MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/puspa-movie-gossip2ff4f3a5-9f86-421d-9cc8-cf754094ef79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/puspa-movie-gossip2ff4f3a5-9f86-421d-9cc8-cf754094ef79-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ కాస్త గ్యాప్ ఇచ్చినట్లుంది. మళ్ళీ ఎప్పుడు మూడవ దశపేరుతో మన ముందుకొస్తుందో తెలియని పరిస్థితి. లాక్ డౌన్ పరిమితులను కూడా ఎత్తివేయడంతో సినిమా ఇండస్ట్రీకి ఊరట లభించింది. ఇంతకు ముందు కరోనా కారణంగా షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలన్నీ షూటింగ్ ను మొదలు పెట్టడానికి చక చకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.PUSPA MOVIE GOSSIP{#}Rajamouli;Athidhi;NTR;sukumar;Allu Arjun;News;Hero;Director;Nijam;Coronavirus;Cinema"పుష్ప 2" లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న సుక్కు... ?"పుష్ప 2" లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న సుక్కు... ?PUSPA MOVIE GOSSIP{#}Rajamouli;Athidhi;NTR;sukumar;Allu Arjun;News;Hero;Director;Nijam;Coronavirus;CinemaThu, 24 Jun 2021 15:03:05 GMTప్రస్తుతం కరోనా వైరస్ కాస్త గ్యాప్ ఇచ్చినట్లుంది. మళ్ళీ ఎప్పుడు మూడవ దశపేరుతో మన ముందుకొస్తుందో తెలియని పరిస్థితి. లాక్ డౌన్ పరిమితులను కూడా ఎత్తివేయడంతో సినిమా ఇండస్ట్రీకి ఊరట లభించింది. ఇంతకు ముందు కరోనా కారణంగా షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలన్నీ షూటింగ్ ను మొదలు పెట్టడానికి చక చకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్" షూటింగ్ ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ దొరికిన కాస్త సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మళ్ళీ సినిమా షూటింగ్ లు ఆగిపోయే పరిస్థితి ఉంది. కాగా సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పుష్ప మూవీ షూటింగ్ ను కూడా మొదలెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ఈ లాక్ డౌన్ కాలంలో పుష్ప సినిమాపై విపరీతమైన ఊహాగానాలు, వార్తలు వచ్చాయి. వాటిలో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు. ఇప్పుడు అదే విధంగా మరొక్క వార్త బన్నీ అభిమానులను మరియు ఎన్టీఆర్ అభిమానులను సంతోషపెట్టేలా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఇప్పటికే వార్త ప్రచారంలో ఉంది. ఈ రెండవ పార్ట్ లో డైరెక్టర్ సుకుమార్ ఒక బిగ్ సర్ప్రైజ్ ను ప్లాన్ చేస్తున్నాడని వినికిడి. ఈ సినిమాలో తనకు బాగా ఇష్టమైన  హీరో ఎన్టీఆర్ ను గెస్ట్ రోల్ లో నటింపచేయడానికి సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.

 కానీ ఇందుకు ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది. అతిధి పాత్రే కాబట్టి దాదాపుగా ఒకే చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అటు సుకుమార్ నుండి కానీ ఎన్టీఆర్ నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది కనుక నిజం అయితే అటు బన్నీ ఫ్యాన్స్ కి ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండుగే. మరి ఏమి జరగనుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడక తప్పదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున విషయం తెలిసిందే.
 


సీఎం జగన్.. ఇక పంతాలు, పట్టింపులు పక్కన పెట్టండి : రఘురామ

పవన్ రానా మూవీ రిలీజ్ అప్పుడే ?

ఇంగ్లీష్ భాషలోకి మొదటిసారి డబ్ అయిన తెలుగు సినిమా ఇదే

కేజీఎఫ్ స్టార్‌తో బాలయ్య పోటీ.. చిత్తయ్యేది ఎవరో..?

'శ్యామ్ సింగరాయ్' లో సాయి పల్లవి పాత్ర అదేనట..?

పుకార్ల‌ను న‌మ్మెద్దంటున్న‌ నంద‌మూరి హీరో

సీత పాత్ర కోసం కంగ‌నే కావాలంటున్న స్టార్ రైట‌ర్.. ?

రామ్ కి మంచి కిక్ ఇచ్చిన లింగుస్వామి

మరో కొత్త బిజినెస్ ను మొదలెట్టిన సురేష్ ప్రొడక్షన్.. అదే టార్గెట్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>