PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp5e108c80-e417-4e52-86f8-074ae3f82bd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp5e108c80-e417-4e52-86f8-074ae3f82bd9-415x250-IndiaHerald.jpgపశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కాస్త బలం ఉన్న నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం కూడా ఒకటి. ముందు నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి బలం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అయిదుసార్లు గెలిచింది. కాంగ్రెస్ రెండుసార్లు, 2009లో ప్రజారాజ్యం, 2014లో టీడీపీతో పొత్తుతో బీజేపీ గెలిచాయి.tdp{#}Godavari River;KOTTU SATYANARAYANA;Pinnamaneni Babji;Congress;Bharatiya Janata Party;YCP;TDP;MLA;Party;CBN;Jagan;Hanu Raghavapudiబాబుకు ఆ నేతలు హ్యాండ్...కానీ ఆ ‘ఒక్కడు’ నిలబెడతాడా?బాబుకు ఆ నేతలు హ్యాండ్...కానీ ఆ ‘ఒక్కడు’ నిలబెడతాడా?tdp{#}Godavari River;KOTTU SATYANARAYANA;Pinnamaneni Babji;Congress;Bharatiya Janata Party;YCP;TDP;MLA;Party;CBN;Jagan;Hanu RaghavapudiThu, 24 Jun 2021 08:00:00 GMTపశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కాస్త బలం ఉన్న నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం కూడా ఒకటి. ముందు నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి బలం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అయిదుసార్లు గెలిచింది. కాంగ్రెస్ రెండుసార్లు, 2009లో ప్రజారాజ్యం, 2014లో టీడీపీతో పొత్తుతో బీజేపీ గెలిచాయి.


2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఇక్కడ వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ విజయం సాధించారు. టీడీపీ-జనసేనలు విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన కొట్టు దూకుడుగానే ఉంటున్నారు. అలాగే ఆయనకు ప్రభుత్వ పథకాలు ప్లస్ అవుతున్నాయి. కాకపోతే ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇసుకలో, ఇళ్ల స్థలాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇవే ఎమ్మెల్యేకు మైనస్ అవుతున్నాయి.


ఎమ్మెల్యేకు మైనస్ ఉన్నా సరే ఉపయోగించుకోలేని స్థాయిలో టీడీపీ ఉంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి నేతలు వరుసగా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈలి నాని, ఇప్పుడు అధికార పార్టీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. అటు టీడీపీలో ముందు నుంచి ఉన్న ముళ్ళపూడి బాపిరాజు సైతం పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో చంద్రబాబు తాడేపల్లిగూడెం బాధ్యతలు వలవల మల్లిఖార్జునరావు(బాబ్జీ)కు అప్పగించారు.


తాడేపల్లిగూడెం బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి బాబ్జీ టీడీపీలో దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలని హైలైట్ చేయడంలో ముందున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. అలాగే వైసీపీ చేసే అక్రమాలపై పోరాటం చేస్తున్నారు. ఇటీవలే లిక్కర్ షాపుల్లో వైసీపీ భారీగా అక్రమాలకు పాల్పడుతుందని, అటు ఎమ్మెల్యే అనుచరులు ఇసుకలో అవినీతికి పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇలా బాబ్జీ తక్కువ సమయంలోనే నియోజకవర్గంలో బాగా హైలైట్ అయ్యారు. మరి బాబ్జీ నెక్స్ట్ ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో టీడీపీని నిలబెడతారేమో చూడాలి.




ప‌త‌కం ప‌ట్టండి.. కోట్లు కొట్టేయండి!

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కాస్త బలం ఉన్న నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం కూడా ఒకటి. ముందు నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి బలం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అయిదుసార్లు గెలిచింది. కాంగ్రెస్ రెండుసార్లు, 2009లో ప్రజారాజ్యం, 2014లో టీడీపీతో పొత్తుతో బీజేపీ గెలిచాయి.

జగన్ సైలెన్స్.. షర్మిల ఉగ్ర రూపం..

ఏ ఎన్నిక అయినా ఎగ్జిట్ పోల్స్‌ను మించిన స‌క్సెస్‌... ' ఇండియా హెరాల్డ్‌ ' కే సొంతం

సీఎం నుంచి చిరుకూ థాంక్స్.

'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై కామెంట్స్ చేస్తూ సెగ పెడుతున్న కరాటే కల్యాణి...

నారా వారూ .. తీరు మార్చుకోరూ... ?

కేసీఆర్‌పై బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... ఏమ‌న్నారంటే...?

సుప్రీంకోర్టు ఆదేశం.. అఫడవిట్ సిద్ధం చేసిన జగన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>