PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజుకో లేఖ రాస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల నిర్వహణ గురించి ఆయన లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల, కార్యదర్శులతో చర్చించిన తర్వాత 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రద్దు చేస్తూ జూన్ 1వ తేదీన నిర్ణయం తీసుకున్నారని లేఖలో ఆయన ప్రస్తావించారు. కోవిడ్ 19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాని బారి నుంచి పిల్లలను కాపాడేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారని లేఖలోraghurama krishna raju{#}Bari;Prime Minister;Letter;June;king;MP;Telangana Chief Minister;Andhra Pradesh;students;Government;Coronavirus;Narendra Modi;Ministerరేపటి దాకా వద్దు.. ఇవాలే ఫైనల్ చేయండి!రేపటి దాకా వద్దు.. ఇవాలే ఫైనల్ చేయండి!raghurama krishna raju{#}Bari;Prime Minister;Letter;June;king;MP;Telangana Chief Minister;Andhra Pradesh;students;Government;Coronavirus;Narendra Modi;MinisterWed, 23 Jun 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజుకో లేఖ  రాస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల నిర్వహణ గురించి ఆయన లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల, కార్యదర్శులతో చర్చించిన తర్వాత 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రద్దు చేస్తూ జూన్ 1వ తేదీన నిర్ణయం తీసుకున్నారని లేఖలో ఆయన ప్రస్తావించారు. కోవిడ్ 19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాని బారి నుంచి పిల్లలను కాపాడేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారని లేఖలో రాజు వివరించారు. 



మోడీ సీబీఎస్ఈ బోర్డుకు సంబంధించిన నిర్ణయం తీసుకోగానే అన్ని రాష్ట్రాలూ 2021 సంవత్సరానికి గాను వారి వారి బోర్డు పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని విధంగా స్థిర నిర్ణయం తీసుకోగా ఈ పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉందని వివరించారు. అయితే నిన్న సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చిన సందర్భంగా తుది నిర్ణయం తీసుకుని జూన్ 24 లోపు తమకు వెల్లడించాలని ఆదేశించిందని అన్నారు. 



అయితే రాష్ట్రంలోని విద్యార్ధులను మానసిక వత్తిడికి గురి చేయకుండా తక్షణ నిర్ణయం తీసుకుని ఈరోజే ఆ నిర్ణయాన్ని సుప్రీం కోర్టుకు తెలియచేస్తే విద్యార్థులు కూడా టెన్షన్ లేకుండా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష రాసేందుకు భౌతికంగా హాజరు కాబోతున్న 5 లక్షల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నుంచి రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నదనేది మిలియన్ డాలర్ ప్రశ్న గానే మిగిలిపోయిందని రాజు లేఖలో పేర్కొన్నారు. ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్ధులు కరోనా బారిన పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటారో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.




గుడ్ న్యూస్ : ఇక ఆధార్ సేవలు గ్రామ సచివాలయంలోనే?

ఏకే రీమేక్ పవన్ నిజ జీవితానికి ఇలా రిలేట్ అయ్యిందా!!

హార్ట్ డ్రగ్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం..?

మీరు మారిపోయారు కేసీఆర్ సార్..

లెక్కల మాస్టారు గా నానీ...?

అందరిలోనూ క్రేజ్ ను కలిగిస్తున్న కీర్తి సురేష్ సూర్యదేవ ఆరాధన !

స్కూల్స్ ఓపెన్ చెయ్యొద్దు : నీతి అయోగ్

టార్గెట్ బుల్లితెరే.. ఫార్మెట్ మార్చుకున్న దర్శకులు..!

వూహన్ సైంటిస్టులకు నోబెల్ బహుమతి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>