MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/uno-public-service-dayb97c28d2-cb77-4550-abaf-d525f7a10599-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/uno-public-service-dayb97c28d2-cb77-4550-abaf-d525f7a10599-415x250-IndiaHerald.jpgప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సరైన పాలన అందించడం ఆయా దేశాల కర్తవ్యం. కానీ కొన్ని దేశాలలో మాత్రం స్వార్థపూరితంగా నియంతృత్వ పాలనకు ఒడి గడుతున్నారు. ఇటువంటి వాటిని కొంతవరకైనా తగ్గించడానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం డిసెంబ‌ర్ 22, 2002న 57/277 ను తీసుకువచ్చింది.UNO-PUBLIC-SERVICE-DAY{#}Sonu Sood;oxygen;Coronavirus;Mumbai;media;Government;June;Cinemaసేవకు రియల్ మీనింగ్ సోనూ సూద్!సేవకు రియల్ మీనింగ్ సోనూ సూద్!UNO-PUBLIC-SERVICE-DAY{#}Sonu Sood;oxygen;Coronavirus;Mumbai;media;Government;June;CinemaWed, 23 Jun 2021 12:00:00 GMTప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సరైన పాలన అందించడం ఆయా దేశాల కర్తవ్యం. కానీ కొన్ని దేశాలలో మాత్రం స్వార్థపూరితంగా నియంతృత్వ పాలనకు ఒడి గడుతున్నారు. ఇటువంటి వాటిని కొంతవరకైనా తగ్గించడానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం డిసెంబ‌ర్ 22, 2002న 57/277 ను తీసుకువచ్చింది. ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 23 న ఐక్యరాజ్యసమితి ప్రజా సేవా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఆ విధంగా ఈ రోజు ప్రపంచమంతా ప్రజా సేవా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రభుత్వంలో ఉన్న అధికారుల పనితీరు బాలేకపోతే వారి తప్పులను వారికీ తెలియచేసి, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం. అదే విధంగా వారి యొక్క విధి నిర్వహణలో ఎంతో నిజాయితీగా కర్తవ్యమే పరమావధిగా భావించే అధికారులను గౌరవించడం అలవాటుగా వస్తోంది.  ఏ దేశంలో అయితే ప్రజలకు సరైన పాలన అందదో, ఆ దేశం అభివృద్ధి చెందడం కుదరకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క దేశంలో అధికారులు మరియు రాజకీయ నాయకులు ప్రజల సేవపైనే దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సందర్భంగా కరోనా కారణంగా ప్రపంచమంతా ఎన్నో కష్టాలను అనుభవించింది. ప్రజలందరికీ ఎప్పుడూ జరగని నష్టం వాటిల్లింది. కరోనా వైరస్ ఒక భీభత్సాన్ని సృష్టించింది.
ముఖ్యంగా భారతదేశ ప్రజలు అల్లాడిపోయారు. ఒకానొక దశలో ప్రభుత్వాలే పూర్తిగా చేతులెత్తేశాయి. రోజుకి లక్షల్లో కేసులు వస్తున్న వేళ ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడంలోనూ, నియంత్రించడంలోనూ అన్ని విధాలుగా భారత ప్రభుత్వం విఫలమైందని  అనేక వార్తా పత్రికలు మీడియా వారు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో ఒక సినిమా నటుడు నేనున్నానంటూ ముందుకు వచ్చి దాదాపుగా ఒక చిన్న పాటి ప్రభుత్వం లాగా ప్రజలకు సహాయసహకారాలు అందించిన వైనం వెలకట్టలేనిది. ప్రముఖ నటుడు సోనూసూద్ గతేడాది కరోనా సమయంలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు. వీరికి ఏదైనా చెయ్యాలి అనే సదుద్దేశంతో ఆనాడు ఒక్కడే తన సొంత డబ్బుతో ప్రజలను అనేక విధాలుగా ఆదుకున్నాడు. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.

 * కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తమ సొంతూరికి కూడా వెల్లలేక ఇబ్బంది పడుతున్న వలస కార్మికులను తన సొంత ఖర్చుతో రవాణా సౌకర్యాన్ని కల్పించాడు.
 * చాలామంది వారి సొంతూళ్లకు వెళ్ళడానికి రవాణా సౌకర్యం లేక కాలినడకన వెళుతున్నప్పుడు, దారి మధ్యలో వారికి ఆహార సదుపాయాలను ఏర్పాటు చేశాడు.
 
* ముంబై పరిసర ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయిన ఎంతోమందికి ఉపాధిని కల్పించాడు.

* కరోనా సోకి ఇబ్బంది పడుతున్న వారికి హాస్పిటల్ లో అడ్మిషన్, బెడ్స్ దొరకని వారికి సహాయం చేశాడు.

* ముఖ్యంగా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ సమస్య అథైనాథ ప్రమాదకరంగా మారింది. దీని కొరత కారణంగా బ్రతకాల్సిన ఎంతోమంది చనిపోవడం అందరి మనసుల్ని తీవ్రంగా కలచివేసింది. సోనూ సూద్ ఆక్సిజన్ అవసరమైన వారికి తన వ్యక్తుల ద్వారా ఎక్కడికో కావాలన్నా గంటల్లో ఏర్పాటు చేస్తూ వచ్చారు.

* కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఉపయోగించే రెండేసివెర్ ఇంజక్షన్ లను సదరు రోగులకు అందేలా చేశాడు.

*  ఈయన చేస్తున్న సేవకు ఎంతోమంది ఈయన చేసే కార్యక్రమాల్లో భాగమయ్యారు. తద్వారా ఈయన సేవలు దేశమంతా విస్తరింపచేశాడు. ఈయన టీమ్ 24 గంటలు ఈ పనిమీదనే ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్ లను కొద నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 ఇలా సోను సూద్ సేవలను ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కారొనకు ముందు ప్రజలంతా కనబడని దేవుడి కోసం మొక్కేవారు. కానీ కరోనా సమయంలో సోనూ సూద్ సహాయానికి ఆయననే దేవుడిలా కొలుస్తున్నారు. ఒక మానవుడు పూర్తి స్థాయిలో సహాయం చేయాలి అనుకుంటే ఎలా ఉంటుందో చేసి చూపించాడు. ఈ రోజు ఐక్యరాజ్యసమితి ప్రజా సేవా దినోత్సవంలో భాగంగా సోనూసూద్ చేస్తున్న సేవలు అభినందనీయం, హర్షణీయం.




మహిళ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ!

దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు..?

వ్యాక్సిన్.. స్టార్ట్.. కెమెరా.. మన స్టార్స్ ఫుల్ బిజీ..!!

మొదటి సినిమాతోనే ఇంత క్రేజ్ ఏ హీరోయిన్ కి రాదేమో..

ఎన్టీఆర్‌-కొర‌టాల మూవీలో హీరోయిన్ ఎవరంటే...?

ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సరైన పాలన అందించడం ఆయా దేశాల కర్తవ్యం. కానీ కొన్ని దేశాలలో మాత్రం స్వార్థపూరితంగా నియంతృత్వ పాలనకు ఒడి గడుతున్నారు. ఇటువంటి వాటిని కొంతవరకైనా తగ్గించడానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం డిసెంబ‌ర్ 22, 2002న 57/277 ను తీసుకువచ్చింది.

దేశంలో పెరుగుతున్న డెల్టా ప్లస్ కేసులు..!!

ఇకపై అందరికీ చేరువలో ఉంటానంటున్న అనుష్క..

తొలి సినిమాతోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అవడం అందుకే చెల్లింది..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>