MoviesGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tagf88cf1c6-1ffe-4115-be1d-b8e533bac546-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tagf88cf1c6-1ffe-4115-be1d-b8e533bac546-415x250-IndiaHerald.jpg ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వాడిగా, వేడిగా కొన‌సాగుతోన్న రాజ‌కీయాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ రాజ‌కీయాలు ఉండ‌బోతున్నాయి. సినిమాల్లో న‌ట‌న ప‌రంగా ఆక‌ట్టుకున్న న‌టులంతా కొంత‌సేపే వాటికి ప్యాక‌ప్ చెప్పి ప్ర‌జ‌లంద‌రికీ రాజ‌కీయ విందు పంచ‌బోతున్నారు. మ‌న హీరోలు, మ‌న హీరోయిన్లు కూడా ఇంత రాజ‌కీయం చేస్తారా? అని ఆశ్చ‌ర్య‌పోవ‌డం మీవంత‌వుతుంది ఇక‌నుంచి. హాస్యం, రౌద్రం, భావోద్వేగంలాంటి న‌వ‌ర‌సాల‌ను పండించే న‌టులు రాజ‌కీయం పండించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. tag{#}vishnu;Yuva;manchu vishnu;mohan babu;Telangana;Chiranjeevi;Telugu;Cinemaతెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు అమృతాంజ‌న్ కావాలి?తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు అమృతాంజ‌న్ కావాలి?tag{#}vishnu;Yuva;manchu vishnu;mohan babu;Telangana;Chiranjeevi;Telugu;CinemaWed, 23 Jun 2021 09:35:24 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వాడిగా, వేడిగా కొన‌సాగుతోన్న రాజ‌కీయాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ రాజ‌కీయాలు ఉండ‌బోతున్నాయి. సినిమాల్లో న‌ట‌న ప‌రంగా ఆక‌ట్టుకున్న న‌టులంతా కొంత‌సేపే వాటికి ప్యాక‌ప్ చెప్పి ప్ర‌జ‌లంద‌రికీ రాజ‌కీయ విందు పంచ‌బోతున్నారు. మ‌న హీరోలు, మ‌న హీరోయిన్లు కూడా ఇంత రాజ‌కీయం చేస్తారా? అని ఆశ్చ‌ర్య‌పోవ‌డం మీవంత‌వుతుంది ఇక‌నుంచి. హాస్యం, రౌద్రం, భావోద్వేగంలాంటి న‌వ‌ర‌సాల‌ను పండించే న‌టులు రాజ‌కీయం పండించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

ప్ర‌కాష్‌రాజ్‌కు నాగ‌బాబు మ‌ద్ద‌తు
తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అధ్య‌క్షుడిగా ఉన్న సీనియ‌ర్ న‌రేష్ ప‌ద‌వీకాలం ముగియ‌నుండ‌టంతో ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. ప్ర‌తిభావంతుడైన విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ తాను మా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీచేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దేశంలో ఉన్న స‌ని ప‌రిశ్ర‌మ‌ల్లో తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ చాలా పెద్ద‌ద‌ని, కానీ అందుకు త‌గ్గ‌ట్లుగా అక్క‌డ అభివృద్ధి జ‌ర‌గ‌డంలేద‌ని, తాను అధ్య‌క్షుడిన‌య్యాక మాను అభివృద్ధి ప‌థంలో ప‌య‌నింప‌చేస్తాన‌న్నారు. ఇంత‌వ‌ర‌కు సొంత భ‌వ‌నం లేక‌పోవ‌డం ఆవేద‌న క‌లిగిస్తోంద‌ని, తాను అధ్య‌క్షుడిన‌య్యాక ముందుగా మాకు సొంత భ‌వ‌నం ఏర్పాటు చేస్తాన‌న్నారు. చిరంజీవి, తాను రాజ‌కీయాల ప‌రంగా వేరైన‌ప్ప‌టికీ సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చేస‌రికి అంద‌రూ ఒక్క‌టేన‌న్నారు. అయితే చిరుతో ఉన్న సాన్నిహిత్యాన్ని తాను మా ఎన్నిక‌ల‌కు ఉప‌యోగించుకోన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌కాష్‌రాజ్ ప్ర‌క‌టన వెలువ‌డిన వెంట‌నే చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు స్పందించారు. ప్ర‌కాష్‌రాజ్‌కు త‌మ కుటుంబం మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

మంచు విష్ణు రంగంలోకి దిగాడా?
ఇప్ప‌టివ‌ర‌కు మా ఎన్నిక‌ల్లో పోటీచేస్తున్నానంటూ యువ క‌థానాయ‌కుడు మంచు విష్ణు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. కానీ సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌లంద‌రినీ క‌లుస్తున్నారు. చిరంజీవి, మోహ‌న్‌బాబు మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం అంద‌రికీ తెలిసిందే. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ 75 వ‌సంతాల వేడుక సంద‌ర్భంగా వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. అయితే కాల‌క్ర‌మంలో ఇద్ద‌రూ మ‌న‌స్ప‌ర్థ‌లు మ‌రిచి బాగా స‌న్నిహిత‌మ‌య్యారు. ఇప్పుడు విష్ణుకు చిరంజీవి కుటుంబం మ‌ద్ద‌తు ఇస్తుందా?  లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్నగా మారింది. ప్ర‌కాష్‌రాజ్‌కానీ, మంచు విష్ణుకానీ ఎవ‌రికివారు వారి ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టంతో ఎవ‌రినీ కాద‌న‌లేక మా ఎన్నిక‌ల్లో ఓటుహ‌క్కు ఉన్న‌వారంద‌రికి ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పి ఎదురైంది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసేవ‌ర‌కు వారికి ఈ త‌ల‌నొప్పి త‌ప్పేలా లేదు..!








అల్లు శిరీష్ ఈసారి గట్టిగానే ఫిక్స్ అయినట్లు ఉన్నాడు గా!!

విక్రమార్కుడు సినిమాకు @ 15 యేళ్లు..

“సలార్”లో శృతి రోల్ అదేనా..?

రాజమౌళి సుకుమార్ ల శతృత్వంలో మిత్రత్వం !

"మా" ఎన్నిక‌ల్లో సెటిలర్లెవ‌రు? స్థానికులెవ‌రు?

కోమ‌టిరెడ్డికి ఇంత అవ‌మాన‌మా... !

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వాడిగా, వేడిగా కొన‌సాగుతోన్న రాజ‌కీయాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ రాజ‌కీయాలు ఉండ‌బోతున్నాయి. సినిమాల్లో న‌ట‌న ప‌రంగా ఆక‌ట్టుకున్న న‌టులంతా కొంత‌సేపే వాటికి ప్యాక‌ప్ చెప్పి ప్ర‌జ‌లంద‌రికీ రాజ‌కీయ విందు పంచ‌బోతున్నారు.

సింగర్ వాణీ జ‌య‌రామ్ గురించి మీకు తెలియని నిజాలివే..!!

ఏకే రీమేక్ పవన్ నిజ జీవితానికి ఇలా రిలేట్ అయ్యిందా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>