MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcpb77c471e-d2d5-453b-b5ed-2439458e13c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcpb77c471e-d2d5-453b-b5ed-2439458e13c1-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ప్రత్యర్ధులపై తీవ్రంగా విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ నాయకులు చాలామందే అంటారు. కానీ తమదైన శైలిలో వెటకారంగా పంచ్‌లు వేస్తూ, తమ మాటలతో ప్రత్యర్ధులని కట్టిపడేసి నాయకులు చాలా తక్కువగా ఉంటారు. ఆ తక్కువ మందిలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉంటారు. ఉత్తరాంధ్ర యాసతో ప్రత్యర్ధులపై మాటల బాణాలు వదిలే ధర్మశ్రీ మంత్రి పదవి కోసం చకోరా పక్షి మాదిరిగా ఎదురుచూస్తున్నారు.ysrcp{#}Uttarandhra;YCP;TDP;Hanu Raghavapudi;king;polavaram;Polavaram Project;Minister;Congress;MLAహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఒక్క ఛాన్స్ అంటున్న ధర్మశ్రీ...హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఒక్క ఛాన్స్ అంటున్న ధర్మశ్రీ...ysrcp{#}Uttarandhra;YCP;TDP;Hanu Raghavapudi;king;polavaram;Polavaram Project;Minister;Congress;MLAWed, 23 Jun 2021 05:00:00 GMTరాజకీయాల్లో ప్రత్యర్ధులపై తీవ్రంగా విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ నాయకులు చాలామందే అంటారు. కానీ తమదైన శైలిలో వెటకారంగా పంచ్‌లు వేస్తూ, తమ మాటలతో ప్రత్యర్ధులని కట్టిపడేసి నాయకులు చాలా తక్కువగా ఉంటారు. ఆ తక్కువ మందిలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉంటారు. ఉత్తరాంధ్ర యాసతో ప్రత్యర్ధులపై మాటల బాణాలు వదిలే ధర్మశ్రీ మంత్రి పదవి కోసం చకోరా పక్షి మాదిరిగా ఎదురుచూస్తున్నారు.


మొదట్లో మంత్రి పదవి మిస్ అయినా, ఈ సారి మాత్రం పదవి ఎలాంటి పరిస్తితుల్లో మిస్ కాకుండా చూసుకోవాలని ధర్మశ్రీ భావిస్తున్నారు. ఎలాగైనా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జగన్‌ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న ధర్మశ్రీ, ఎమ్మెల్యేగా బాగానే పనిచేస్తున్నారు. అసలు కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ధర్మశ్రీ 2004లో తొలిసారి మాడుగుల నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధిచారు.


2009 ఎన్నికల్లో చోడవరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికలోచ్చేసరికి వైసీపీ తరుపున పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో ధర్మశ్రీ విజయం సాధించారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మశ్రీ నియోజకవర్గంలో యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్న ధర్మశ్రీ, వారి సమస్యలని పరిష్కరించడంలో ముందున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తూనే, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.


నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల నిర్మాణాలు జరిగాయి. గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అటు పోలవరం కుడి కాలువ నిర్మాణం పూర్తి అయితే చోడవరంలో సాగునీటి సమస్య ఉండదు. అయితే గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయం సరిగ్గా లేదు. అటు రహదారుల కూడా సరిగ్గా లేవు.


రాజకీయంగా చూసుకుంటే చోడవరంలో కరణం స్ట్రాంగ్‌గానే ఉన్నారు. మంత్రి పదవి వస్తే మరింత స్ట్రాంగ్ అవుతారు. అలా అని చోడవరంలో టీడీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టీడీపీ తరుపున కే‌ఎస్‌ఎన్ రాజు పనిచేస్తున్నారు. కాకపోతే ఇక్కడ టీడీపీలో ఉన్న ఆధిపత్య పోరు ధర్మశ్రీకి కలిసొస్తుందనే చెప్పొచ్చు.    




ఆలీకి ఏమన్నా సెట్ చేస్తారా?

టీడీపీలో ఆ యువనేత దూకుడు...శ్రావణికి చెక్ పెట్టడానికేనా?

ఆ కమ్మ నేతలకు కొడాలిపై అంత ప్రేమ ఎందుకో?

ఆ కేంద్ర మాజీ మంత్రి జగన్‌ వైపుకు వస్తారా?

ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో సైతం పలువురు ఫైర్ బ్రాండ్ నాయకులున్నారు. అధికారం కోల్పోయినా సరే పార్టీకి అండగా ఉంటూ ప్రత్యర్ధులపై విరుచుకుపడే నేతల్లో ఎం‌ఎస్ రాజు ముందు వరుసలో ఉంటారు. దళిత నేతగా ఉన్న రాజు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల ముందు వరకు రాజు గురించి టీడీపీ కార్యకర్తలకే పెద్దగా తెలియదు.

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి పెద్ద‌దిక్కెవ‌రు..?

తెలంగాణ ప్ర‌భుత్వం ప‌డిపోతుంది?

ప్రపంచమంతా అప్పులు చేస్తోంది...మేమొక్కరమేనా?

రైతు బంధు రాలేదా..? ఈ నెంబ‌ర్ కు ఫోన్ చేయండి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>