
తెలంగాణలో అనుకూలతల కారణంగా…
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ట్రైటాన్ కంపెనీని విస్తరించాలనుకుంటున్నట్లు ఆ సంస్థ సీఈవో హిమాన్షు పటేల్ మంత్రి కేటీఆర్‌తో తెలిపారు. ఇందుకోసం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని అవకాశాలను పరిశీలించిన పిదప తెలంగాణలోనే తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూలతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు…
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్న ట్రైటాన్ సంస్థ నిర్ణయానికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ట్రైటాన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ద్వారా తొలి ఐదేళ్లలో 50వేల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.ట్రైటాన్ రాకతో రాష్ట్రంలో సుమారు 25వేల మంది ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్నారు. భవిష్యత్తులో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందన్నారు. తెలంగాణ సంస్థ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ దేశంలోనే అత్యుత్తమ పాలసీ అని… ఈ రంగంలో రాష్ట్రానికి క్రమంగా మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ ఐపాస్ కింద ఒక మెగా ప్రాజెక్టుకు లభించే అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున ట్రైటాన్‌కు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఇప్పటికే కొలువుదీరిన దిగ్గజ సంస్థలు
హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే అమెజాన్,మైక్రోసాఫ్ట్,గూగుల్,యాపిల్,ఫేస్‌బుక్,ఉబెర్ వంటి దిగ్గజ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థలు ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టాయి. అమెజాన్ ఏకంగా రూ.20,761 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ ఇదే భారీ పెట్టుబడిగా గతంలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు.హైదరాబాద్ కేంద్రంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కార్యాకలాపాలు 2022 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.