PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/china132f8d87-c0aa-444a-a2d2-6e7547c95470-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/china132f8d87-c0aa-444a-a2d2-6e7547c95470-415x250-IndiaHerald.jpgచైనా గూడచారి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంగ్లాదేశ్ బోర్డర్ లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు పట్టుబడిన చైనా గూడచారికి హైదరాబాద్ తో బలమైన సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో కొన్ని కంపెనీలు కూడా పెట్టి చైనా గూఢచారి హువా టోంగ్ బెహ్తార్ లావాదేవీలు కూడా గడువు నడిపినట్లు గుర్తించారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన పహాడీషరీఫ్ లో విశ్వ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీ కూడా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాదుకు చెందిన నలుగురు కూడా ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు china spy{#}Prashant Kumar;vishwa;Bangladesh;Goodachari;contract;Telangana;Hyderabad;policeచైనా లింక్స్ తో షేక్ అవుతున్న హైదరాబాద్!చైనా లింక్స్ తో షేక్ అవుతున్న హైదరాబాద్!china spy{#}Prashant Kumar;vishwa;Bangladesh;Goodachari;contract;Telangana;Hyderabad;policeWed, 23 Jun 2021 11:14:39 GMTచైనా గూడచారి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంగ్లాదేశ్ బోర్డర్ లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు పట్టుబడిన చైనా గూడచారికి హైదరాబాద్ తో బలమైన సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో కొన్ని కంపెనీలు కూడా పెట్టి చైనా గూఢచారి హువా టోంగ్ బెహ్తార్ లావాదేవీలు కూడా గడువు నడిపినట్లు గుర్తించారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన పహాడీషరీఫ్ లో విశ్వ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీ కూడా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాదుకు చెందిన నలుగురు కూడా ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తిస్తున్నారు.



 ఆ పెట్టుబడులు పెట్టిన రజాక్,నబీ, ముస్తాక్, ప్రశాంత్ కుమార్ ల పాత్ర మీద ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచి అక్రమంగా నిధులు కూడా మళ్ళిస్తున్నట్టు కూడా ఈ వ్యవహారంలో పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 2010లో హైదరాబాద్ కు చైనా గూడచారి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కంపెనీ కాకుండా  గుర్గావ్ లో ఒక హోటల్ కూడా 10 ఏళ్ల పాటు ఆయన లీజుకు తీసుకున్నాడని, నెలకు 15 లక్షల రూపాయల చొప్పున పదేళ్లపాటు ఒప్పందం కూడా జరిగిందని తెలుస్తోంది.



ఇవికాక ముంబైలో మరో రెండు కంపెనీలు కూడా ఆయన రిజిస్టర్ చేయించాడు అని చెబుతున్నారు. ఇక ఆయన చైనా ఇంటెలిజెన్స్ సంస్థలకు పనిచేస్తున్నట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు గుర్తించారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఆయన విశ్వ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ తరఫున ఏమైనా సమాచారాన్ని చైనాకు చేరవేశాడా ? చేస్తే ఎలాంటి సమాచారాన్ని చేరవేశాడు ? అనే అంశాల మీద లోతుగా పరిశీలన జరుపుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ఇప్పటికే అప్రమత్తమై, చైనా గూడచారికి తెలంగాణ ఇంకా ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాలు తెలుసుకునే పనిలో పడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిశాక బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఒక నివేదిక సమర్పించే అవకాశం ఉందని అంటున్నారు.



కోర్టు ముందుకు జ‌గ‌న్‌?

తాడేపల్లి గ్యాంగ్ రేప్ లో మొత్తం ఐదుగురి హ్యాండ్?

కన్న కొడుకును కడతేర్చిన కసాయి తల్లి..!

"మా" ఎన్నిక‌ల్లో సెటిలర్లెవ‌రు? స్థానికులెవ‌రు?

కోమ‌టిరెడ్డికి ఇంత అవ‌మాన‌మా... !

కరీంనగర్ లో 'మిరాకిల్'.. ఆగిన గుండెకు ప్రాణం పోసిన పోలీస్.. !

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు అమృతాంజ‌న్ కావాలి?

ఏకే రీమేక్ పవన్ నిజ జీవితానికి ఇలా రిలేట్ అయ్యిందా!!

మీరు మారిపోయారు కేసీఆర్ సార్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>