MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamopulid84d44cc-5e27-4114-b842-21698bc52749-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamopulid84d44cc-5e27-4114-b842-21698bc52749-415x250-IndiaHerald.jpgఅజాత శతృవుగా రాజమౌళి ని పరిగణిస్తూ ఉంటారు. ఎవరితోనూ ఎటువంటి వివాదాలకు పోకుండా చాలా తెలివిగా జక్కన్న తన కెరియర్ రూపుదిద్దు కున్నాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు ఎనలేని ఖ్యాతిని రాజమౌళి తీసుకు వచ్చాడు. రాజమౌళి సినిమాలలో అడుగడుగునా భారీతనం కనిపిస్తుంది.అయితే సినిమాలకు సంబంధించి క్రియేటివిటీలో మాత్రం రాజమౌళి కంటే సుకుమార్ విమర్శకులు ఎక్కువ మార్కులు వేస్తూ ఉంటారు. తెలుగు సినిమాలలో హీరో మూస ధోరణిలో పడి కొట్టుకు పోతుండగా రివర్స్ లో ఎదురు తిప్పాడు సుకుమార్rajamopuli{#}Rajamouli;sukumar;Jr NTR;Hero;Telugu;Allu Arjun;Director;Cinemaరాజమౌళి సుకుమార్ ల శతృత్వంలో మిత్రత్వం !రాజమౌళి సుకుమార్ ల శతృత్వంలో మిత్రత్వం !rajamopuli{#}Rajamouli;sukumar;Jr NTR;Hero;Telugu;Allu Arjun;Director;CinemaWed, 23 Jun 2021 10:00:00 GMTఅజాత శతృవుగా రాజమౌళి ని పరిగణిస్తూ ఉంటారు. ఎవరితోనూ ఎటువంటి వివాదాలకు పోకుండా చాలా తెలివిగా జక్కన్న తన కెరియర్ రూపుదిద్దు కున్నాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు ఎనలేని ఖ్యాతిని రాజమౌళి తీసుకు వచ్చాడు. రాజమౌళి సినిమాలలో అడుగడుగునా భారీతనం కనిపిస్తుంది.

అయితే సినిమాలకు సంబంధించి క్రియేటివిటీలో మాత్రం రాజమౌళి కంటే సుకుమార్ విమర్శకులు ఎక్కువ మార్కులు వేస్తూ ఉంటారు. తెలుగు సినిమాలలో హీరో మూస ధోరణిలో పడి కొట్టుకు పోతుండగా రివర్స్ లో ఎదురు తిప్పాడు సుకుమార్. ఒక విధంగా అల్లు అర్జున్ ను స్టార్ ను చేసిన సినిమా ఇచ్చిన ఘనత సుకుమార్ కు దక్కుతుంది. అప్పట్లో ఆ సినిమా చూసి చాల మంది దర్శకులు సుకుమార్ ను చూసి జెలసీ ఫీల్ అయ్యేవారట.

దీనికి కారణం అప్పటికి ఇంకా రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదగలేదు. అప్పటికి కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసాడు. జూనియర్ ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘సింహాద్రి’ సినిమాలు చేశాడు. అలాంటి సమయంలో ‘ఆర్య’ తో దర్శకులకు ఊహించని షాక్ ఇచ్చాడు. అప్పట్లో ఆ సినిమా చూసిన తర్వాత రాజమౌళి మనసులో ‘వీడెవడో మనకు పోటీ వచ్చేశాడు అంటూ జలసీ ఫీల్ అయ్యాడట. ఈ విషయాన్ని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పాడు.

అయితే ఆతరువాత రాజమౌళికి జ్ఞానోదయం అయిందట. సుకుమార్ ను శత్రువుగా చూస్తే నిరంతరం కోపగించుకోవడం మినహా మరే ప్రయోజనం ఉండడు అని గ్రహించి అప్పటి నుంచి సుకుమార్ ను స్నేహితుడుగా భావించాడట. దీనితో రాజమౌళి మనసుకు ప్రశాంతత వచ్చి ఆతరువాత తాను తీసే సినిమాల స్థాయిని పెంచుకోవడమే కాకుండా తాను వ్యక్తిగతంగా జాతీయ స్థాయి దర్శకుడుగా ఎదగడానికి ఆ ఆలోచన ఎంతగానో సహకరించింది అంటు జక్కన్న తన మాటలలో తెలియచేసిన ఈ సక్సస్ సూత్ర అందరికి ఎంతగానో ఉపయోగ పడుతుంది..





అక్కడ హీరోయిజం లేదు.. ఓటిటి కంటెంట్ పై తమన్నా షాకింగ్ కామెంట్స్..!

అల్లు శిరీష్ ఈసారి గట్టిగానే ఫిక్స్ అయినట్లు ఉన్నాడు గా!!

విక్రమార్కుడు సినిమాకు @ 15 యేళ్లు..

“సలార్”లో శృతి రోల్ అదేనా..?

"మా" ఎన్నిక‌ల్లో సెటిలర్లెవ‌రు? స్థానికులెవ‌రు?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు అమృతాంజ‌న్ కావాలి?

సింగర్ వాణీ జ‌య‌రామ్ గురించి మీకు తెలియని నిజాలివే..!!

ఏకే రీమేక్ పవన్ నిజ జీవితానికి ఇలా రిలేట్ అయ్యిందా!!

కాలు లేకపోయినా కదంతొక్కిన నటుడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>