India
oi-Shashidhar S
డీఆర్డీవో 2డీజీ ఫౌడర్ కరోనా వైరస్ కోసం పనిచేస్తుందని నిపుణులు తెలిపారు. ఈ సాచెట్ విక్రయాలు కూడా ప్రారంభమయ్యినట్టు తెలుస్తోంది. అయితే డీఆర్డీవోతో కలిసి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఈ ఫౌడర్ ఉత్పత్తి చేస్తోంది. మిగతా ల్యాబ్‌లను ఇందులో భాగస్వామ్యం చేయలేదు. దీనిని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. మిగతా ల్యాబులను ఎందుకు భాగస్వామ్యం చేయలేదో శుక్రవారం లోపు సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్ కిరుబకరన్, జస్టిస్ టీవీ తమిల్ సెల్వీ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
కరోనా వైరస్ కోసం 2డీజీ మెరుగ్గా పనిచేస్తే.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబు ఒక్కదానికే అనుమతి ఇచ్చారని అడిగారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల లక్షలాది మంది చనిపోయారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ భయాందోళన కూడా ఉంది. ఈ క్రమంలో ఉత్పత్తి పెంచడం శ్రేయస్కరం అని తెలిపింది. ఈ మేరకు కేంద్రంతోపాటు రక్షణశాఖ; డీఆర్డీవో, కేంద్ర వైద్యారోగ్యశాఖ సమాధానం చెప్పాలని స్పష్టంచేసింది.

చెన్నైలో ఉంటోన్న శరవణన్ అనే ప్రైవేట్ ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు ధర్మాసనం విచారణ జరిపింది. 2డీజీ అనే ఎమర్జెన్సీలో ఉపయోగించే ఔషధం అని పిటిషనర్ తెలిపారు. కానీ రెడ్డీస్ ల్యాబ్ దానిని 2.34 కిలోల ఫౌడర్ రూ.990కి విక్రయిస్తోందని చెప్పారు. ఒక్క కంపెనీకే అనుమతి ఇవ్వడం వల్ల ఇలా జరిగి ఉంటుందని.. ఇతర ఫార్మా కంపెనీలకు కూడా పర్మిషన్ ఇవ్వాలని కోరారు.
English summary
Court asked why licenses had not been issued to as many reputed laboratories as possible, to ramp up production of the oral powder.
Story first published: Thursday, June 24, 2021, 18:46 [IST]