MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpaa7c670a3-1f4b-4843-bf28-4e91101b4fe7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpaa7c670a3-1f4b-4843-bf28-4e91101b4fe7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల సంస్కృతి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా సినిమా అంటూ భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ లో పెద్ద హీరోలు అందరూ ఈ సినిమాలే చేస్తుండడం విశేషం. ఇది టాలీవుడ్ కి ఎంతో గొప్పగా అనిపించే విషయం. రెండు రాష్ట్రాల స్థాయి ఉన్న సినిమా దేశం మొత్తం విస్తరించేలా ఎదిగింది అంటే టాలీవుడ్ కి ఇది గొప్ప ఘనత అని చెప్పవచ్చు.pushpa{#}prashanth neel;Bahubali;Culture;Prasanth Neel;Tollywood;India;Prabhas;sukumar;Hero;Allu Arjun;Rajamouli;Telugu;Cinemaరెండు భాగాల ట్రెండ్ అన్నిటికీ వర్క్ అవుట్ అయ్యేనా?రెండు భాగాల ట్రెండ్ అన్నిటికీ వర్క్ అవుట్ అయ్యేనా?pushpa{#}prashanth neel;Bahubali;Culture;Prasanth Neel;Tollywood;India;Prabhas;sukumar;Hero;Allu Arjun;Rajamouli;Telugu;CinemaWed, 23 Jun 2021 18:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల సంస్కృతి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా సినిమా అంటూ భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ లో పెద్ద హీరోలు అందరూ ఈ సినిమాలే చేస్తుండడం విశేషం. ఇది టాలీవుడ్ కి ఎంతో గొప్పగా అనిపించే విషయం. రెండు రాష్ట్రాల స్థాయి ఉన్న సినిమా దేశం మొత్తం విస్తరించేలా ఎదిగింది అంటే టాలీవుడ్ కి ఇది గొప్ప ఘనత అని చెప్పవచ్చు.

అయితే ఇక్కడ టాలీవుడ్ వాడుతున్న మంత్రం ఏమిటంటే ఒక సినిమాని ఒక పార్ట్ గా మాత్రమే కాకుండా రెండు పార్టులుగా విడుదల చేయటం. దీంతో రెండు సార్లు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తే చాలు ఆ సినిమా సేఫ్ అయినట్లే. బాహుబలి సినిమా ఈ ట్రెండ్ ను మొదలు పెట్టింది అని చెప్పవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇద్దరినీ పాన్ ఇండియా స్టార్ లు గా మార్చింది. అయితే ఏ ముహూర్తాన బాహుబలి 2 పార్టులుగా విడుదల అయిందో అప్పటినుంచి పాన్ ఇండియా సినిమాలు వచ్చే దాదాపు సినిమాలన్నీ రెండు పార్ట్ లు గా విడుదల అవడం మొదలైంది.

కే జి ఎఫ్ సినిమా మొదటి పార్ట్ విడుదల కాగా ప్రస్తుతం రెండవ పార్ట్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా మొదటి పార్ట్ కూడా ఎంతో ఆసక్తికరంగా ముగియగా, సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ తో అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా చేశారని టాక్ వినిపిస్తోంది. ఇదే కాకుండా ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా కూడా రెండు పార్ట్ లుగా రాబోతుందట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రెండు పార్టులుగా వస్తుందని అంటున్నారు. మొత్తంగా రెండు పార్ట్ ల ట్రెండ్ మాత్రం మెల్లమెల్లగా ఊపందుకుంటుంది. రెండు పార్ట్ లు చేస్తే ఇబ్బంది లేదు కానీ అందరికీ ఆ స్థాయిలో కథ కుదరాలి. అది చూసుకోకుండా కేవలం ట్రెండ్ కోసమే చేస్తే సినిమా ఫ్లాప్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 



టెన్త్ పాస్ అయ్యారా ? అయితే మీకో గుడ్ న్యూస్..

మహేష్ వర్షం చేస్తే.. డిజాస్టర్ ఇచ్చాడని మహేష్ వద్దంటే ప్రభాస్ కెరియర్ సెట్ అయ్యింది..!

'బంగార్రాజు' తో రీఎంట్రీ ఇవ్వనున్న అలనాటి స్టార్ హీరోయిన్..?

మూడు కన్న ఎక్కువ పాత్రల్లో నటించిన హీరోలు వీరే.. !

మహానటితో మహానటిగా కీర్తి గడించిన కీర్తి సురేష్..!

చంద్ర‌ముఖి గా అద‌ర‌గొట్టిన జ్యోతిక సీక్వెల్ లో ఉంటుందా..?

ఒక్క మాటతో ప్రబాస్ 150 కోట్లు వదిలేసారా..?

నాగ చైతన్య లవ్ స్టొరీ కి అంత సీనుందా?

తమ సినిమాలోనే తామే విలన్ గా నటించిన 8 మంది హీరోలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>