MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevib1503c6a-2495-418b-bcff-4de51a9cf2aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevib1503c6a-2495-418b-bcff-4de51a9cf2aa-415x250-IndiaHerald.jpg‘మా’ సంస్థ ఎన్నికల ప్రకటన ఇంకా అధికారికంగా రాకుండానే అటు ప్రకాష్ రాజ్ ఇటు మంచు విష్ణు లు తమ టీమ్ ప్యానల్స్ ను ఎంపిక చేస్తూ అప్పుడే అధ్యక్ష ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు వీరిద్దరూ కూడ తమ ఎన్నికల మ్యానిఫెస్టో ను ఎలా రూపొందించాలి అన్న విషయమై అప్పుడే ఆలోచనలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.వాస్తవానికి ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియకపోయినా అప్పుడే ఇండస్ట్రీలో ఎన్నికల వాతావరణం కనిపించడం హాట్ న్యూస్ గా మారింది. ఈ ఎన్నికలు ఇండస్ట్రీలో ఎన్ని వర్గాలను క్రియేట్ చేస్తాయో క్లారిటీ లేకపCHIRAngeevi{#}Chiranjeevi;Jr NTR;News;Prakash Raj;manchu vishnu;mohan babu;Electionsచిరంజీవి ని శ్రీకృష్ణుడు తో పోలుస్తూ కామెంట్స్ !చిరంజీవి ని శ్రీకృష్ణుడు తో పోలుస్తూ కామెంట్స్ !CHIRAngeevi{#}Chiranjeevi;Jr NTR;News;Prakash Raj;manchu vishnu;mohan babu;ElectionsWed, 23 Jun 2021 08:00:00 GMT‘మా’ సంస్థ ఎన్నికల ప్రకటన ఇంకా అధికారికంగా రాకుండానే అటు ప్రకాష్ రాజ్ ఇటు మంచు విష్ణు లు తమ టీమ్ ప్యానల్స్ ను ఎంపిక చేస్తూ అప్పుడే అధ్యక్ష ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు వీరిద్దరూ కూడ తమ ఎన్నికల మ్యానిఫెస్టో ను ఎలా రూపొందించాలి అన్న విషయమై అప్పుడే ఆలోచనలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియకపోయినా అప్పుడే ఇండస్ట్రీలో ఎన్నికల వాతావరణం కనిపించడం హాట్ న్యూస్ గా మారింది. ఈ ఎన్నికలు ఇండస్ట్రీలో ఎన్ని వర్గాలను క్రియేట్ చేస్తాయో క్లారిటీ లేకపోయినా చిరంజీవికి మాత్రం ఈ ఎన్నికలు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మహాభారతంలో శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సమయంలో అటు పాండవులకు ఇటు కౌరవులకు సమన్యాయం చేసినట్లుగా ఇప్పుడు చిరంజీవి కూడ ఈ ఎన్నికలలో ఇరు వర్గాలకు పరోక్షంగా సహకరించ వలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి చిరంజీవికి మోహన్ బాబు తోను అదేవిధంగా ప్రకాష్ రాజ్ తోను మంచి సాన్నిహిత్యం ఉంది.

ఇప్పుడు ఈ సాన్నిహిత్యం వల్లనే మెగా స్టార్ కు ఈ కొత్త సమస్యలు అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ విషయంలో ఎదో ఒక రాజీ మార్గాన్ని అనుసరించి అటు ప్రకాష్ రాజ్ కు ఇటు మంచు విష్ణు కు సమన్యాయం చేయాలని చిరంజీవి ఆలోచన అని టాక్. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు తన స్పీడ్ ను మరింత పెంచి ఇండస్ట్రీలోని అనేకమంది సీనియర్ జూనియర్ యాక్టర్స్ ను కలుస్తూ తనకు రాబోతున్న ఎన్నికలలో ఓటు వేసి గెలిపిస్తే తాను ‘మా’ సంస్థ కోసం చేయబోయే కార్యక్రమాల వివరాలను చెపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో రాబోతున్న ‘మా’ సంస్థ ఎన్నికలు మరో చిన్న కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తూ పైకి మాత్రం ఏకంగా కనిపిస్తున్న ఇండస్ట్రీలోని వర్గాలను మరొకసారి బయటపెట్టి అవకాశం ఉంది అన్నఅభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి..







ఫ్యాన్స్ కి నాగార్జున డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారా..!!

కొత్త Samsung galaxy M22 ఫీచర్స్, ధర గురించి తెలుసుకోండి...

రసవత్తరంగా 'మా' ఎలక్షన్స్.. రేసులో జీవితా రాజశేఖర్...

'అతనితో డేటింగ్ వల్లే నాజూకయ్య!': అవికా గోర్...

'నన్ను గర్భవతిని చెయ్యకండి'... పూనమ్ పాండే వైరల్ కామెంట్స్...

'మా'లో మలుపులు.. అనూహ్యంగా మారిన లెక్కలు!

గిరిబాబు చిన్న కొడుకు అందుకే సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడా..?

మెగాస్టార్ బ్లాక్ బస్టర్ టైటిల్స్ అలా... ?

లక్కు తోక తొక్కిన బిగ్ బాస్ భామ...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>