PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-bjp-etela-comments-a6da5b08-15a6-4ed9-91e7-a519bff9f765-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-bjp-etela-comments-a6da5b08-15a6-4ed9-91e7-a519bff9f765-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. నేతలు మాటలతోనే యుద్ధం చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. చివరికి గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ, ప్రజల మనసులో ఏముందో తెలుసుకునేందుకు ఒక్కో పార్టీ నాయకుడు ఒక్కో విధంగా తమదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆలోచనలతో గ్రామ గ్రామాన ఇన్చార్జ్ లను పెట్టి ఓటర్ నాడిని తెలుసుకొని సమాచారాన్ని ముఖ్య మంత్రిగారికి చేరవేస్తున్నారు. విజయం మాదంటే మాది అంటూ మాటల యుద్ధం చేస్తున్నారు. మంగళవారం వీణవంక మండలంలో మాజీ మంత్రిPolitical {#}lotus;Eatala Rajendar;Yevaru;war;Party;Elections;Telangana Chief Minister;Minister;politics;Governmentహుజురాబాద్ లో బీజేపీదే విజయం..?హుజురాబాద్ లో బీజేపీదే విజయం..?Political {#}lotus;Eatala Rajendar;Yevaru;war;Party;Elections;Telangana Chief Minister;Minister;politics;GovernmentWed, 23 Jun 2021 13:11:00 GMTహుజురాబాద్ రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. నేతలు మాటలతోనే యుద్ధం చేస్తున్నారనడంలో  ఎటువంటి సందేహం లేదు. చివరికి  గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ, ప్రజల మనసులో ఏముందో తెలుసుకునేందుకు  ఒక్కో పార్టీ నాయకుడు  ఒక్కో విధంగా తమదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆలోచనలతో గ్రామ గ్రామాన  ఇన్చార్జ్ లను పెట్టి ఓటర్ నాడిని తెలుసుకొని  సమాచారాన్ని ముఖ్య మంత్రిగారికి చేరవేస్తున్నారు. విజయం మాదంటే మాది అంటూ మాటల యుద్ధం చేస్తున్నారు.

మంగళవారం వీణవంక మండలంలో మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  మేము ఎవరి జోలికి వెళ్లం. 20 ఏళ్లలో  నియోజకవర్గంలో  ఎలాంటి గొడవలకు  తావు ఇవ్వలేదని అన్నారు.  మీకు దమ్ముంటే  మీ సిద్ధాంతం చెప్పుకొండని, ఘర్షణలకు పాల్పపడతామంటే   సహించేది లేదన్నారు.  ఎన్నికలంటే ఎవరు ఏ ఏ పనులు చేశారో చెప్పుకోవాలని  మండిపడ్డారు. ఈ నియోజకవర్గంలో  డబ్బులు, మద్యంతో ఎప్పుడు ఎన్నికలు జరగలేదన్నారు. ఈసారి కూడా అలానే జరగాలని ప్రజలకు పిలుపునిచ్చారు . మీకు గెలిచే దమ్ముంటే  ప్రజలను ప్రలోభాలకు గురి చేయొద్దని, కుల సంఘాలకు లక్షలు రూపాయలు ఇవ్వడం ఎందుకని అన్నారు. నాయకులను కొనుక్కొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.  వీణవంక మండలంలో  90 శాతం ఓట్లు  కమలం గుర్తుకే వస్తాయని, కొంతమంది నాయకులు పోయినంత మాత్రాన ఏం కాదన్నారు.

హుజురాబాద్ లో ఏం జరుగుతోందని, అటు అమెరికాలో, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదురుచూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నను గెలిపించుకొని, ఆత్మ గౌరవం దక్కించుకోవాలని  కోరుకుంటున్నాను అన్నారు. ఇలా నాయకులంతా ఒకరినొకరు దూషించుకుంటూ తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈటల రాజేందర్ మాత్రం అంతిమ విజయం బీజేపీదే అని గట్టిగా చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుల ముందు ఈటల చిత్తవుతారా, విజయతీరాలకు వెళ్తారా అనేది వేచి చూడాల్సిందే.



చిరుని రౌండప్ చేసేశారుగా...!

మెంటల్ మామలా జగన్?

జ‌గ‌న్ తొలి కేబినెట్లో ఎవ‌రికెన్ని మార్కులు...!

కలెక్టర్లతో కేసీఆర్ కీలక సమావేశం!

రైతులు వర్సెస్ కలెక్టర్ ఓ 43 ఎకరాలు...?

తండ్రి అవుతోన్న యంగ్ హీరో

ఫైన‌ల్ నిర్ణ‌యం అదే..ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై మంత్రి.. !

మహిళ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ!

జగన్ ను తిట్టడంపై తగ్గేది లేదంటున్న తెలంగాణా మంత్రి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>