PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-0e3b8aca-36e6-49d8-89dc-0a9fa91f61d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-0e3b8aca-36e6-49d8-89dc-0a9fa91f61d3-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకు ధ్విముఖ పోరు ఉంటుందనుకున్న నేపథ్యంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఇప్పటివరకు టిఆర్ఎస్, బిజెపి మాత్రమే పోటీలో ఎక్కువగా ఉంటాయని అనుకున్నాం. తాజాగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే పిసిసి ఛీప్ ఎన్నిక కూడా ఈ ఉప పోరును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారనేది సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ కొత్తగా ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే కొత్త పిసిPolitical {#}Eatala Rajendar;Elections;Bharatiya Janata Party;Huzurabad;Yevaru;Congress;Partyహుజురాబాద్ లో త్రిముఖ పోరు ఉండనుందా..?హుజురాబాద్ లో త్రిముఖ పోరు ఉండనుందా..?Political {#}Eatala Rajendar;Elections;Bharatiya Janata Party;Huzurabad;Yevaru;Congress;PartyThu, 24 Jun 2021 11:41:54 GMTహుజురాబాద్ రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకు ధ్విముఖ పోరు ఉంటుందనుకున్న నేపథ్యంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఇప్పటివరకు టిఆర్ఎస్, బిజెపి  మాత్రమే పోటీలో ఎక్కువగా ఉంటాయని అనుకున్నాం. తాజాగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే పిసిసి ఛీప్ ఎన్నిక కూడా ఈ ఉప పోరును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారనేది సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ కొత్తగా ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే కొత్త పిసిసి చీఫ్కు ప్రతిష్టాత్మకం కానుంది. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ వచ్చిన తర్వాత దుబ్బాక ఎలక్షన్ రావడంతో వాటిని బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతమైంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా కొత్త పిసిసి వచ్చిన తర్వాత ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అన్ని పార్టీలో చర్చ నడుస్తోంది.

 అయితే   బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కు  ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం ఉంది. అధికార పార్టీని ఎదిరించి తన సత్తాను చాటి కోవాల్సిన అవసరం ఈటలకు ఇప్పుడున్నది. ఇదేవిధంగా టిఆర్ఎస్  కూడా ఈటలని ఎలాగైనా  ఓడించాలనే లక్ష్యంతో టిఆర్ఎస్ నాయకత్వం మొత్తం సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేస్తున్నది. అయితే కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తన ప్రభావాన్ని చాటుకునే ప్రయత్నం తప్పకుండా చేయాల్సి ఉంటుంది.


ఇన్ని రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపాలి అంటే హుజురాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం అత్యంత కీలకం. అధికార పార్టీ టిఆర్ఎస్ ను, ఈటలను ఢీ కొట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత పీసీసీ చీఫ్పై అత్యధికంగా ఉంటుంది. ఈ విధంగా కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి పార్టీలు గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చివరికి ఈ ఉప పోరులో ఎవరు సత్తా చాటుతారనేది వేచి చూడాల్సిందే.



సంజయ్‌లాగా సోము రీప్లేస్ చేయలేకపోతున్నారే..!

ఆ టీడీపీ ఎమ్మెల్యే రివర్స్ అయ్యారుగా!

రాహుల్ కి ఇంట్రెస్టింగ్ గిఫ్ట్.. ఏకంగా పులిపిల్ల!

ఇది చిరంజీవి మార్కు రాజ‌కీయం?

వారసుడు కోసం టీజీ గట్టిగానే కష్టపడుతున్నారా?

హుజారాబాద్ పై బిజెపి పక్కా ప్లానింగ్... రంగంలోకి అగ్ర నేతలు...?

అసలు అడవుల్లో ఏం జరుగుతోంది...?

ప‌దో త‌ర‌గ‌తి పాస్‌... రూ.750 నుంచి రూ.1600 కోట్ల‌కు అధిప‌తి..!

కాంగ్రెస్ ను వదిలి.. గులాబీకి బదిలీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>