PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/atchenna-naidu-jagan-mohan-reddy3625c66d-51ef-4cdc-933b-add030f0429c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/atchenna-naidu-jagan-mohan-reddy3625c66d-51ef-4cdc-933b-add030f0429c-415x250-IndiaHerald.jpgఈ దాడిలో న‌ష్ట‌పోయిన బాధిత కుటుంబాలకు టీడీపీ అన్ని విధాలా అండగా వుంటుంద‌ని.. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణలేద‌ని అచ్చెన్న చెప్పారు. పరిశ్రమలతో కలకలలాడాల్సిన నవ్యాంధ్ర.. దాడులు, హత్యలతో విలవిల్లాడుతోంద‌ని అచ్చెన్న దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో రోజుకో అరాచ‌కం జ‌రుగుతుంటే సీఎం జ‌గ‌న్ క‌ళ్ల‌కు ఇవి క‌న‌ప‌డ‌డం లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు ? గ‌తంలో మ‌నం నాజీల పాల‌న‌లో నలిగిపోయిన జ‌ర్మ‌నీ ప్ర‌జ‌ల‌ను చూశామ‌ని.. ఇప్పుడు ఏపీలో జర్మనీలో నాజీల దురాగతాలకు మించి ఏపీ జగన్ రెడ్డి అరాచకాలు ఉన్నాయ‌నatchenna naidu jagan mohan reddy{#}Prakasam;mandalam;Andhra Pradesh;thursday;ATCHANNAIDU KINJARAPU;CM;YCP;TDP;Reddyహ‌న్న‌న్నా అచ్చెన్నా జ‌గ‌న్‌పై ఏం డైలాగులు... !హ‌న్న‌న్నా అచ్చెన్నా జ‌గ‌న్‌పై ఏం డైలాగులు... !atchenna naidu jagan mohan reddy{#}Prakasam;mandalam;Andhra Pradesh;thursday;ATCHANNAIDU KINJARAPU;CM;YCP;TDP;ReddyThu, 24 Jun 2021 09:56:42 GMTఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ ప్ర‌భుత్వంతో పాటు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై తూట‌ల్లాంటి మాట‌ల‌తో విరుచుకు ప‌డ్డారు. నవ్యాంధ్రప్రదేశ్ ను వైసీపీ హత్యాంధ్రప్రదేశ్ గా మార్చింద‌న్న ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వం టీడీపీ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకుంద‌ని విమ‌ర్శించారు. గ‌త కొద్ది రోజులుగా ఏపీలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల హ‌త్య‌లు, దాడుల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. గురువారం ప్రెస్‌మీట్లో ఆయ‌న మాట్లాడుతూ ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటంపై ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డంతో పాటు వైసీపీ నేత‌ల తీరును మ‌క్త కంఠంతో ఖండించారు.

ఈ దాడిలో న‌ష్ట‌పోయిన బాధిత కుటుంబాలకు టీడీపీ అన్ని విధాలా అండగా వుంటుంద‌ని..  రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణలేద‌ని అచ్చెన్న చెప్పారు.  పరిశ్రమలతో కలకలలాడాల్సిన నవ్యాంధ్ర.. దాడులు, హత్యలతో విలవిల్లాడుతోంద‌ని అచ్చెన్న దుయ్య‌బ‌ట్టారు.  రాష్ట్రంలో రోజుకో అరాచ‌కం జ‌రుగుతుంటే సీఎం జ‌గ‌న్ క‌ళ్ల‌కు ఇవి క‌న‌ప‌డ‌డం లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు ?  గ‌తంలో మ‌నం నాజీల పాల‌న‌లో నలిగిపోయిన జ‌ర్మ‌నీ ప్ర‌జ‌ల‌ను చూశామ‌ని.. ఇప్పుడు ఏపీలో జర్మనీలో నాజీల దురాగతాలకు మించి ఏపీ జగన్ రెడ్డి అరాచకాలు ఉన్నాయ‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

జ‌గ‌న్ రెడ్డి రోజులెప్పుడు ఒకేలా ఉండ‌వ‌న్న విష‌యం తెలుసుకోవాల‌ని... ఇప్పుడు అధికారం ఉంద‌ని రెచ్చిపోతే.. అది ఎప్ప‌ట‌కీ శాశ్వ‌తం కాద‌ని గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చూస్తే 27 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు హ‌త్య‌కు గుర‌య్యార‌ని అచ్చెన్న చెప్పారు. ఇన్ని హ‌త్య‌లు జ‌రుగుతుంటే డీజీపీకి ఒక్క‌టి కూడా క‌ళ్ల‌కు క‌నిపించ‌డం లేదా ? అని అచ్చెన్న ప్ర‌శ్నించారు. హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన వారిలో ఒక్క‌రిని కూడా ప‌ట్టుకుని శిక్షించ‌లేద‌న్న అచ్చెన్న‌.. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే తాము త‌ప్ప‌క స‌మాధానం చెపుతామ‌ని.. చూస్తూ ఊరుకోమ‌ని అచ్చెన్న చెప్పారు.

 



రామ్మోహన్ బావ ‘సైకిల్’ని నిలబెడతారా?

ఏపీ సీఎం జ‌గ‌న్ హ‌త్యా రాజ‌కీయాల‌పై అచ్చెన్నాయుడు ధ్వ‌జం

నేటి కాంగ్రెస్ సమావేశంలో ఏం జరగబోతోంది..?

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి బడా ఫ్యామిలీలు చిత్తు అయినా సరే, కింజరాపు కుటుంబం మాత్రం మంచి విజయాలనే దక్కించుకుంది. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా గెలిస్తే, అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక మొదటి సారి దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె, రామ్మోహన్ సోదరి ఆదిరెడ్డి భవాని ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయాన్ని దక్కించుకున్నారు.

లోకేష్ నాయకత్వానికి అదే అసలు పరీక్ష..

అద్భుతం: జీవన సుగంధ పరిమళ 'కోటి'.. ఆయనతో పరిచయమే అపురూపం..!

నాని యాక్టింగ్ చూసి నాలుగు సార్లు ఏడ్చా : షాహిద్ కపూర్

దాసరి ఫ్యామిలీకి జగన్ ఏమన్నా సెట్ చేస్తారా?

26న క‌లెక్ట‌ర్ల‌తో సీఎం భేటీ..వీటిపైనే చ‌ర్చ‌.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>