PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-examsf524e7a0-385d-4bdb-8e8e-2d0812fe4dae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-examsf524e7a0-385d-4bdb-8e8e-2d0812fe4dae-415x250-IndiaHerald.jpgఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేయించి ప్రభుత్వంపై పైచేయి నిరూపించుకోవాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. ఏపీ హైకోర్టులో కేసులు వేయడంతో గతంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. పరిస్థితులన్నీ అనుకూలించిన తర్వాత టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే ప్రస్తుతం వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పబ్లిక్ పరీక్షల్ని రద్దు చేసిన క్రమంలో, కేరళ, ఏపీ మాత్రమే వాయిదాలతో సరిపెట్టడంపై సుప్రీం కాస్త ఘాటుగానే స్పందించింది. కష్టకాలంలో పap exams{#}Jagan;Andhra Pradesh;students;court;Government;Parents;Ministerజగన్ ప్రభుత్వం పరీక్షల గండం గట్టెక్కేనా..?జగన్ ప్రభుత్వం పరీక్షల గండం గట్టెక్కేనా..?ap exams{#}Jagan;Andhra Pradesh;students;court;Government;Parents;MinisterWed, 23 Jun 2021 08:10:00 GMTఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేయించి ప్రభుత్వంపై పైచేయి నిరూపించుకోవాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. ఏపీ హైకోర్టులో కేసులు వేయడంతో గతంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. పరిస్థితులన్నీ అనుకూలించిన తర్వాత టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే ప్రస్తుతం వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పబ్లిక్ పరీక్షల్ని రద్దు చేసిన క్రమంలో, కేరళ, ఏపీ మాత్రమే వాయిదాలతో సరిపెట్టడంపై సుప్రీం కాస్త ఘాటుగానే స్పందించింది. కష్టకాలంలో పరీక్షలు పెడితే, ప్రతి విద్యార్థి ప్రాణానికీ ప్రభుత్వానిదే జవాబుదారీ అని చెప్పింది.

విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు పెట్టడానికి సిద్ధమయ్యామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం, వారి ఆరోగ్యంపై కూడా తమకు శ్రద్ధ ఉందని చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం పరీక్షల్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా పూర్తిగా డైలమాలో పడ్డారు. అసలు పరీక్షలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రిపరేషన్ మొత్తం అటకెక్కింది. దీంతో ఏపీ సర్కారు కూడా పరీక్షలపై ముందుకెళ్లాలా లేదా అని ఆలోచిస్తోంది.

పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తామని చెబుతున్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. పరీక్షలపై ముందుకెళ్లండి కానీ విద్యార్థుల ప్రాణాలు జాగ్రత్త అనే సుప్రీంకోర్టు కండిషన్ విధిస్తే, జగన్ సర్కారు ఏం చేస్తుందో చూడాలి. విద్యార్థులకు ఎలాంటి హాని కలగకుండా.. ఒక్కరికి కూడా అస్వస్థత లేకుండా అన్ని పరీక్షలు నిర్వహించగలిగితే.. జగన్ కి అది ప్లస్ పాయింట్ గా మారుతుంది. మొండిగా ముందుకెళ్లినా, విద్యార్థులకు న్యాయం చేసినవారవుతారు. అదే సమయంలో ఏపీలో కేసుల సంఖ్య పెరిగి, విద్యార్థులు, తల్లిదండ్రులు కొత్తగా కరోనాబారిన పడితే మాత్రం దానికి కూడా కారణం జగనే అవుతారు. అందుకే ఆచితూచి స్పందించాలనుకుంటోంది జగన్ సర్కారు. మరోవైపు ప్రతిపక్షాలు, కోర్టు తీర్పుతో జగన్ పై ఒత్తిడి పెరిగిందని అంచనా వేస్తున్నాయి.

ఓవైపు తెలంగాణలో స్కూల్స్ మొదలవుతున్నాయి. గతంలో అన్ని పరీక్షలు రద్దు చేసి, ఆల్ పాస్ అనేయడంతో అక్కడ కొత్తగా విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టడానికి అవకాశం దొరికింది. అయితే ఏపీలో మాత్రం ఇంకా టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తి కాకపోవడంతో విద్యాసంవత్సరం మొదలు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.



రూల్స్ కామన్ మ్యాన్ కేనా.. కేసీఆర్ కి కాదా?

వెంకయ్య కన్నీరు పెట్టుకున్న ఘటన.. ?

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి.. ఎవరికి తెలియని 7 నిజాలు?

విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు పెట్టడానికి సిద్ధమయ్యామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం, వారి ఆరోగ్యంపై కూడా తమకు శ్రద్ధ ఉందని చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం పరీక్షల్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా పూర్తిగా డైలమాలో పడ్డారు. అసలు పరీక్షలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రిపరేషన్ మొత్తం అటకెక్కింది. దీంతో ఏపీ సర్కారు కూడా పరీక్షలపై ముందుకెళ్లాలా లేదా అని ఆలోచిస్తోంది.

వ్యాక్సినేషన్ లో ఈ రాష్ట్రం సౌత్ ఇండియాలోనే టాప్.. !

తెలంగాణ‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని మంత్రికి చెక్‌... క‌విత ఎఫెక్ట్ అబ్బా ?

ముగ్గురు పిల్లల మిస్సింగ్ ఘటనలో విషాదం.. !

కట్నం కోసం వేధిస్తున్నారా.. అయితే ఇలా చేయండి.. !

జూన్ 23వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>