MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amitabh-bachchan0c1712d8-e6b8-4c03-867a-1f4b7749e9c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amitabh-bachchan0c1712d8-e6b8-4c03-867a-1f4b7749e9c3-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అక్షరాలా రెండు కోట్ల విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరములను ముంబైలోని ఒక ఆసుపత్రికి ఉచితంగా అందించారు. కరోనా రోగుల సహాయార్థం అమితాబ్ తన వంతుగా సుమారు రూ. 2కోట్ల విలువ చేసే వెంటిలేటర్లు, మానిటర్లు, సీఆర్‌ఎం ఇమేజ్ ఇంటెన్సిఫైయర్లు, ఇన్ఫ్యూషన్ పంపులు తదితర వైద్య పరికరాలు ముంబయిలోని సియాన్‌ హాస్పిటల్ కి అందజేశారు. అయితే అమితాబ్ విరాళం గురించి బుధవారం రోజు బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. సొంతంగా ఆక్సిజన్‌ తీసుకamitabh bachchan{#}bollywood;Amitabh Bachchan;Coronavirus;wednesday;Doctor;joshiy;oxygen;editor mohanఅమితాబ్ బచ్చన్.. రూ.2 కోట్లు దానం..!అమితాబ్ బచ్చన్.. రూ.2 కోట్లు దానం..!amitabh bachchan{#}bollywood;Amitabh Bachchan;Coronavirus;wednesday;Doctor;joshiy;oxygen;editor mohanThu, 24 Jun 2021 11:00:00 GMTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అక్షరాలా రెండు కోట్ల విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరములను ముంబైలోని ఒక ఆసుపత్రికి ఉచితంగా అందించారు. కరోనా రోగుల సహాయార్థం అమితాబ్ తన వంతుగా సుమారు రూ. 2కోట్ల విలువ చేసే వెంటిలేటర్లు, మానిటర్లు, సీఆర్‌ఎం ఇమేజ్ ఇంటెన్సిఫైయర్లు, ఇన్ఫ్యూషన్ పంపులు తదితర వైద్య పరికరాలు ముంబయిలోని సియాన్‌ హాస్పిటల్ కి అందజేశారు.

అయితే అమితాబ్ విరాళం గురించి బుధవారం రోజు బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. సొంతంగా ఆక్సిజన్‌ తీసుకోలేని రోగులను ట్రీట్ చేయడానికి అమితాబ్ విరాళంగా ఇచ్చిన వైద్య పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు వెల్లడించారు. రోగులకు తగినంత వెంటిలేషన్ అందించేందుకు కూడా ఈ వైద్య పరికరాలు ఉపయోగపడతాయి.


సియాన్‌ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ జోషి.. అమితాబ్ బచ్చన్ అందించిన విరాళాల గురించి మీడియాతో మాట్లాడారు. ఆయన తమ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తరఫున అమితాబ్ బచ్చన్ కి కృతజ్ఞతలు తెలిపారు. అమితాబ్ బచ్చన్ అందించిన అత్యాధునిక వెంటిలేటర్లు రెండు రోజులుగా సియోన్ హాస్పిటల్ లోని శస్త్రచికిత్స విభాగంలో పనిచేస్తున్నాయని.. ఈ కొత్త వెంటిలేటర్లతో సుమారు 30 మంది రోగులు సమర్థవంతంగా చికిత్స పొందారని డాక్టర్ మోహన్ జోషి తెలిపారు.



అమితాబ్ బచ్చన్ తమ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చిన 2 వెంటిలేటర్లు అత్యాధునికమైనవని ఆయన అన్నారు. ఈ లేటెస్ట్ కంప్యూటర్ ఆధారిత వెంటిలేటర్లు తక్కువ ఆక్సిజన్ స్థాయి ఉన్న రోగులకు ఆక్సిజన్ అందించడానికి బాగా ఉపయోగపడుతాయని ఆయన అన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి కూడా ఆక్సిజన్‌ను అందించడానికి ఈ వెంటిలేటర్లు ఉపయోగపడతాయని మోహన్ జోషి చెప్పుకొచ్చారు. ఈ వెంటిలేటర్ల సహాయంతో అవసరమైన రోగులకు 100% ఆక్సిజన్ అందించవచ్చని.. ఆక్సిజన్ ఒత్తిడి తగ్గించవచ్చు లేదా పెంచవచ్చని.. ఒక ట్యూబ్ ద్వారా నేరుగా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ డెలివర్ చేయొచ్చని ఆయన తెలిపారు.



డెల్టా వేరియంట్ అనురాగ్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్..

ఛీ...నీచమైన పని చేస్తోన్న ప్రేమజంట..!

రేషన్ కార్డుదారులకు శుభవార్త

Birthday Special : లేడి అమితాబ్ విజయశాంతి.. హీరోలకు సైతం సాధ్యం కానీ ఫీట్స్

వెలుగులోకి డేంజరస్ వైరస్... గజగజ వణుకుతున్న ప్రజలు ?

రజినీకాంత్ తెలుగు సినిమాలను కావాలనే చేయట్లేదని తెలుసా?

పుష్ప ప్రభావంతో మార్పులు చెందుతున్న సలార్ !

అమితాబ్ బచ్చన్.. రూ.2కోట్లు దానం..! పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి

అసలు అడవుల్లో ఏం జరుగుతోంది...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>