PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp8b0f3a50-c7f5-4a53-aa81-4268143ef980-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp8b0f3a50-c7f5-4a53-aa81-4268143ef980-415x250-IndiaHerald.jpgగత ఎన్నికల్లో అన్నీ వర్గాల ప్రజలు జగన్‌కు మద్ధతు ఇవ్వడం వల్లే వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకోగలిగింది. అలాగే చాలా వర్గాలు దూరం అవ్వడం వల్లే టీడీపీకి ఓటమి ఎదురైంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి దూరమైన ఓటు బ్యాంకుని దగ్గర చేసుకోవాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దళిత ఓటు బ్యాంక్ టీడీపీకి చాలా తగ్గింది.tdp{#}Scheduled caste;Scheduled Tribes;Capital;Bank;Letter;Y. S. Rajasekhara Reddy;Jagan;Doctor;YCP;TDP;Government;CBNఆ ఓటు బ్యాంక్ కోసం బాబు తిప్పలు...వర్కౌట్ అవుతుందా..!ఆ ఓటు బ్యాంక్ కోసం బాబు తిప్పలు...వర్కౌట్ అవుతుందా..!tdp{#}Scheduled caste;Scheduled Tribes;Capital;Bank;Letter;Y. S. Rajasekhara Reddy;Jagan;Doctor;YCP;TDP;Government;CBNWed, 23 Jun 2021 17:06:00 GMTగత ఎన్నికల్లో అన్నీ వర్గాల ప్రజలు జగన్‌కు మద్ధతు ఇవ్వడం వల్లే వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకోగలిగింది. అలాగే చాలా వర్గాలు దూరం అవ్వడం వల్లే టీడీపీకి ఓటమి ఎదురైంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి దూరమైన ఓటు బ్యాంకుని దగ్గర చేసుకోవాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దళిత ఓటు బ్యాంక్ టీడీపీకి చాలా తగ్గింది.


గతంలో దళితులు టీడీపీ-కాంగ్రెస్‌లకు సమానంగా మద్ధతుగా ఉండేవారు. అయితే వైఎస్సార్ వచ్చాక పెద్ద సంఖ్యలో ఎస్సీ, ఎస్టీల మద్ధతు కాంగ్రెస్‌కు వచ్చింది. తర్వాత జగన్ ఎంట్రీతో దళితులు వైసీపీకి మద్ధతుగా వచ్చారు. గత ఎన్నికల్లో ఎక్కువగా దళితులు జగన్ వైపుకు వచ్చి వైసీపీని గెలిపించారు. పైగా ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ సీట్లలో టీడీపీ గెలిచింది ఒక్క కొండపిలో మాత్రమే. మిగతా అన్నీ సీట్లలో వైసీపీ గెలిచింది. అలా వైసీపీకి మద్ధతుగా ఉన్న దళితులని తమవైపుకు తిప్పుకునేందుకు చంద్రబాబు బాగా కష్టపడుతున్నారు.


జగన్ ప్రభుత్వం వచ్చాకే దళితులపై దాడులు పెరిగాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వంలో పలు సంఘటనలు జరిగాయి. సీతానగరంలో శిరోముండనం కేసు. చీరాలలో దళితుడిపై దాడి. అలాగే ఎస్సీ వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ విషయం. రాజధాని అమరావతిలో దళితులపై దాడి చేశారని చెప్పి, అదే వర్గానికి చెందిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే పలు ఘటనలు జరిగాయి.


ఇక వాటిని ఆధారంగా చేసుకునే జగన్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీకి చెందిన ఎస్సీ నాయకుడు వర్ల రామయ్య, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్‌కు లేఖ రాశారు. ఏపీలో తరుచుగా దళితులపై దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. గత రెండేళ్లుగా జరుగుతున్న దాడులపై విచారించడానికి ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలని లేఖలో కోరారు. ఈ విధంగా ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ దళితులని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. మరి చూడాలి బాబుకు ఎస్సీ, ఎస్టీల మద్ధతు ఏ మేర వస్తుందో?




దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉంది : భట్టి

రఘురామ జగన్ ను వదలట్లేదుగా...?

జగన్ గురించి నో కామెంట్స్..వైఎస్ ను అంటే ఊరుకోం!

కుంటి గుర్రం పళ్ళు తోమారా ?

అమ‌రావ‌తిః మహిళ‌ల భ‌ద్ర‌త‌పై సీఎం జ‌గ‌న్ అత్యున్న‌స్థాయి స‌మీక్ష‌. మ‌హిళా భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశం. దిశ యాప్‌పై పూర్తి చైత‌న్యం క‌లిగించాలి. ఇంటింటికి వెళ్లి మ‌హిళ‌ల ఫోన్ల‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసేలా చూడాలి-వైఎస్ జ‌గ‌న్‌. \

జగన్ కు ఏపీ హైకోర్ట్ షాక్...?

గత ఎన్నికల్లో అన్నీ వర్గాల ప్రజలు జగన్‌కు మద్ధతు ఇవ్వడం వల్లే వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకోగలిగింది. అలాగే చాలా వర్గాలు దూరం అవ్వడం వల్లే టీడీపీకి ఓటమి ఎదురైంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి దూరమైన ఓటు బ్యాంకుని దగ్గర చేసుకోవాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దళిత ఓటు బ్యాంక్ టీడీపీకి చాలా తగ్గింది.

కాషాయానికి కొందరు ఎరుపు కి ఇంకొందరు..పీపుల్ స్టార్ పై గోగినేని ఫైర్.. !

జ‌గ‌న్ నిబ‌ద్ధ‌త‌కు అగ్ని ప‌రీక్షే.. క‌రోనా మ‌ర‌ణాలు దాచారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>