MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/love-story5eb5fbfb-972a-48c4-9bf8-daad93b792e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/love-story5eb5fbfb-972a-48c4-9bf8-daad93b792e5-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ఒక్క పాట తో ఈ సినిమా తెలుగు సినీ ప్రేక్షకులను అందరినీ తనవైపు తిప్పుకుంది. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్ లను సృష్టిస్తూనే ఉంది. క్రేజ్ బాగా ఏర్పడిన ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. శేఖర్ కమ్ముల ఫిదా సినిమా తర్వాత చాలా రోజుల తర్వాత చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, నాగచైతన్య కూడా గత కొన్ని సినిమాలతో ఫ్లాప్ లు అందుకోవడంతో ఆయన ఎంతో ఇష్టంతో చేlove story{#}Naga Chaitanya;you tube;Love Story;Fidaa;Sai Pallavi;Success;cinema theater;Audience;Tollywood;sekhar;Chitram;Cinemaనాగ చైతన్య లవ్ స్టొరీ కి అంత సీనుందా?నాగ చైతన్య లవ్ స్టొరీ కి అంత సీనుందా?love story{#}Naga Chaitanya;you tube;Love Story;Fidaa;Sai Pallavi;Success;cinema theater;Audience;Tollywood;sekhar;Chitram;CinemaWed, 23 Jun 2021 17:00:00 GMTఅక్కినేని నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ.  ఒక్క పాట తో ఈ సినిమా తెలుగు సినీ ప్రేక్షకులను అందరినీ తనవైపు తిప్పుకుంది. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్ లను సృష్టిస్తూనే ఉంది. క్రేజ్ బాగా ఏర్పడిన ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. శేఖర్ కమ్ముల ఫిదా సినిమా తర్వాత చాలా రోజుల తర్వాత చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, నాగచైతన్య కూడా గత కొన్ని సినిమాలతో ఫ్లాప్ లు అందుకోవడంతో ఆయన ఎంతో ఇష్టంతో చేసిన ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు అక్కినేని అభిమానులు.

అయితే ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్య మళ్లీ ఫామ్  లోకి రావడం ఖాయమని అంటున్నారు అభిమానులు. సాయి పల్లవి గోల్డెన్ లెగ్ కావడంతో ఆమె తప్పకుండా నాగచైతన్యకు అదృష్టాన్ని తీసుకువస్తుంది అన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సాయిపల్లవి వరుస సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూన్న నేపథ్యంలో వారు ఈ రకమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు . అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు విడుదల అవకుండా ఉంటూ సినీ జనాలు లో ఆసక్తిని తగ్గించేలా చేస్తుంది.

కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం లాక్ డౌన్ కాంక్షలు అన్ని తొలగిపోగా థియేటర్లలో రావడానికి ముందుగా రెడీగా ఉన్న సినిమా లవ్ స్టోరీ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం లో లవ్ స్టోరీ సినిమా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ పెద్దలు. ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడడానికి మొగ్గు చూపుతారని అంటున్నారు. మొదటి నుంచి ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయాలని డిజిటల్ రిలీజ్ కోసం ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా కాదని వెయిట్ చేశారు. ఇప్పుడు థియేటర్ లో ఓపెన్ అవ్వడం తో, టాలీవుడ్ నుంచి వచ్చే మొదటి సినిమా లవ్ స్టోరీ అవడంతో, ఈ సినిమాపై పాజిటివ్ ఉండడంతో తప్పకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందని అంటున్నారు. మరి లవ్ స్టోరీ సినిమా వారి అంచనాలను ఏమేరకు అందుకుంటుందో చూద్దాం.



రెండు భాగాల ట్రెండ్ అన్నిటికీ వర్క్ అవుట్ అయ్యేనా?

మహేష్ వర్షం చేస్తే.. డిజాస్టర్ ఇచ్చాడని మహేష్ వద్దంటే ప్రభాస్ కెరియర్ సెట్ అయ్యింది..!

'బంగార్రాజు' తో రీఎంట్రీ ఇవ్వనున్న అలనాటి స్టార్ హీరోయిన్..?

మూడు కన్న ఎక్కువ పాత్రల్లో నటించిన హీరోలు వీరే.. !

మహానటితో మహానటిగా కీర్తి గడించిన కీర్తి సురేష్..!

చంద్ర‌ముఖి గా అద‌ర‌గొట్టిన జ్యోతిక సీక్వెల్ లో ఉంటుందా..?

ఒక్క మాటతో ప్రబాస్ 150 కోట్లు వదిలేసారా..?

తమ సినిమాలోనే తామే విలన్ గా నటించిన 8 మంది హీరోలు..

ప్రభాస్ పౌర్ణమి ఆ ఒక్కటి మారిస్తే హిట్ అయ్యేది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>