SportsSanjayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ground-with-rain-water81904da2-27fa-4ffb-adc7-d12bdbcea8ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ground-with-rain-water81904da2-27fa-4ffb-adc7-d12bdbcea8ef-415x250-IndiaHerald.jpgరెండేళ్ల‌పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తించిన టెస్టు క్రికెట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ ఎట్ట‌కేల‌కు ముగిసింది. తొలిసారి నిర్వ‌హించిన ఈ ఛాంపియ‌న్‌షిప్‌ను గెలిచి చ‌రిత్ర‌లో నిలిచిపోవాల‌నుకున్న కోహ్లీ సేన‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. అయితే, రెండేళ్ల పాటు వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్లిన భార‌త్‌.. ఆఖ‌రి ఆట‌లో గెలుపు రుచి చూడ‌కుండా ఎందుకు ఆగిపోయింది? సీనియ‌ర్లు గాయ‌ప‌డిన స‌మ‌యంలో కేవ‌లం రిజ‌ర్వ్ బెంచ్ ఆట‌గాళ్ల‌తోనే ఆడి ఆసీస్‌ను వారి దేశంలోనే మ‌ట్టి క‌రిపించిన భార‌త్, ఇప్పుడground with rain water{#}VIRAT KOHLI;Cricket;Audiటెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో భార‌త్ ఓట‌మికి కార‌ణాలివే!టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో భార‌త్ ఓట‌మికి కార‌ణాలివే!ground with rain water{#}VIRAT KOHLI;Cricket;AudiThu, 24 Jun 2021 15:16:00 GMTరెండేళ్ల‌పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తించిన టెస్టు క్రికెట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ ఎట్ట‌కేల‌కు ముగిసింది. తొలిసారి నిర్వ‌హించిన ఈ ఛాంపియ‌న్‌షిప్‌ను గెలిచి చ‌రిత్ర‌లో నిలిచిపోవాల‌నుకున్న కోహ్లీ సేన‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. అయితే, రెండేళ్ల పాటు వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్లిన భార‌త్‌.. ఆఖ‌రి ఆట‌లో గెలుపు రుచి చూడ‌కుండా ఎందుకు ఆగిపోయింది? సీనియ‌ర్లు గాయ‌ప‌డిన స‌మ‌యంలో కేవ‌లం రిజ‌ర్వ్ బెంచ్ ఆట‌గాళ్ల‌తోనే ఆడి ఆసీస్‌ను వారి దేశంలోనే మ‌ట్టి క‌రిపించిన భార‌త్, ఇప్పుడు అనుభ‌వ‌జ్ఞులు ఉన్నా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన టెస్టు ఛాంపియ‌న్‌షిప్‌లో ఎందుకు ఓడిపోయింది? ఈ విష‌యాల గురించి విశ్లేషిస్తే... క‌ర్ణుడి చావుకు కార‌ణాలు అనేకం అన్న‌ట్టుగా బోలెడ‌న్ని విష‌యాలు క‌నిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దామా!

టెస్టు క్రికెట్ ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించ‌డంలో భార‌త్‌కు అడ్డుగా కార‌ణాలు ఎన్ని ఉన్నా ప్ర‌ధానంగా దెబ్బ‌తీసింది మాత్రం వ‌ర్ష‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఫైన‌ల్ మ్యాచ్ ఆరంభ‌మైన నాటి నుంచి తొలి నాలుగు రోజులు వ‌రుణుడు తీవ్రంగా ప్ర‌భావం చూపాడు. ఆ నాలుగు రోజుల్లో కేవ‌లం ఒక‌టిన్న‌ర రోజు మాత్ర‌మే ఆట సాగిందంటే.. వ‌ర్షం ఎంత దెబ్బ కొట్టిందో అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో పాటు మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టుకు స‌రైన మ్యాచ్‌ ప్రాక్టీస్ లేదు. దీనికి తోడు మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టు చాలా రోజులు క్వారంటైన్‌లో ఉండ‌టం వ‌ల్ల ఆట‌గాళ్ల మాన‌సిక స్థితి మ‌రింత దెబ్బ‌తింది. అయితే, అదే స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు, ఇంగ్లండ్ జ‌ట్టుతో టెస్టు సిరీస్ ఆడ‌టం వారికి బాగా క‌లిసొచ్చింది.

ఈ విష‌యాల‌న్నీ ఇలా ఉంటే.. మ్యాచ్ ముందు రోజు వ‌రకూ ఎండ కాయ‌డం వ‌ల్ల వాతావ‌ర‌ణాన్ని స‌రిగ్గా అంచ‌నా వేయ‌డంలో భార‌త్ త‌డ‌బ‌డింది. దాంతో ప్ర‌త్య‌ర్థి ఒక్క స్పిన్న‌ర్‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌కుండా ఐదుగురు పేస‌ర్ల‌తో మైదానంలో అడుగు పెడితే.. భార‌త్ ఏకంగా ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌కు అవ‌కాశం ఇచ్చి కేవ‌లం ముగ్గురు పేస‌ర్ల‌తోనే బ‌రిలోకి దిగ‌డం టీమిండియా విజ‌య‌వ‌కాశాల‌ను మ‌రింత దిగ‌జార్చాయి. వీట‌న్నింటికీ తోడు ఈ మ్యాచ్‌లో ప్ర‌ధాన పేస‌ర్ బుమ్రా వైఫ‌ల్యం భార‌త జ‌ట్టును మ‌రింత దెబ్బ‌తీసింది. అలాగే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు కెప్టెన్ విలియ‌మ్స‌న్‌, సీనియ‌ర్ ఆట‌గాడు రాస్ టేల‌ర్ బ్యాటింగ్ చేసేట‌ప్పుడు చూపిన స‌హ‌నం, నిల‌క‌డ భార‌త బ్యాట్స్‌మ‌న్ చూప‌లేక‌పోయార‌నే చెప్ప‌వ‌చ్చు.



మంచిమాట : శకుని పాచికల వెనుక ఉన్న రహస్యం ఇదే..

ప్రపంచ స్థాయి షూటర్.. ఎన్నో మెడల్స్.. కానీ చివరికి చిప్స్ అమ్ముకుంటూ?

WTC final : చారిత్రాత్మక విజయం.. అంతలో రిటైర్మెంట్?

WTC final : కోహ్లీ తీసుకున్న ఆ నిర్ణయమే కొంపముంచిందా?

జడేజా ఇప్పుడు నెంబర్..1?

నాని యాక్టింగ్ చూసి నాలుగు సార్లు ఏడ్చా : షాహిద్ కపూర్

కేన్ సౌథీకి ఇచ్చిన ఆ ఒక్క సలహానే ఇండియాను ఓడించిందా...?

అశ్విన్ ని విలియమ్సన్ ఎక్కడ భయపెట్టాడు...?

బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తీసిపోదబ్బా ఈమె అందం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sanjay]]>