PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokeshec003a9d-d4f6-47d9-9b6a-82f926bb3d39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokeshec003a9d-d4f6-47d9-9b6a-82f926bb3d39-415x250-IndiaHerald.jpgఇటీవల కర్నూలులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలు వెనుక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి హస్తం ఉందని చంద్రబాబుతో సహ పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే నారా లోకేష్ కర్నూలు పర్యటనకు వెళ్ళి బాధిత కుటుంబాలని ఓదార్చి, మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.lokesh{#}Lokesh;Nara Lokesh;Murder.;TDP;Lokesh Kanagaraj;Buddha Venkanna;S Radhakrishna;MLA;YCP;ram pothineni;media;Jagan;Reddyచినబాబు తప్పుని సరి చేస్తున్న బాబు భక్తుడు...చినబాబు తప్పుని సరి చేస్తున్న బాబు భక్తుడు...lokesh{#}Lokesh;Nara Lokesh;Murder.;TDP;Lokesh Kanagaraj;Buddha Venkanna;S Radhakrishna;MLA;YCP;ram pothineni;media;Jagan;ReddyWed, 23 Jun 2021 12:21:26 GMTఇటీవల కర్నూలులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలు వెనుక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి హస్తం ఉందని చంద్రబాబుతో సహ పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే నారా లోకేష్ కర్నూలు పర్యటనకు వెళ్ళి బాధిత కుటుంబాలని ఓదార్చి, మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.


అలాగే ఆవేశంగా జగన్‌ని పరుష పదజాలంతో దూషించారు. ఇలా చినబాబు మాట్లాడక, వైసీపీ నేతలు ఎందుకు ఆగుతారు. వారు కూడా తమదైన శైలిలో బూతులు అందుకున్నారు. చినబాబుని బండబూతులు తిట్టారు. మళ్ళీ వారికి టీడీపీ నేతలు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు భక్తుడు అని గతంలో ప్రకటించుకున్న టీడీపీ నేత బుద్దా వెంకన్న ఈ అంశంపై స్పందిస్తూ, లోకేష్ ఏదో అన్నాడని తిట్టడం కరెక్ట్ కాదని, తమ కార్యకర్తలని హత్య చేశారనే ఆవేశంలో లోకేష్ అలా మాట్లాడారు తప్ప, జగన్ మాదిరిగా వ్యక్తిగత దూషణలకు దిగలేదని చెప్పారు.


అంటే లోకేష్ ఇక్కడ ఆవేశంలో ఏదో మాట్లాడేశారని బుద్దా కాస్త తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. అంటే చినబాబు మాట్లాడింది తప్పే అని పరోక్షంగా చెప్పారు. అదే సమయంలో జగన్ వ్యక్తిగత దూషణలు చేశారని విమర్శించారు. అయితే ఆవేశంలో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో విమర్శలనేవి నిర్మాణాత్మకంగా ఉండాలి. అలా లేకపోతే ప్రజలే నాయకులని తిరస్కరిస్తారు.


అదే సమయంలో జగన్ సైతం వ్యక్తిగతంగా పరుష పదజాలం వాడుతూ ఏ నాయకుడుపైన విమర్శలు చేయలేదు. ఏదైనా రాజకీయంగానే మాట్లాడారు గానీ, వ్యక్తిగత దూషణలైతే చేయలేదని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ నారా లోకేష్ ఎలా మాట్లాడారో అంతా చూశారని చెబుతున్నారు. అప్పుడు ఆవేశంగా మాట్లాడి తప్పు చేశారని చెప్పి, ఇప్పుడు ఆ తప్పుని బుద్దా సరిదిద్దే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో బూతులు మాట్లాడటం, వ్యక్తిగత దూషణలకు దిగడం అనేది సరికాదు.     




చిరుని రౌండప్ చేసేశారుగా...!

మెంటల్ మామలా జగన్?

జ‌గ‌న్ తొలి కేబినెట్లో ఎవ‌రికెన్ని మార్కులు...!

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎక్కువ సపోర్ట్‌గా ఉండే సినీ హీరో ఎవరంటే? ఠక్కున మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పేయొచ్చు. రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమా రంగంలో సత్తా చాటుతున్న చిరు, సందర్భాన్ని బట్టి అటు కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఇటు జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతూనే ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న చిరు..సినిమా ఇండస్ట్రీకు సంబంధించిన విషయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మేనల్లుడి సినిమా టైటిల్ లాంచ్ చేసిన మహేష్..!

మా జాతిలో పుట్టి మమ్మల్నే అవమానిస్తావా అంబటి...?

తండ్రి అవుతోన్న యంగ్ హీరో

ఇటీవల కర్నూలులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలు వెనుక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి హస్తం ఉందని చంద్రబాబుతో సహ పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే నారా లోకేష్ కర్నూలు పర్యటనకు వెళ్ళి బాధిత కుటుంబాలని ఓదార్చి, మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

అమరావతి : కాసేపట్లో ప్రారంభం కానున్న ఐటీ పాలసీపై సీఎం జగన్ సమీక్ష. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ పై చేపట్టనున్న సమీక్ష. హాజరు కానున్న ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>