MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sonusood-ila-kuda-comedy-chestara-91016a33-7013-4b5d-bbc1-fa0c22dd8c19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sonusood-ila-kuda-comedy-chestara-91016a33-7013-4b5d-bbc1-fa0c22dd8c19-415x250-IndiaHerald.jpgకరోనా వల్ల దేశం పూర్తిగా అతలాకుతలం అయ్యింది. రాష్ట్రాల మధ్య రాకపోకలు లేక చేతిలో పని లేక చాలామంది వలసకూలీలు అవస్థలు ఎదుర్కొన్నారు. సొంత రాష్ట్రాలకు వెళ్లలేక ప్రాణాలను విడుస్తున్న వారందరికీ నటుడు సోనూ సూద్ ఆపన్నహస్తంగా మారాడు. వారిని ప్రత్యేక పర్మిషన్లు తీసుకొని బస్సులను ఏర్పాటు చేసి సొంత ఊర్లకు సురక్షితంగా చేర్చారు. దీంతో ఆయన రియల్ హీరో అయ్యాడు. అలా అందిరికి సాయాన్ని అందించాలనే దృక్పధంతో ఒక ఛారిటిని మొదలుపెట్టారు. sonusood{#}iPhone;media;Heroసోనూ సూద్ ఇలా కూడా కామెడీ చేస్తారా .. ?సోనూ సూద్ ఇలా కూడా కామెడీ చేస్తారా .. ?sonusood{#}iPhone;media;HeroWed, 23 Jun 2021 09:00:00 GMTకరోనా వల్ల దేశం పూర్తిగా అతలాకుతలం అయ్యింది. రాష్ట్రాల మధ్య రాకపోకలు లేక చేతిలో పని లేక చాలామంది వలసకూలీలు అవస్థలు ఎదుర్కొన్నారు. సొంత రాష్ట్రాలకు వెళ్లలేక ప్రాణాలను విడుస్తున్న వారందరికీ నటుడు సోనూ సూద్ ఆపన్నహస్తంగా మారాడు. వారిని ప్రత్యేక పర్మిషన్లు తీసుకొని బస్సులను ఏర్పాటు చేసి సొంత ఊర్లకు సురక్షితంగా చేర్చారు. దీంతో ఆయన రియల్ హీరో అయ్యాడు. అలా అందిరికి సాయాన్ని అందించాలనే దృక్పధంతో ఒక ఛారిటిని మొదలుపెట్టారు.


సాయం కోరిన వారికి ఎటువంటి సాయమైనా కూడా లేదనకుండా చేసేవాడు. అలా ఆయన సాయాన్ని ఎందరో పొందారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా మారిపోయాడు. కష్టం అంటే చాలు.. సాయం చేయడానికి ఎగబడి వెళ్లిపోయేవాడు.ఇప్పటికి సోషల్ మీడియా ద్వారా ఆయన సాయాన్ని పొందేందుకు జనాలు ఆత్రుత చూపిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆయన ఇంటి వద్దకే వెళ్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ టైంపాస్‌ మెసేజ్‌లు చేస్తున్నారు.


విషయానికొస్తే.. తాజాగా ఓ వ్యక్తి ఫన్నీగా సాయాన్ని అడిగాడు.  నా గర్ల్ ఫ్రెండ్ ఐఫోన్ కొనివ్వాలని నన్ను పదే పదే అడుగుతూ ఇబ్బంది పెడుతుంది మీరు ఏమైనా సాయం చేయగలరా అంటూ సోషల్ మీడియా లో రిక్వెస్ట్ చేశారు. ఆ సాయం అందుతుందో లేదో కానీ నీ దగ్గర ఉన్నది మాత్రం మొత్తం పోతుంది అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. నటుడుగా బిజీగా సోనూ ఎదో తీరిక చేసుకొని ఇలా సాయం చేస్తుంటే ఇలా టైం పాస్ మెసేజ్ లు చేయడమేంటనీ మండిపడుతున్నారు. సోనూ అన్నా అలాంటివాళ్లకు భలే బుద్ది చెప్పారంటూ కొందరు అభినందించారు. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే.. ఆచార్య సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
" style="height: 342px;">