CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimeaca97bbf-561f-40d9-829f-73c2cb3cbfab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimeaca97bbf-561f-40d9-829f-73c2cb3cbfab-415x250-IndiaHerald.jpgకొంతమంది యువతి, యువకులు తెలిసి తెలియక తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. ప్రేమ మత్తులో చేసే పనులే మీ జీవితాలను పాడు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ఘటన ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పటికే వివాహం చేసుకున్న యువకుడు మరో యువతిని ఇలా చేశాడు. ఇద్దరిని ఆయన ఎలా పంచుకున్నాడో తెలిస్తే షాక్ అవుతాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ గ్రామంలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అప్పటికే పెళ్లి చేసుకున్న యువకుడు, మరో యువతిని ప్రేమ మత్తులో ముంచి పెళ్లి చేసుకున్నాడు. చివరికి విషయం బయటపCrime{#}prema;Assam;police;sunday;marriage;Love;Husband;Wife;contractగర్భవతిని చేశాడు.. వదిలేసి పారిపోయాడు..!గర్భవతిని చేశాడు.. వదిలేసి పారిపోయాడు..!Crime{#}prema;Assam;police;sunday;marriage;Love;Husband;Wife;contractWed, 23 Jun 2021 08:05:00 GMTకొంతమంది యువతి, యువకులు తెలిసి తెలియక తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. ప్రేమ మత్తులో చేసే పనులే మీ జీవితాలను పాడు చేస్తున్నాయి.  ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ఘటన ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పటికే వివాహం చేసుకున్న యువకుడు మరో యువతిని ఇలా చేశాడు. ఇద్దరిని ఆయన ఎలా పంచుకున్నాడో తెలిస్తే షాక్ అవుతాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ గ్రామంలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అప్పటికే పెళ్లి చేసుకున్న యువకుడు, మరో యువతిని ప్రేమ మత్తులో ముంచి పెళ్లి చేసుకున్నాడు. చివరికి  విషయం బయటపడడంతో ఆ యువకుడికి అసలు సమస్య మొదలైంది.  భర్త ఏ భార్య దగ్గర ఉండాలని ఆలోచన మొదలైంది. వెంటనే  50-50 సూత్రాన్ని ప్రయోగించారు. ఒక భార్య వద్ద మూడు రోజులు, మరొక భార్య వద్ద మూడు రోజులు ఉండేలా ఒప్పందం కుదిర్చారు.


 పూర్తి వివరాల్లోకి వెళితే రాంపూర్ లోని దొంకుపోరి తండాకు చెందిన ఓ వ్యక్తికి అంతకు ముందే పెళ్లి జరిగినది. సదరు వ్యక్తికి అస్సాం రాష్ట్రానికి చెందిన మరో యువతితో సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త  ప్రేమగా మారిపోయింది. ఆ యువతి ప్రేమలో పడ్డ యువకుడు  తన  భార్యను వదిలి పెట్టి మరి చండీగర్ వెళ్ళిపోయాడు. అక్కడ ఆ యువతితో కొద్దిరోజులు సహజీవనం చేశాడు. దీంతో యువతి గర్భవతి అయింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కంగారుపడిన వ్యక్తి, ఆ ప్రేయసిని వదిలి మళ్లీ స్వగ్రామానికి పారిపోయాడు.
అది గ్రహించిన యువతి ప్రియుడి కోసం తీవ్ర గాలింపు మొదలుపెట్టింది. చివరికి యువకుడి స్వగ్రామాన్ని కనిపెట్టి ఊరికి చేరుకున్నది. తన బాధనంతా గ్రామంలోని పెద్దలకు తెలియపరచినది.  వెంటనే ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా పోలీసులు వచ్చి సదరు యువకున్ని అదుపులోకి తీసుకొని విచారించారు. తదనంతరం ఆ వ్యక్తి ఆ ప్రేయసిని వివాహం  చేసుకున్నాడు.


దీంతో అసలు సమస్య మొదలైంది.  ఎవరితో ఉండాలనేది నిర్ణయించుకోలేక తలపట్టుకున్నాడు. మధ్యవర్తుల సహాయంతో  50-50 ఫార్ములాను ఉపయోగించాడు. అంటే మొదటి భార్య దగ్గర మూడు రోజులు, రెండవ భార్య దగ్గర మూడు రోజులు, మిగిలిన ఒక్క రోజు తల్లిదండ్రుల దగ్గర ఉండాలని గ్రామ పెద్దలు రాజీ కుదుర్చారు.    అయితే  మొదటి భార్య దగ్గర సోమవారం, మంగళవారం, బుధవారం, రెండో భార్య దగ్గర గురువారం, శుక్రవారం, శనివారం, ఉండాలని నిర్ణయించారు. ఆదివారం రోజు తల్లిదండ్రులతో ఉండాలని తేల్చి చెప్పారు. దీంతో ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు కథ  సుఖాంతంగా ముగిసింది.



ఓటీటీలో సత్తా చాటిన హీరోయిన్స్ వీళ్ళే..!

భర్త వల్ల దారుణంగా మోసపోయిన రోజా ..!

పూజా సమయంలో ఈ పొరపాటు చేస్తున్నారా ?

పూనం ఆఫర్.. క్రికెట్ ఫాన్స్ అందుకునేరా..?

ముగ్గురు పిల్లల మిస్సింగ్ ఘటనలో విషాదం.. !

కట్నం కోసం వేధిస్తున్నారా.. అయితే ఇలా చేయండి.. !

బ్రెజిల్ లో కొవాక్సిన్ ప్రకంపనలు..

ఆ కమ్మ నేతలకు కొడాలిపై అంత ప్రేమ ఎందుకో?

ధనుష్ ట్రైలింగ్వల్ మూవీ.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>