PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/delta-plus-1d14471f-c04e-4627-8632-f91ff3d188df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/delta-plus-1d14471f-c04e-4627-8632-f91ff3d188df-415x250-IndiaHerald.jpgగత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగక ఆ మహమ్మారి నుండి కొంత ఉపశనం పొందారు. ఇక కరోనా వైరస్ యొక్క డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. డెల్టా వేరియంట్ కరోనా వైరస్‌ను ఎక్కువగా వ్యాప్తి చేయడానికి దోహదపడుతుంది.Delta Plus{#}India;Government;Coronavirus;central government;Indianదేశంలో పెరుగుతున్న డెల్టా ప్లస్ కేసులు..!!దేశంలో పెరుగుతున్న డెల్టా ప్లస్ కేసులు..!!Delta Plus{#}India;Government;Coronavirus;central government;IndianWed, 23 Jun 2021 11:36:00 GMTకరోనా వైరస్ విజృంభణ కొనసాగిస్తూనే ఉంది. ఇక మహమ్మారి నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కొంత ఉపశనం పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ యొక్క డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. డెల్టా వేరియంట్ కరోనా వైరస్‌ను ఎక్కువగా వ్యాప్తి చేయడానికి దోహదపడుతుంది. డెల్టా వేరియంట్ అంటే.. వాహకం టైప్.. వైరస్ ను ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తింపజేసే కారకం. తాజాగా కరోనా వైరస్‌కు సంబంధించిన డెల్టా వేరియంట్ ఇండియాలో కూడా నమోదైంది.

ఇక దేశంలో 40 కేసులు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఇండియాలో 3 రాష్ట్రాల్లో అధికంగా నమోదైనట్లు చెప్పారు. దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళలో డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అయితే వేరియంట్ కేసులు ఈ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదని వర్గాలు చెబుతున్నాయి. ఇక కేసుల వివరాలకు వెళ్తే.. మహారాష్ట్రలో 21, మధ్యప్రదేశ్‌లో ఆరు, కేరళలో మూడు, తమిళనాడులో మూడు, కర్ణాటకలో రెండు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూలో ఒక్కొక్కటి కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా, లాక్ డౌన్ కారణంగా డెల్టా ప్లస్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదైయ్యాయి. ఇక ఇప్పటివరకు దేశంలో ఏఏ ప్రాంతాల్లో డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి చూద్దామా. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో డెల్టా ప్లస్ కేసులు కనుగొనబడ్డాయి. పాలక్కాడ్, కేరళలోని పతనమిట్ట, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, శివపురిలో డెల్టా ప్లస్ కేసులు కనుగొన్నారు.

ఇక ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్ కన్సార్టియా ప్రకారం.. డెల్టా ప్లస్ వచ్చిన వారిలో ఊపిరితిత్తుల కణాల గ్రాహకాలకు బలమైన బంధం, మోనోక్లోనల్ యాంటీబాడీ ప్రతిస్పందనను తగ్గిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక డెల్టా ప్లస్‌కు వ్యతిరేకంగా ప్రస్తుత టీకాలు ప్రభావవంతంగా ఉంటాయా అనే దానిపై ఆందోళనలు నెలకొంటున్నాయి.

అయితే దేశంలో వాడుతున్న రెండు వ్యాక్సిన్లు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క కోవిషీల్డ్ భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉన్నాయి. డెల్టా ప్లస్‌ కేసులపై వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయనే దానిపై డేటా తీసుకోని తరువాత తెలియజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.


మహిళ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ!

దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు..?

ఎన్టీఆర్‌-కొర‌టాల మూవీలో హీరోయిన్ ఎవరంటే...?

ఆనాటి మేటి వంట పచ్చిపులుసు అంట.. !!

సేవకు రియల్ మీనింగ్ సోనూ సూద్!

ప్రతిభకు తోడుగా "విద్యాలక్ష్మి"

గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగక ఆ మహమ్మారి నుండి కొంత ఉపశనం పొందారు. ఇక కరోనా వైరస్ యొక్క డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. డెల్టా వేరియంట్ కరోనా వైరస్‌ను ఎక్కువగా వ్యాప్తి చేయడానికి దోహదపడుతుంది.

ఇకపై అందరికీ చేరువలో ఉంటానంటున్న అనుష్క..

తొలి సినిమాతోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అవడం అందుకే చెల్లింది..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>