PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/avanthi-435a424b-0a08-4b7f-98f2-7a18b3f11ad7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/avanthi-435a424b-0a08-4b7f-98f2-7a18b3f11ad7-415x250-IndiaHerald.jpgటూరిజం ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్ల‌లో విదేశీమ‌ద్యం అందుబాటులో ఉంటుంద‌ని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.అయితే దీనిపై ఓ వ‌ర్గం మీడియా అస‌త్య‌క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తుంద‌ని ఆరోపించారు.టూరిజంను ప్ర‌మోట్ చేయ‌డానికే మ‌ద్యం అందుబాటులో ఉంది కానీ..మ‌ద్యాన్ని ప్ర‌మోట్ చేయ‌డానికి టూరిజం కాద‌ని మీడియా గ్ర‌హించాల‌న్నారు.టూరిజం ను ప్రమోట్ చేయడానికే మద్యం గానీ.. మద్యాన్ని ప్రమోట్ చేయడానికి టూరిజం కాదు. మీడియా ఈ విషయాలను గ్రహించాలి.ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు కూడా రామోజీ ఫిల్మ్‌సిటీలో తారా,సితార హోట‌ళ్లavanthi;{#}ramoji rao;avanthi srinivas;TDP;Party;srinivas;YCP;media;Ministerమీ హోట‌ళ్ల‌లో విదేశీ మ‌ద్యం లేదా...? మంత్రి అవంతిమీ హోట‌ళ్ల‌లో విదేశీ మ‌ద్యం లేదా...? మంత్రి అవంతిavanthi;{#}ramoji rao;avanthi srinivas;TDP;Party;srinivas;YCP;media;MinisterThu, 24 Jun 2021 19:19:00 GMTటూరిజం ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్ల‌లో విదేశీమ‌ద్యం అందుబాటులో ఉంటుంద‌ని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.అయితే దీనిపై ఓ వ‌ర్గం మీడియా అస‌త్య‌క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తుంద‌ని ఆరోపించారు.టూరిజంను ప్ర‌మోట్ చేయ‌డానికే మ‌ద్యం అందుబాటులో ఉంది కానీ..మ‌ద్యాన్ని ప్ర‌మోట్ చేయ‌డానికి టూరిజం కాద‌ని మీడియా గ్ర‌హించాల‌న్నారు.టూరిజం ను ప్రమోట్ చేయడానికే మద్యం గానీ.. మద్యాన్ని ప్రమోట్ చేయడానికి టూరిజం కాదు. మీడియా ఈ విషయాలను గ్రహించాలి.ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు కూడా రామోజీ ఫిల్మ్‌సిటీలో తారా,సితార హోట‌ళ్లు,విశాఖ‌లోని డాల్ఫిన్ హోటళ్ల‌ను న‌డిప‌స్తున్నార‌ని...అక్క‌డ కూడా మ‌ద్యం అందుబాటులో ఉంటుంది మ‌రి దాన్ని ఏమంటార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

వైసీపీ ప్ర‌భుత్వం ద‌శ‌ల వారీగా మ‌ద్య‌పాన నియంత్ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉంద‌ని..దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టూరిజం ప్ర‌మోష‌న్‌లో భాగంగానే ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ఎక్క‌డైతే రెస్టారెంట్లు ఉంటాయో అక్క‌డ విదేశీ మ‌ద్యం అందుబాటులో ఉంటుంద‌ని మాత్ర‌మే తాము చెప్పామ‌ని మంత్రి అవంతి తెలిపారు.మేము ఏదో మద్యాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు టీడీపీ నేత‌లు మాట్లాడుతున్నార‌ని...చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊరూరా మద్యం బెల్టు షాపులను ఏర్పాటు చేసి, ఆఖరికి పార్టీ కార్యకర్తలను పెట్టి మద్యం అమ్మించార‌ని ఆరోపించారు.మ‌ద్యాన్నిఇంటింటికీ డోర్ డెలివరీ ఏర్పాట్లు చేశార‌ని తెలిపారు.వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఏకంగా 43 వేల బెల్టుషాపులు మూసివేసి..మ‌ద్యం ప‌ర్మిట్ రూమ్‌ల‌ను ర‌ద్దు చేశామ‌ని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.మ‌ద్యం షాపుల‌ను,బార్ల సంఖ్య‌ను త‌గ్గించామ‌ని...మ‌ద్య నియంత్ర‌ణ కోసం దేశంలో ఏ రాష్ట్రంలో చేయ‌ని విధంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నార‌ని తెలిపారు.

చంద్ర‌బాబు,లోకేష్ మోకాలికి,బోడిగుండుకి ముడిపెట్టి ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించ‌డం మంచిది కాద‌ని..ఊరురా బెల్టు షాపులు పెట్టించి మ‌ద్యం అమ్మించిన చంద్ర‌బాబు మ‌ద్యం గురించి మాట్లాడితే ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లు ఉంటుంద‌ని అవంతి ఎద్దేవా చేశారు.క‌రోనా క‌ష్ట‌కాలంలో 15 నెల‌లు రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఏమైయ్యారు అని కూడా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేద‌ని...హైద‌రాబాద్‌లో కూర్చుని జూమ్‌మీటింగ్‌లు పెట్టుకుని దాన్ని త‌న‌కు వ‌త్తాసు ప‌లికే మీడియాలో రాయించుకుని ఆనంద‌ప‌డుతున్నార‌ని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.



ప‌రీక్ష‌ల ర‌ద్దు విజ‌యం ఎవ‌రిది..? లోకేష్ భ‌జ‌న మొద‌లైందా..?

'కేజీఎఫ్2' వెంట పడుతున్న వైసీపీ ఎంపీ..?

ఆన్లైన్ మోసంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి..

తెలంగాణ‌ మంత్రిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీపీఐ నారాయ‌ణ‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బ‌య‌ట‌ప‌డుతున్న డెల్టాప్ల‌స్ వేరియంట్ కేసులు

బిగ్ బ్రేకింగ్ : ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు

తెలంగాణ‌లో ట్రైటాన్ భారీ పెట్టుబ‌డి?

శ్రావ‌ణ‌మాసంలో మెద‌క్‌కు శుభ‌వార్త‌?

ఈ ఎలుగు బంటి చేజీంగ్ మామూలుగా లేదుగా..వీడియో వైరల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>