MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayashanthi-first-movie-remunation1606d26e-c268-4b2a-8948-69254571509e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayashanthi-first-movie-remunation1606d26e-c268-4b2a-8948-69254571509e-415x250-IndiaHerald.jpgలేడీ సూపర్ స్టార్ విజయశాంతి అంటే ఎంత గుర్తింపు ఉందో మనకు తెలిసిందే. ఈమె హీరోయిన్ మాత్రమే కాకుండా, ఒక ప్రొడ్యూసర్, ఒక రాజకీయ నాయకురాలు కూడా. ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి, అందరినీ అలరించింది. ఈమె లేడీ అమితాబ్ అని కూడా పిలుస్తారు. ఈరోజు విజయశాంతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమె గురించి పలు విషయాలను తెలుసుకోవడమే కాకుండా ఆమె తన మొదటి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ర తీసుకుందో తెలుసుకుందాం.VIJAYASHANTHI FIRST MOVIE REMUNATION{#}Kartavyam;Rajani kanth;mahesh babu;Vijayashanti;Amitabh Bachchan;Heroine;krishna;Chitram;Cinemaవిజయశాంతి నటించిన మొదటి సినిమా సంపాదన ఎంతో తెలుసా ?విజయశాంతి నటించిన మొదటి సినిమా సంపాదన ఎంతో తెలుసా ?VIJAYASHANTHI FIRST MOVIE REMUNATION{#}Kartavyam;Rajani kanth;mahesh babu;Vijayashanti;Amitabh Bachchan;Heroine;krishna;Chitram;CinemaThu, 24 Jun 2021 21:06:25 GMT
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అంటే ఎంత గుర్తింపు ఉందో మనకు తెలిసిందే. ఈమె హీరోయిన్  మాత్రమే కాకుండా, ఒక ప్రొడ్యూసర్, ఒక రాజకీయ నాయకురాలు కూడా. ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి, అందరినీ అలరించింది. ఈమె లేడీ అమితాబ్ అని కూడా పిలుస్తారు. ఈరోజు విజయశాంతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమె గురించి పలు విషయాలను తెలుసుకోవడమే కాకుండా ఆమె తన మొదటి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ర తీసుకుందో తెలుసుకుందాం.


విజయశాంతి అసలు పేరు"శాంతి". ఈమె పిన్ని కూడా ఒక నటి .ఆమె పేరు "విజయ లలిత" . తమ పిన్ని మీద ఉన్న ప్రేమతో అందులోని విజయ అనే పదాన్ని తీసుకొనివచ్చి తన పేరు ముందు పెట్టుకుంది. దాంతో ఈమె పేరు విజయశాంతిగా మార్చబడింది.విజయశాంతి 1980 లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె దాదాపుగా 188 సినిమాలలో నటించింది. తెలుగులో తను నటించిన మొదటి చిత్రం "కిలాడి కృష్ణుడు".ఈ సినిమా ద్వారా తెలుగులో మొదటిసారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కృష్ణ హీరోగా, విజయనిర్మల దర్శకురాలిగా చేసింది. ఈ సినిమాకి 5000 రూపాయలను పారితోషికం కింద తీసుకుంది విజయశాంతి.


అలా వరుస సినిమాలలో నటిస్తూ 1990 లో కర్తవ్యం సినిమాకి  మొదటిసారిగా కోటి రూపాయలను రెమ్యునేషన్ తీసుకుంది. దీంతో మొదటి సారిగా అంత రెమ్యూనరేషన్ తీసుకున్న  హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అలాగే ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక 2000 వ సంవత్సరం లో ఆమె చిత్రాల సంఖ్య తగ్గుతూ రావడం జరిగింది. దీనికి గల కారణం ఏమిటంటే , ఆమె తీయబోయే సినిమాల కథల పై శ్రద్ధ లేకపోవడమే. కానీ అప్పుడే ఆమె రాజకీయంగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇక సినిమాలకు దూరమై పోయింది.


దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ తో మొదలుపెట్టి మహేష్ బాబు నటించిన "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో కూడా తనదైన శైలిలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది.





'కేజీఎఫ్2' వెంట పడుతున్న వైసీపీ ఎంపీ..?

పోసాని గారే..నాకు లైఫ్ ఇచ్చారు అంటున్న బి.వి.ఎస్.రవి..

విజయశాంతి ని సినిమాల్లోకి తెచ్చిన ఆ నటుడు ఎవరో తెలుసా.. ?

కొరటాల మూవీలో లేడీ అమితాబ్ ... ?

తెలంగాణా మంత్రుల కామెంట్స్ మీద ఎట్టకేలకు నోరు విప్పిన వైసీపీ!

"ఆదిపురుష్" నుండి క్రేజీ అప్డేట్ ...

విజయశాంతి పిన్ని కూడా టాలీవుడ్ స్టార్ నటీమణి.. ఎవరో చూడండి.

అక్షయ్ కుమార్ స్టామినా ఇది.. బెల్ బాటమ్ కు భారీ ఆఫర్..!!

కేటీఆర్ ట్వీట్‌కి దేవిశ్రీ రిప్లై.. ఆ షోలో ఆమెకు అవకాశం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>