PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/frog-whisperer610f3c53-5cd0-42a7-8bb9-1bbc0ac1e01e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/frog-whisperer610f3c53-5cd0-42a7-8bb9-1bbc0ac1e01e-415x250-IndiaHerald.jpgఓ 70 ఏళ్ల జీవశాస్త్ర ప్రొఫెసర్ కప్పలు చేసే కూతలు, కీచుధ్వని, ఈలలు అర్థం చేసుకొని వాటిని అనుకరిస్తూ కప్పలతో గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది అక్షరాల నిజం. పూర్తి వివరాలు తెలుసుకుంటే.. ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ యూనివర్సిటీలో జీవశాస్త్ర ప్రొఫెసర్, పరిరక్షణాధికారిగా పని చేస్తున్న మైఖేల్ మహోనీ కప్పలతో మాట్లాడుతూ ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని ఒక చెరువులో ఉన్న కప్పలతో ముచ్చట్లు పెడుతూ ఒక చిన్న పిల్లవాడి లాగా మైఖేల్ మహోనీ ఎంజాయ్ చేస్తున్frog whisperer{#}professorకప్పలతో మాట్లాడుతున్న ఆస్ట్రేలియన్ సైంటిస్ట్..?కప్పలతో మాట్లాడుతున్న ఆస్ట్రేలియన్ సైంటిస్ట్..?frog whisperer{#}professorThu, 24 Jun 2021 11:00:00 GMTప్రొఫెసర్ కప్పలు చేసే కూతలు, కీచుధ్వని, ఈలలు అర్థం చేసుకొని వాటిని అనుకరిస్తూ కప్పలతో గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది అక్షరాల నిజం. పూర్తి వివరాలు తెలుసుకుంటే.. ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ యూనివర్సిటీలో జీవశాస్త్ర ప్రొఫెసర్, పరిరక్షణాధికారిగా పని చేస్తున్న మైఖేల్ మహోనీ కప్పలతో మాట్లాడుతూ ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

" style="height: 654px;">


ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని ఒక చెరువులో ఉన్న కప్పలతో ముచ్చట్లు పెడుతూ ఒక చిన్న పిల్లవాడి లాగా మైఖేల్ మహోనీ ఎంజాయ్ చేస్తున్నారు. "కొన్నిసార్లు మీరు పనిచేయడం కూడా మర్చిపోతారు. ఎందుకంటే మీకు కప్పలతో మాట్లాడాలనే ఆలోచన తప్ప మరేతర ఆలోచన రాదు. కప్పలతో మాట్లాడటం చాలా వినోదాత్మకంగా ఉంటుంది," అని ఆయన అన్నారు. కప్పలు తిరిగి తనతో మాట్లాడుతుంటే ఆయన చాలా థ్రిల్లింగ్‌గా ఫీలవుతారట. అయితే కప్పలన్నీ సైలెంట్ అయిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశంలో దాదాపు 240 కప్ప జాతులు ఉండగా.. వాటిలో 30% జాతులకు ముప్పు పొంచి ఉందని మహోనీ చెప్పుకొచ్చారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, నీటి కాలుష్యం, నివాస నష్టం, చైట్రిడ్ ఫంగస్ వల్ల 30% కప్ప జాతులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. అన్ని సకశేరుకాలలో కప్పలకే ఎక్కువగా ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు.



మైఖేల్ మహోనీ తన జీవితంలో మొత్తం 15 కప్ప జాతుల గురించి తెలుసుకొని చేసి ఎన్నో విషయాలను వెల్లడించారు. అయితే ఆయన వివరించిన 15 జాతుల కప్పలలో చాలావరకు తుడిచిపెట్టుకుపోయాయి. యుక్త వయసులో ఆయన కనిపెట్టిన ఒక కప్ప జాతి కేవలం రెండు సంవత్సరాల సమయం లోనే అంతరించిపోయిందట.



ఆస్ట్రేలియా దేశంలో ఉభయచర ఆవాసాలను సంరక్షించడానికి కృషి చేయడమే కాదు "బ్యాంకింగ్" జన్యు పదార్ధం ద్వారా కప్పలను వినాశనం నుంచి రక్షించేందుకు స్టార్ట్ చేసిన క్రియోప్రెజర్వేషన్ పద్ధతిని అభివృద్ధి చేయడానికి ఎంతో సహాయ పడ్డారు. 




కప్పలతో మాట్లాడుతున్న ఆస్ట్రేలియన్ సైంటిస్ట్..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ వెబ్సైట్లో చూడండి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>