PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp0d2993c3-d258-4c22-86e3-90ee41257940-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp0d2993c3-d258-4c22-86e3-90ee41257940-415x250-IndiaHerald.jpgసాధారణంగా రాజకీయ పార్టీల అధినాయకులు, తమ సొంత జిల్లాల్లో పార్టీని చాలా స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకుంటారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దానికి విరుద్ధంగా ఉంటారు. కడప జిల్లాలో జగన్‌కు ఎంత బలం ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మాత్రం టీడీపీకి పెద్ద బలం ఉండదు. గత కొన్నేళ్లుగా చిత్తూరులో టీడీపీ సత్తా చాటలేకపోతుంది.tdp{#}Hanu Raghavapudi;kadapa;Nellore;Chittoor;Srikalahasti;kuppam;Parliment;Assembly;Punganur;Narasimha;Rajampet;TDP;YCP;District;CBN;Tirupatiబాబు సొంత జిల్లాలో ఆ ముగ్గురు చేతులెత్తేసినట్లేనా!బాబు సొంత జిల్లాలో ఆ ముగ్గురు చేతులెత్తేసినట్లేనా!tdp{#}Hanu Raghavapudi;kadapa;Nellore;Chittoor;Srikalahasti;kuppam;Parliment;Assembly;Punganur;Narasimha;Rajampet;TDP;YCP;District;CBN;TirupatiTue, 22 Jun 2021 02:00:00 GMTసాధారణంగా రాజకీయ పార్టీల అధినాయకులు, తమ సొంత జిల్లాల్లో పార్టీని చాలా స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకుంటారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దానికి విరుద్ధంగా ఉంటారు. కడప జిల్లాలో జగన్‌కు ఎంత బలం ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మాత్రం టీడీపీకి పెద్ద బలం ఉండదు.  గత కొన్నేళ్లుగా చిత్తూరులో టీడీపీ సత్తా చాటలేకపోతుంది.


అసలు 2019 ఎన్నికల్లో అయితే చిత్తూరులో టీడీపీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉంటే వైసీపీ 13 గెలుచుకుంది. టీడీపీ ఒకచోట గెలిచింది..అది కూడా కుప్పంలో చంద్రబాబు గెలిచారు. ఎన్నికలై రెండేళ్ళు దాటేసింది. ఈ రెండేళ్ల కాలంలో చిత్తూరులో టీడీపీ మాత్రం బలపడలేదు. ఆఖరికి పార్లమెంట్ స్థానాల వారీగా టీడీపీ అధ్యక్షులని పెట్టిన పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.


చిత్తూరు పార్లమెంట్ స్థానానికి పులివర్తి నాని, తిరుపతికి నరసింహ యాదవ్‌లు అధ్యక్షులుగా ఉన్నారు. అటు చిత్తూరులోని కొన్ని అసెంబ్లీ స్థానాలున్న రాజంపేట పార్లమెంట్‌కు శ్రీనివాసులురెడ్డి అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ ముగ్గురు నేతలు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోయారు. కనీసం వైసీపీకి పోటీగా అభ్యర్ధులని నిలబెట్టలేకపోయారు.


చిత్తూరు పార్లమెంట్ పరిధిలో చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక తిరుపతి పరిధిలో సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలు ఉండగా, మిగిలిన  నాలుగు స్థానాలు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. అటు రాజంపేట పరిధిలో తంబళ్ళపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి. రాజంపేటలో మిగిలిన మూడు స్థానాలు కడప జిల్లా పరిధిలో ఉన్నాయి.


ఇలా చిత్తూరు పరిధిలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 చోట్ల టీడీపీ వీక్‌గానే కనిపిస్తోంది. కుప్పంలో సైతం పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడింది. కాకపోతే అక్కడ చంద్రబాబు ఉన్నారు కాబట్టి, పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఏదేమైనా గానీ చిత్తూరులో టీడీపీని బలోపేతం చేయడంలో ముగ్గురు టీడీపీ అధ్యక్షులు ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సామినేని విప్‌తోనే సరిపెట్టుకుంటారా?

కలిసిపోతే అక్కడ సైకిల్‌దే హవా...!

ఆ ఎంపీలు వల్ల ఉపయోగం లేదా?

రాజోలులో జనసేనని సెట్ చేయరా?

బాలయ్య చిన్నల్లుడు సీటు మార్చుకుంటారా?

ఆంధ్రాలో భారీగా తగ్గిన కరోనా కేసులు...

పొలానికి వెళ్లిన కూతురు.. తిరిగి రాలేదు.. చివరకి..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో తల్లీకూతుళ్లు వీళ్లే..

కృష్ణా జిల్లాల్లో ప్రతిపక్ష టీడీపీ కష్టాల్లో ఉన్న నియోజకవర్గాల్లో నూజివీడు ఒకటి. మొదట నుంచి ఇక్కడ టీడీపీకి కాస్త అనుకూలంగా ఉండేది. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన 9 ఎన్నికల్లో టీడీపీ ఐదు సార్లు విజయం సాధించింది. రెండు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ గెలిచింది. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ టీడీపీకి గెలుపు దక్కడం లేదు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>