాన్ని అందిస్తున్నారు. ఇక మొత్తం మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 162 దేశాల్లో భారత్ ఇన్నోవేషన్ తమ సేవలను అందిస్తోంది. జన్మ భూమికి ఏదో చేయాలనే తపన..ఆ తపనలోనే పుట్టుకొచ్చింది ఒక ఆలోచన..అదే "క్రౌడ్ బ్లడ్  స్వఛ్చంద సంస్థ". ఈ స్వచ్ఛంద సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వలంటీర్లు ఉన్నారు. కోటిరెడ్డి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ రాబడి నుంచి దాదాపు  33 శాతం ఫండ్స్ ఈ స్వచ్ఛంద సంస్థకు కేటాయించడం గమనార్హం.

ముఖ్యంగా చెప్పాలంటే , సంవత్సరానికి రూ.500 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ఈ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తున్నారు కోటిరెడ్డి. అంతేకాదు జనార్ధనపురంలోని నందివాడలో.."జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్తు ఉన్నత పాఠశాలలను " దత్తతకు కూడా తీసుకున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాలలో  డిజిటల్ క్లాస్ రూమ్ లను ఏర్పాటు చేసి,  స్కాలర్షిప్ లను  కూడా అందిస్తూ, పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారు. ఇక  మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాల్లో..మొత్తం 70 కోట్ల మంది జనాభా ఏదో ఒక రూపంలో కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ వ్యాపార సేవలను పొందుతున్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.. అంటూ నమ్మే కోటిరెడ్డి గారు.. ఈరోజు ఎంతో మంది ప్రజలకు, చిన్నారులకు సేవలను అందిస్తూ అందరిలో ఒకరిలాగా, సామాన్యుడి బాధలను అర్థం చేసుకునే స్థాయికి ఎదిగారు సరిపల్లి కోటిరెడ్డి . మన తెలుగు బిడ్డ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు సేవలు పొందడం మనకు మన భారత దేశానికి గర్వకారణం.




కోటిరెడ్డి సరిపల్లి. 14 టెక్ సంస్థల అధినేత. ఈయన చాలా సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 162 దేశాల్లో మొత్తం 70 కోట్ల మంది జనాభా ఏదో ఒక రూపంలో కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ వ్యాపార సేవలను పొందుతున్నారు.

జూన్ 24వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

కృష్ణా జిల్లాలోనూ ఓ శ్రీమంతుడు... కోటిరెడ్డి చ‌రిత్ర చ‌ద‌వాల్సిందే..!

జాయ్ ఆఫ్ జ‌ర్నీ.. కోటి మందికి వెలుగునిచ్చే దిశగా ' కోటిరెడ్డి ' ఫార్ములా...!

కృష్ణా జిల్లాలోనూ ఓ శ్రీమంతుడు... కోటిరెడ్డి చ‌రిత్ర చ‌ద‌వాల్సిందే..!

36 ఏళ్ల గుడివాడ కుర్రోడు... 14 కంపెనీలు.. 170 దేశాలు..!

36 ఏళ్ల గుడివాడ యువ‌కుడి ప్ర‌స్థానం... 14 కంపెనీలు.. 170 దేశాలు..!

తెలుగు వెబ్ మీడియా ప్రపంచంలో సంచ‌లనాలు ఈ ' కోటిరెడ్డి ' కే సొంతం...!

తెలుగు వెబ్ మీడియా ప్రపంచంలో సంచ‌లనాలు ఇండియా హెరాల్డ్‌కే సొంతం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>