WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijaaym-meedhee72ef95f-7081-4423-97dd-dcac19a0ce1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijaaym-meedhee72ef95f-7081-4423-97dd-dcac19a0ce1d-415x250-IndiaHerald.jpgజీవితమనే ప్రయాణంలో ప్రతి మనిషి కొన్ని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. కానీ చాలా మంది ఇటువంటి సమయాలలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక తెగ హైరానా పడుతుంటారు. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూషన్ లో ఉంటారు.VIJAAYM MEEDHE{#}Manamవిజయం మీదే: లైఫ్ లో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందా ?విజయం మీదే: లైఫ్ లో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందా ?VIJAAYM MEEDHE{#}ManamWed, 23 Jun 2021 21:00:00 GMTజీవితమనే ప్రయాణంలో ప్రతి మనిషి కొన్ని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. కానీ చాలా మంది ఇటువంటి సమయాలలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక తెగ హైరానా పడుతుంటారు. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూషన్ లో ఉంటారు. కానీ అలాంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకో లేకపోతే అవి మన లైఫ్ లో సమస్యగా మారే అవకాశం ఉంది. కొన్నిసార్లు మన అందమైన భవిష్యత్తును దూరం చేసే అవకాశం కూడా ఉంది. అంటే మనకు రావాల్సిన ఛాన్సులు మిస్ అవ్వచ్చు. ఇటువంటి సందర్భంలో సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే ముందుగా మీరు మీ మనసును స్థిరంగా ఉంచుకోవాలి.

నిర్ణయం తీసుకోవాల్సిన అంశం గురించి ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత జరగబోయే పరిణామాల గురించి అంచనా వేయగలగాలి. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయం మీకు నష్టం కలిగించేలా అస్సలు ఉండకూడదు. మనం తీసుకొనే ప్రతి నిర్ణయం మనకు ఉపయోగపడేలా ఉండాలి. అదే విధంగా ఇతరులకు హాని కలిగించేలా ఉండకూడదు. ఇలా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీ ఉన్నత చదువుల కోసం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏ కోర్స్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు. మీరు ఆలోచించాల్సిన విషయం మీరు ఎందులో అయితే నిష్ణాతులు అయి ఉంటారో, ఏ సబ్జెక్ట్ లో  అయితే మీకు ప్రావీణ్యం ఉంటుందో ముఖ్యంగా ఎందులో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎంచుకోవడం మంచిది.

ఇలా ప్రతి విషయాన్ని పలు కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్ని విషయాలలో మరియు అన్ని సందర్భాలలోనూ మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పలేము. కాబట్టి మీకు క్లిష్టంగా అనిపించినా సమయంలో మీ మేలు కోరే వారినో, మీ కుటుంబ సభ్యులనో అడిగి వారి అభిప్రాయం తెలుసుకోవడం మంచిది.





సీఎం నుంచి చిరుకూ థాంక్స్.

'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై కామెంట్స్ చేస్తూ సెగ పెడుతున్న కరాటే కల్యాణి...

బ్రతుకు కు సరికొత్త భాష్యాన్ని నేర్పిన వ్యక్తి, మహోన్నత శక్తి 'కెజివి సంస్థల' అధినేత ''కోటి సరిపల్లి''.......!!

బాలీవుడ్ లో పాగా వేస్తున్న సౌత్ హీరోలు..రికార్డ్స్ మోత

కరోనా థర్డ్ వేవ్: తీసుకోవలసిన జాగ్రత్తలివే ... ?

మనీ : ఇందులో చేరితే నెలకు రూ.10 వేలు..

పాన్ కార్డు గురించి మీకు తెలియని 5 విషయాలు..!

క్రైమ్ : ఇకనైనా వరకట్న వేధింపులు ఆగేనా..

20 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీ మంజునాథ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>