MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maa66e23632-4b49-42da-beb0-59325ea718ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maa66e23632-4b49-42da-beb0-59325ea718ad-415x250-IndiaHerald.jpgఇక ప్రస్తుతం జరుగుతున్న "మా" ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కి సపోర్ట్ చేయనని చెప్పారు సినీ నటి, మా మెంబర్ కరాటే కళ్యాణి. ఇక త్వరలో జరగనున్న 'మా' ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ పోటీలో వున్న ఆయనకి ఓటు వేసే ప్రసక్తే లేదని చెప్పారు కళ్యాణి. ఇక ఈ నేపథ్యంలో స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకుని వస్తూ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి.ఇక కల్యాణి మాట్లాడుతూ.. తమిళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ ల్లో తెలుగు వాళ్లకి అవకాశం ఇవ్వనప్పుడు ఇక మా ఎన్నికల్లో ఇతర ఇండస్ట్రీకి చెందిన వాళ్లmaa{#}jayasudha;K A Paul;udhayanidhi stalin;Stalin;Prakash Raj;Sharmila;raj;Jagan;Tamil;Chiranjeevi;Telugu;Manam;KCR;Yevaru;Kannada'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై కామెంట్స్ చేస్తూ సెగ పెడుతున్న కరాటే కల్యాణి...'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై కామెంట్స్ చేస్తూ సెగ పెడుతున్న కరాటే కల్యాణి...maa{#}jayasudha;K A Paul;udhayanidhi stalin;Stalin;Prakash Raj;Sharmila;raj;Jagan;Tamil;Chiranjeevi;Telugu;Manam;KCR;Yevaru;KannadaWed, 23 Jun 2021 20:46:51 GMTఇక ప్రస్తుతం జరుగుతున్న "మా" ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కి సపోర్ట్ చేయనని చెప్పారు సినీ నటి, మా మెంబర్ కరాటే కళ్యాణి. ఇక త్వరలో జరగనున్న 'మా' ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ పోటీలో వున్న ఆయనకి ఓటు వేసే ప్రసక్తే లేదని చెప్పారు కళ్యాణి. ఇక ఈ నేపథ్యంలో స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకుని వస్తూ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి.

ఇక కల్యాణి మాట్లాడుతూ.. తమిళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ ల్లో తెలుగు వాళ్లకి అవకాశం ఇవ్వనప్పుడు ఇక మా ఎన్నికల్లో ఇతర ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎందుకు పోటీ చేస్తారు. ప్రకాష్ రాజ్ మంచి విలక్షణ నటుడు ఇంకా తెలుగు వాళ్లకి బాగా దగ్గరైన వ్యక్తి అలాగే తన వంతు సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటారు.అందుకు ఒక మంచి ఆర్టిస్ట్‌గా ఆయన్ని ఆదరిస్తాం.అయితే ఇక ఆయన మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు సపోర్ట్ కేవలం ఆయనకే కాదు అందరికీ ఉంటుందని నేను అనుకుంటున్నా.ఇక బాగా పరిపాలిస్తున్నారు కదా అని స్టాలిన్ ని తీసుకుని వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని చేయలేం కదా. ఇక్కడ ఇక జగన్ ఉన్నారు..అలాగే కేసీఆర్ ఉన్నారు.. ఇంకా కేఏ పాల్ ఉన్నారు.. ఇక షర్మిల ఇలా చాలామందే ఉన్నారు.ఇక స్టాలిన్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే ఒప్పుకోం. ఎందుకంటే ఇక తమిళ, కన్నడ ఇండస్ట్రీవాళ్లు కనీసం మనకు వేషాలే ఇవ్వకుండా చేస్తుంటే ఇక వాళ్లని తీసుకుని వచ్చి మరి ఇక్కడ అధ్యక్షుల్ని ఎలా చేస్తాం.ఇక ఇదే అసోసియేషన్స్‌లో తమిళ నడిగార్ సంఘంలో మనం నిజంగా పోటీ చేయగలమా? అసలు ఖచ్చితంగా చేయలేము.

ఇక అలాంటప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి తెలుగులో నేను పోటీ చేస్తా అంటే ఇక్కడ ఉన్నవాళ్లు ఏమవ్వాలి? ఇక తెలుగులో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు కదా.. కాబట్టి ఎవరైనా పోటీ చేసే రైట్ ఉంది. ఇక మా కార్డ్ ఉన్న వాళ్లు ఎవరైనా ఇక్కడ పోటీ చేయొచ్చు. ఇక ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి పోటీ చేస్తా అనే వాదనను నేను పూర్తిగా ఖండిస్తున్నా.ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ పోటీ చేయాలంటే మమ్మల్ని అక్కడ పోటీకి ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇక మెంబర్‌గా పోటీ చేయడం అనేది అది ఆయన ఇష్టం.. అంతేగానీ సపోర్ట్ ఎవరు ఇస్తారన్నది మాత్రం డౌటే. ఇక నేనైతే సపోర్ట్ చేయను. ఇక ఆయనైతే తన కో ఆర్టిస్ట్‌లతో సరిగ్గా మాట్లాడరు. ఇక దానికి నేనే పెద్ద ఉదాహరణ.ప్రకాష్ రాజ్ అదోరకంగా మాట్లాడుతుంటారు.

ఇక ఇలాంటి వ్యక్తి అధ్యక్షులు అయితే ఏదో సూపర్‌గా ఉంటుందని నేను అస్సలు అనుకోవడం లేదు. అందుకే ప్రకాష్ రాజ్‌ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఇక ఒక మంచి ఆర్టిస్ట్‌గా ఆయన్ని నెత్తిమీద పెట్టుకుంటాం.. ఇంకా అవార్డులు ఇస్తాం.. అలాగే అన్నీ చేస్తాం కానీ.. ఇక అధ్యక్ష పదవికి అయితే మేం అసలు ఒప్పుకోము. ఇక తెలుగు వాళ్లు అలాగే తెలుగు హీరోలు ఇంకా ఇతర పెద్దలు మా అధ్యక్షులు అవ్వాలనేది నా అభిప్రాయం. ఇక మంచు విష్ణు, జీవితా, జయసుధ ఇలా ఎవరైనా సరే పోటీ చేస్తే వీరిలో ఎవరైనా గెలవొచ్చు. ఇక నేనైతే మన తెలుగు వాళ్లకే సపోర్ట్ చేస్తా ఇంకా ఓటు వేస్తా..ఇక ప్రకాష్ రాజ్‌కి అయితే ఓటు వేసే ప్రసక్తే లేదు’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు కరాటే కళ్యాణి.



వి. వి.వినాయక్ రోల్ ఏంటో తెలిసింది.. ఆ డైలాగ్ కు రచ్చ రచ్చే..!!

విజయం మీదే: లైఫ్ లో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందా ?

సీఎం నుంచి చిరుకూ థాంక్స్.

రాఖీ భాయ్ దూసుకొచ్చేది అప్పుడే...

ఆయన్ని తెలుగు కమల్ అనేవారు.. కెరీర్ మాత్రం... ?

విన్న‌ర్స్ వాయిస్ : ద ఎన‌ద‌ర్ సైడ్ ఆఫ్ ద బాస్

కేసీఆర్‌పై బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... ఏమ‌న్నారంటే...?

సుప్రీంకోర్టు ఆదేశం.. అఫడవిట్ సిద్ధం చేసిన జగన్?

ఈ భ‌జ‌న బృంధం బాబుని బ‌ధ్నాం చేస్తుందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>