Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gopichand-seetimaar-movie-release-dateb08c1767-3b72-4274-a306-678727dbaa22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gopichand-seetimaar-movie-release-dateb08c1767-3b72-4274-a306-678727dbaa22-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో అయ్యే కటౌట్ ఉన్నా సరే గోపీచంద్ ఎందుకో కెరియర్ లో వెనకపడ్డాడు. తను చేస్తున్న సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకోవట్లేదు. సినిమాలైతే చేస్తున్నాడు కాని హిట్ మాత్రం కొట్టని గోపీచంద్ తన ఆశలన్ని ప్రస్తుతం చేస్తున్న సీటీమార్ సినిమా మీద పెట్టుకున్నాడు. సంపత్ నంది డైరక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా సీటీమార్.Gopichand{#}keerthi suresh;maruti;sampath nandi;tamannaah bhatia;Huzur Nagar;Josh;Hero;Heroine;Cinemaడైరక్టర్ మీద నమ్మకం పెట్టుకున్న యాక్షన్ హీరో..!డైరక్టర్ మీద నమ్మకం పెట్టుకున్న యాక్షన్ హీరో..!Gopichand{#}keerthi suresh;maruti;sampath nandi;tamannaah bhatia;Huzur Nagar;Josh;Hero;Heroine;CinemaWed, 23 Jun 2021 08:06:24 GMTస్టార్ హీరో అయ్యే కటౌట్ ఉన్నా సరే గోపీచంద్ ఎందుకో కెరియర్ లో వెనకపడ్డాడు. తను చేస్తున్న సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకోవట్లేదు. సినిమాలైతే చేస్తున్నాడు కాని హిట్ మాత్రం కొట్టని గోపీచంద్ తన ఆశలన్ని ప్రస్తుతం చేస్తున్న సీటీమార్ సినిమా మీద పెట్టుకున్నాడు. సంపత్ నంది డైరక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా సీటీమార్.

ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. గోపీచంద్ ను సంపత్ నంది అయినా హిట్ ట్రాక్ ఎక్కిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గోపీచంద్ మాత్రం డైరక్టర్ సంపత్ నంది మీద నమ్మకం పెట్టుకున్నాడు. సినిమా మొత్తం పూర్తయ్యి రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది.

ఓటిటి ఆఫర్లు వస్తున్నా చిత్రయూనిట్ మాత్రం వెండితెర మీదే బొమ్మ పడాలంటూ చెబుతుందట. సీటీమార్ అయినా గోపీచంద్ కు హిట్ జోష్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది. ఆ సినిమాలో గోపీచంద్ లాయర్ గా కనిపిస్తున్నారు. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉన్నట్టే కాబట్టి పక్కా కమర్షియల్ సినిమా పక్కా హిట్ అనేస్తున్నారు గోపీచంద్ ఫ్యాన్స్. గోపీచంద్ ఈ రెండు సినిమాలతో మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత తేజా డైరక్షన్ లో అలివేలు వెంకటరమణ సినిమాలో కూడా గోపీచంద్ నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్.  





ఓటీటీలో సత్తా చాటిన హీరోయిన్స్ వీళ్ళే..!

డైరక్టర్ మీద నమ్మకం పెట్టుకున్న యాక్షన్ హీరో.సీటీమార్ తో పక్కా హిట్ కొట్టాల్సిన గోపీచంద్.

భర్త వల్ల దారుణంగా మోసపోయిన రోజా ..!

ఫ్యాన్స్ కి నాగార్జున డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారా..!!

పూనం ఆఫర్.. క్రికెట్ ఫాన్స్ అందుకునేరా..?

స్మరణ : మొట్టమొదటి తెలుగు హాలీవుడ్ నటుడు..

మాస్ రాజా డిమాండ్ అలా ఉంది.. షాక్ ఇస్తున్న రెమ్యునరేషన్..!

టీవీ : మేకప్ లేని యాంకర్స్.. చూస్తే షాక్..

టీవీ : మేకప్ లేని యాంకర్స్.. చూస్తే షాక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>