PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/chirnajeevi-jaganb6c29a6e-09a8-46d5-a1da-61c23a5065b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/chirnajeevi-jaganb6c29a6e-09a8-46d5-a1da-61c23a5065b9-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎక్కువ సపోర్ట్‌గా ఉండే సినీ హీరో ఎవరంటే? ఠక్కున మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పేయొచ్చు. రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమా రంగంలో సత్తా చాటుతున్న చిరు, సందర్భాన్ని బట్టి అటు కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఇటు జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతూనే ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న చిరు..సినిమా ఇండస్ట్రీకు సంబంధించిన విషయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.chiranjeevi{#}Amaravati;Vishakapatnam;job;un employment;Raccha;Varsham;Chiranjeevi;politics;KCR;Andhra Pradesh;Hero;Cinema;Coronavirus;Jagan;Telugu;Governmentచిరుని రౌండప్ చేసేశారుగా...!చిరుని రౌండప్ చేసేశారుగా...!chiranjeevi{#}Amaravati;Vishakapatnam;job;un employment;Raccha;Varsham;Chiranjeevi;politics;KCR;Andhra Pradesh;Hero;Cinema;Coronavirus;Jagan;Telugu;GovernmentWed, 23 Jun 2021 13:30:00 GMTరెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎక్కువ సపోర్ట్‌గా ఉండే సినీ హీరో ఎవరంటే? ఠక్కున మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పేయొచ్చు. రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమా రంగంలో సత్తా చాటుతున్న చిరు, సందర్భాన్ని బట్టి అటు కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఇటు జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతూనే ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న చిరు..సినిమా ఇండస్ట్రీకు సంబంధించిన విషయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


తాజాగా కూడా జగన్ ప్రభుత్వాన్ని చిరు పొగిడారు. జగన్ ప్రభుత్వం ఒక్కరోజులోనే 13 లక్షల 70 వేల మందికి టీకాలు వేశామని ప్రకటించింది. దీనిపై చిరు స్పందిస్తూ, ఇది తాను కూడా చూశానని, గొప్పగా చేసారంటూ జగన్ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఇక్కడ నుంచే అసలు రచ్చ మొదలైంది. ప్రభుత్వం మంచి చేసినప్పుడు పొగడటంలో తప్పు లేదు గానీ, ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా చిరుపైన ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.


పైగా అయిదురోజుల పాటు వ్యాక్సినేషన్ ఆపేసి ఒక్కరోజే వేసి రికార్డు అని ఏపీ ప్రభుత్వం చెప్పడం, దాన్ని చిరు పొగడటం కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయని అంటున్నారు. అయినా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిపై చిరు పెద్దగా స్పందించిన సందర్భాలు లేవని అంటున్నారు. ఇప్పటికే నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ పేరిట జగన్ ప్రభుత్వం కేవలం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు.


అటు రాష్ట్రంలో పిల్లల పరీక్షల నుంచి రైతుల వరకు అనేక సమస్యలు ఉన్నాయి. కరోనా వల్ల చాలామంది ఆర్ధికంగా క్రుంగిపోయారు. కానీ ఇలాంటి సమస్యలపై చిరు సోషల్ మీడియాలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఒకసారి స్పందించిన చిరు, అమరావతి రైతుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని పలు రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  మొత్తానికైతే ఏపీలో ఓ రాజకీయ వర్గం చిరుని గట్టిగానే రౌండప్ చేసినట్లు కనిపిస్తోంది.




పవన్ ఆ సినిమా చేయడానికి కారణం ఎవరంటే...?

కరోనా థర్డ్ వేవ్: తీసుకోవలసిన జాగ్రత్తలివే ... ?

మెంటల్ మామలా జగన్?

హైకోర్టులో నివేదిక సమర్పించిన డిహెచ్.. ఏం చెప్పారో తెలుసా?

హుజురాబాద్ లో బీజేపీదే విజయం..?

జ‌గ‌న్ తొలి కేబినెట్లో ఎవ‌రికెన్ని మార్కులు...!

నేషనల్ అవార్డు కోసం చిరంజీవి ప్రయత్నం..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ క్యాటగిరి లో చూడండి.

టాలీవుడ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి చేసిన సినిమాలివే!!

మన స్టార్ హీరోయిన్లు చేసిన ఈ సినిమాలను ఎప్పుడు చేసారో కూడా గుర్తు పట్టలేము



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>