PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan19b19290-caea-4487-a8e3-0e4c5f60483f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan19b19290-caea-4487-a8e3-0e4c5f60483f-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో పరీక్షల నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమం అని దాని వలన 80 లక్షల మందికి ముప్పు పొంచి ఉందని మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దేశంలో పరీక్షలు రద్దు చేయని ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని ఆయన పేర్కొన్నారు. ఓ తండ్రిలా ఆలోచించా కాబట్టే విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు పరీక్షలు రద్దు చేయమని 2 నెలలుగా పోరాటం చేస్తున్నానని అన్నారు. కరోనా తీవ్రతలో దేవాన్ష్ పరీక్షలు రాయాల్సి వస్తే పరిస్థితేంటి అని ఆవేదన చెంది విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకుని రద్దు చేయమని డిమాya jagan{#}Audimulapu Suresh;Governor;Lokesh;Lokesh Kanagaraj;Minister;Andhra Pradesh;Jagan;Coronavirusమెంటల్ మామలా జగన్?మెంటల్ మామలా జగన్?ya jagan{#}Audimulapu Suresh;Governor;Lokesh;Lokesh Kanagaraj;Minister;Andhra Pradesh;Jagan;CoronavirusWed, 23 Jun 2021 13:17:00 GMTరాష్ట్రంలో పరీక్షల నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమం అని దాని వలన 80 లక్షల మందికి ముప్పు పొంచి ఉందని మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దేశంలో పరీక్షలు రద్దు చేయని ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని ఆయన పేర్కొన్నారు. ఓ తండ్రిలా ఆలోచించా కాబట్టే విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు పరీక్షలు రద్దు చేయమని 2 నెలలుగా పోరాటం చేస్తున్నానని అన్నారు. కరోనా తీవ్రతలో దేవాన్ష్ పరీక్షలు రాయాల్సి వస్తే పరిస్థితేంటి అని ఆవేదన చెంది విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకుని రద్దు చేయమని డిమాండ్ చేశామని లోకేష్ చెప్పుకొచ్చారు. 


మొండితనంతో 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం ప్రభుత్వానికి తగదని పేర్కొన్న ఆయన దేశమంతా ఒక దారిలో వెళ్తుంటే అందుకు విరుద్ధంగా జగన్ రెడ్డి వైఖరి సరికాదని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనని దృష్ట్యా తక్షణమే పరీక్షలు రద్దు చెయ్యాలని డిమాండ్ చేసిన ఆయన పరీక్షలు రద్దు నిర్ణయాన్ని వెంటనే అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలపాలని అన్నారు. పరీక్షల రద్దుకు మద్దతు తెలిపిన దాదాపు 7 లక్షల మంది అభిప్రాయాలను ముఖ్యమంత్రి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


ఒక్క విద్యార్థి ప్రాణానికి ముప్పు వాటిల్లినా జగన్ రెడ్డిదే బాధ్యతే, దానిని ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తామని ఆయన అన్నారు. పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోకుంటే మరింతగా ఉద్యమిస్తామని అన్నారు. ఇక ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో లేక గందరగోళ శాఖకు మంత్రిగా ఉన్నారో అర్థం కావట్లేదని, హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా ఇగోకి బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డికి పరీక్షలు రద్దు చేసేందుకు మనస్సు రావట్లేదని విమర్శించారు. ఎవరెన్ని చెప్పినా పరీక్షలు పెట్టి ప్రాణాలు తీస్తానంటూ మెంటల్ మామలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు.

 

 




చిరుని రౌండప్ చేసేశారుగా...!

కరోనా థర్డ్ వేవ్: తీసుకోవలసిన జాగ్రత్తలివే ... ?

హైకోర్టులో నివేదిక సమర్పించిన డిహెచ్.. ఏం చెప్పారో తెలుసా?

హుజురాబాద్ లో బీజేపీదే విజయం..?

జ‌గ‌న్ తొలి కేబినెట్లో ఎవ‌రికెన్ని మార్కులు...!

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎక్కువ సపోర్ట్‌గా ఉండే సినీ హీరో ఎవరంటే? ఠక్కున మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పేయొచ్చు. రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమా రంగంలో సత్తా చాటుతున్న చిరు, సందర్భాన్ని బట్టి అటు కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఇటు జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతూనే ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న చిరు..సినిమా ఇండస్ట్రీకు సంబంధించిన విషయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇటీవల కర్నూలులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలు వెనుక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి హస్తం ఉందని చంద్రబాబుతో సహ పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే నారా లోకేష్ కర్నూలు పర్యటనకు వెళ్ళి బాధిత కుటుంబాలని ఓదార్చి, మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఫైన‌ల్ నిర్ణ‌యం అదే..ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై మంత్రి.. !

చినబాబు తప్పుని సరి చేస్తున్న బాబు భక్తుడు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>